E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

రూ.9,999కే ఆండ్రాయిడ్ 15, ఫ్రీ హోమ్ సర్వీస్.. లావా స్మార్ట్ 4 ప్లస్ ఫీచర్లు ఇవే!

రూ.9,999కే ఆండ్రాయిడ్ 15, ఫ్రీ హోమ్ సర్వీస్.. లావా స్మార్ట్ 4 ప్లస్ ఫీచర్లు ఇవే!
Advertisement

Lava Smart 4 Plus: మీ బడ్జెట్ 10 వేల రూపాయల కంటే.. తక్కువ ఉందా? స్టైలిష్ లుక్, రోజంతా వచ్చే పవర్‌ఫుల్ బ్యాటరీ, పెద్ద స్క్రీన్ ఉన్న ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే మీ కోసమే.. ఇండియన్ మొబైల్ బ్రాండ్ లావా (Lava) సరికొత్తగా Lava Smart 4 Plus స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. కేవలం రూ. 9,999 ధరలోనే అదిరిపోయే ఫీచర్లతో పాటు, ఇంటికే వచ్చి రిపేర్ చేసే ‘ఫ్రీ సర్వీస్ ఎట్ హోమ్’ ఆఫర్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. దీనిపై ఒక లుక్కేద్దాం రండి.

లావా నుంచి ‘నో టెన్షన్’ ఫోన్:

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో బడ్జెట్ ఫోన్లకు ఎప్పుడూ డిమాండ్ ఎక్కువే. ముఖ్యంగా 10 వేల లోపు ధరలో మంచి డిజైన్, మంచి బ్యాటరీ లైఫ్ ఆశించే యూజర్లను టార్గెట్ చేస్తూ లావా కంపెనీ తన సరి కొత్త “స్మార్ట్ సిరీస్” లో మొదటి ఫోన్ అయిన Lava Smart 4 Plus ను గ్రాండ్‌గా లాంచ్ చేసింది. కంపెనీ దీనిని ఒక ‘నో టెన్షన్’ ఫోన్‌గా ప్రమోట్ చేస్తోంది. అంటే తక్కువ ధరలో ఎలాంటి ల్యాగ్స్ లేకుండా స్మూత్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని అర్థం.

Advertisement

కళ్లు చెదిరే డిస్‌ప్లే:

ఈ ఫోన్‌లో మొదటిగా ఆకట్టుకునేది దీని డిస్‌ప్లే సైజ్. ఇందులో ఏకంగా 6.75-ఇంచుల HD+ IPS LCD స్క్రీన్‌ను అందించారు. దీని వల్ల యూట్యూబ్ వీడియోలు చూడాలన్నా, సినిమాలు ఎంజాయ్ చేయాలన్నా.. విజువల్స్ చాలా పెద్దగా, క్లియర్‌గా కనిపిస్తాయి. అంతేకాదు.. బడ్జెట్ ఫోన్ అయినప్పటికీ ఇందులో 90Hz రీఫ్రెష్ రేట్ ఇచ్చారు. దీని వల్ల స్క్రీన్ స్క్రోలింగ్, యాప్స్ ఓపెన్ చేసేటప్పుడు చాలా స్మూత్‌గా అనిపిస్తుంది.

Advertisement

పవర్‌ఫుల్ బ్యాటరీ:
ఈ ఫోన్ యొక్క మెయిన్ హైలైట్ దీని బ్యాటరీ కెపాసిటీ. ఇందులో 5,000mAh బ్యాటరీని అమర్చారు. నార్మల్ యూసేజ్‌లో ఈ బ్యాటరీ ఒకటిన్నర నుంచి రెండు రోజుల పాటు వస్తుంది. దీనికి తోడు బాక్స్‌లోనే 10W చార్జర్ ,టైప్-సి పోర్ట్ సపోర్ట్ లభిస్తుంది.

ఫీచర్లు , పర్ఫార్మెన్స్:
ప్రాసెసర్: ఈ మొబైల్‌లో రోజువారీ పనులను ఈజీగా మేనేజ్ చేయడానికి Unisoc 9863A ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు.

ర్యామ్ & స్టోరేజ్: ఇందులో 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా దీనిని మరో 4GB వరకు పెంచుకోవచ్చు (మొత్తం 8GB ర్యామ్ ఎక్స్‌పీరియన్స్). మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 256GB వరకు పెంచుకునే ఛాన్స్ ఉంది.

