E-Paper
Advertisement

రూ.10వేల లోపే ఇలాంటి ఫోనా? లావా దెబ్బకు చైనా బ్రాండ్లు విలవిల!

రూ.10వేల లోపే ఇలాంటి ఫోనా? లావా దెబ్బకు చైనా బ్రాండ్లు విలవిల!
Advertisement

Lava Smart 4 Plus: దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్.. బడ్జెట్ ధరలో సరికొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ‘లావా స్మార్ట్ 4 ప్లస్’ పేరుతో విడుదలైన ఈ మొబైల్‌ కేవలం రూ.9,999 ధరకే అందుబాటులో ఉంది. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లు కోరుకునే వారికి ఒక చక్కని ఎంపిక కానుంది.

డిస్‌ప్లే, డిజైన్ ఎలా ఉందంటే?

ఈ ఫోన్ నీలగిరి బ్లూ, హిమాలయన్ సిల్వర్ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. దీనిలో 6.75 ఇంచుల పెద్ద హెచ్‌డీ ప్లస్ స్క్రీన్‌ను అందించారు. దీంతో వీడియోలు చూడటానికి, గేమ్స్ ఆడటానికి డిస్‌ప్లే చాలా బాగుంటుంది. దీనికి తోడు 90Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల ఫోన్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. దుమ్ము, నీటి తుంపర్ల నుంచి రక్షణ కోసం దీనికి ఐపీ64 రేటింగ్ కూడా ఇచ్చారు.

మెరుగైన పనితీరు:

Advertisement

లావా స్మార్ట్ 4 ప్లస్ ఆండ్రాయిడ్ 15 గో ఎడిషన్‌పై రన్ అవుతుంది. దీనిలో ఆక్టాకోర్ యూనిసోక్ 9863a ప్రాసెసర్‌ను ఉపయోగించారు. అలాగే 4GB RAM, 64GB స్టోరేజ్ వేరియంట్‌లో ఇది లభిస్తుంది. అవసరమైతే వర్చువల్ RAM ఫీచర్ ద్వారా దీనిని 8GB వరకు పెంచుకోవచ్చు. ఇక కెమెరాల విషయానికి వస్తే.. వెనుక వైపు 13MP ప్రధాన కెమెరాతో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో 5MP కెమెరాను అమర్చారు.

Also Read: భారత్‌లో వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4 లాంచ్.. 54 గంటల బ్యాటరీ లైఫ్, బడ్జెట్ ధరలోనే!

బ్యాటరీ సామర్థ్యం ఎంతంటే?

Advertisement

ఈ ఫోన్‌లో 5000mAh సామర్థ్యం గల పెద్ద బ్యాటరీని ఇచ్చారు. ఇది టైప్-సి పోర్ట్ ద్వారా 10W ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. బడ్జెట్ ధరలో రోజంతా బ్యాటరీ బ్యాకప్ కావాలనుకునే వారికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. కనెక్టివిటీ పరంగా 4G, బ్లూటూత్, వై-ఫై వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇంటి వద్దే సర్వీస్:

భారతదేశంలో ఈ ఫోన్ సింగిల్ వేరియంట్ ధర రూ.9,999గా ఉంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ రిటైల్ అవుట్‌లెట్లలో అందుబాటులో ఉంటుంది. వినియోగదారుల కోసం కంపెనీ రెండేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఉంటాయని హామీ ఇచ్చింది. అంతేకాదు.. ఫోన్ కొనుగోలు చేసిన వారికి ఇంటి వద్దకే వచ్చి సర్వీస్ అందించే (డోర్‌స్టెప్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్) ప్రత్యేక సౌకర్యాన్ని కూడా లావా సంస్థ ప్రకటించింది.

Also Read: బడ్జెట్ ధరలో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. iQOO Neo 11S స్పెసిఫికేషన్స్ చూశారా?

Related News

UPI యూజర్లకు బిగ్ రిలీఫ్.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆఫీషియల్ క్లారిటీ వచ్చేసింది!

నాయిస్ ఐకాన్ బజ్ స్మార్ట్‌వాచ్‌పై భారీ డిస్కౌంట్..వెంటనే కొనేయండి

Pixel 11 Pro Fold వచ్చేస్తోంది.. గూగుల్ రిలీజ్ చేసిన టీజర్ చూశారా? డిజైన్ అదిరిపోయింది!

అమెజాన్ సేల్‌లో బ్లాక్‌బస్టర్ ఆఫర్.. రూ.10,000 తగ్గిన Samsung Galaxy A56 5G ధర!

క్యాడ్లెక్ మల్టీషెఫ్ ప్రో.. క్షణాల్లోనే ఒకే డివైజ్‌తో 3 రకాల ఫుడ్స్ రెడీ

మ్యాప్స్ నుంచి నేరుగా ఫుడ్ ఆర్డర్, హోటల్ బుకింగ్.. గూగుల్ తెచ్చిన కొత్త AI అప్‌డేట్ చూశారా?

బిజినెస్ కోసం బెస్ట్ డీప్ ఫ్రీజర్ కావాలా? టాప్ 5 బ్రాండ్స్, ఫీచర్స్!

అమెజాన్ ఫ్రీడమ్ సేల్ 2026..సీసీ కెమెరాలపై భారీ డిస్కౌంట్లు!

Big Stories

Advertisement
×