ఆపరేటింగ్ సిస్టమ్: లేటెస్ట్ Android 15 (Go Edition) పై ఈ ఫోన్ రన్ అవుతుంది. దీంతో పాటు రెండేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ హామీ ఇచ్చింది.

డ్యూరబిలిటీ: వర్షపు జల్లులు, ధూళి నుంచి ఫోన్‌కు రక్షణగా ఇందులో IP64 రేటింగ్ ఇవ్వడం విశేషం. ఈ ప్రైస్ రేంజ్‌లో ఇది చాలా రేర్ ఫీచర్.

కెమెరా సెటప్ ఎలా ఉందంటే?

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. లావా స్మార్ట్ 4 ప్లస్ వెనుక భాగంలో 13MP AI డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో నైట్ మోడ్, పోర్ట్రెయిట్ మోడ్, హెచ్‌డిఆర్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం , వీడియో కాల్స్ కోసం బ్యూటీ మోడ్ సపోర్ట్‌తో కూడిన 5MP ఫ్రంట్ కెమెరా ఉంది.

ధర, కలర్స్:
Lava Smart 4 Plus సింగిల్ వేరియంట్ (4GB + 64GB) ధరను రూ. 9,999 గా నిర్ణయించారు. ఇది ‘నీలగిరి బ్లూ’, ‘హిమాలయన్ సిల్వర్’అనే రెండు ట్రెండీ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఫోన్‌ను ఆఫ్‌లైన్ రీటైల్ స్టోర్లలో సులభమైన ఫైనాన్స్ ఈఎంఐ ఆప్షన్లతో కొనవచ్చు.

Also Read: సూపర్ ఫాస్ట్ కూలింగ్‌తో.. దుమ్మురేపుతున్న 5 బెస్ట్ స్ప్లిట్ ఏసీలు!

లావా సూపర్ ప్లస్ పాయింట్: ఒకవేళ ఫోన్ కొన్నాక ఏవైనా సమస్యలు వస్తే.. సర్వీస్ సెంటర్‌కు వెళ్లాల్సిన పని లేదు. లావా కంపెనీ అందించే ‘Free Service @ Home’ ద్వారా టెక్నీషియన్ నేరుగా మీ ఇంటికే వచ్చి ఉచితంగా సర్వీస్ అందిస్తారు.

మెరుగైన నెట్‌వర్క్ కనెక్టివిటీ (Band 28 సపోర్ట్), బిగ్ బ్యాటరీతో వచ్చిన Lava Smart 4 Plus ఈ బడ్జెట్‌లో మంచి మేడ్ ఇన్ ఇండియా ఆప్షన్. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ వాల్యూ ఆశించే విద్యార్థులకు, పేరెంట్స్‌కు, సెకండరీ ఫోన్ కావాలనుకునే వారికి ఇది పర్‌ఫెక్ట్ ఛాయిస్.

Related News

17600mAh బ్యాటరీ, ఇన్‌బిల్ట్ ప్రొజెక్టర్‌తో 8849 Tank 5 స్మార్ట్‌ఫోన్ విడుదల.. ధర ఎంతంటే?

కిచెన్ లో ఇది ఉంటే చాలు.. రూపాయి ఖర్చు లేకుండా సూపర్ టేస్టీ జ్యూస్ రెడీ

టచ్‌ప్యాడ్ vs మౌస్.. ల్యాప్‌టాప్ వాడేవారికి ఏది బెస్ట్ చాయిస్?

ఆండ్రాయిడ్ 16తో వచ్చేసిన Samsung Galaxy A27 5G.. ఏకంగా 6 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్!

వర్షంలో ఫోన్ తీసుకెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకో మామ.. లేదంటే మెుబైల్ మటాషే!

రోజూ అంట్లు తోమి విసిగిపోయారా? ఈ డిష్‌వాషర్లు కొంటే.. మీ కష్టాలన్నీ తీరినట్లే!

ఇక ఫోన్ దొంగతనం చేస్తే దొంగలకే రిస్క్.. Kill Switchతో మొబైల్ ఎక్కడున్నా బ్లాక్ అయిపోద్ది!

Big Stories

×