E-Paper
Advertisement

టచ్‌ప్యాడ్ vs మౌస్.. ల్యాప్‌టాప్ వాడేవారికి ఏది బెస్ట్ చాయిస్?

టచ్‌ప్యాడ్ vs మౌస్.. ల్యాప్‌టాప్ వాడేవారికి ఏది బెస్ట్ చాయిస్?
Advertisement

Touchpad vs Mouse: ల్యాప్ టాప్ యూజర్లకు ప్రధాన ఓ సందేహం వెంటాడుతూ ఉంటుంది. ల్యాప్‌టాప్‌తో పాటే వచ్చే టచ్‌ప్యాడ్ (Touchpad) వాడటం బెటరా? లేదా విడిగా ఒక మౌస్ (Mouse) కొనుక్కుని వాడుకోవడం మంచిదా? అని తెగ ఆలోచిస్తుంచారు. నిజానికి ఈ రెండింటికీ వాటి వాటి ప్రత్యేకతలు, పరిమితులు ఉన్నాయని చెప్పవచ్చు. యూజర్లకు సందర్భాన్ని బట్టి.. దేనికదే ప్రత్యేకమైన ప్రయోజనాన్ని అందిస్తాయి. అయితే రెండింటిలో ల్యాప్ టాప్ యూజర్ కు ఏది బెస్ట్? దేనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

వాటిలో టచ్‌ప్యాడ్‌దే పైచేయి

ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ, బెడ్‌పై కూర్చుని లేదా కాఫీ షాపుల్లో ల్యాప్‌టాప్ వాడుతుంటే టచ్‌ప్యాడ్ బెస్ట్ అని చెప్పవచ్చు. దీనికోసం విడిగా ఎలాంటి వైర్లు, అదనపు స్థలం అవసరం లేదు. కేవలం ల్యాప్‌టాప్ ఉంటే చాలు. ఎక్కడైనా సులువుగా పని చేసుకోవచ్చు. మౌస్ లాగా దీన్ని విడిగా బ్యాగ్‌లో పెట్టుకుని మోయాల్సిన భారం ఉండదు. అలాగే బ్యాటరీ అయిపోతుందనే టెన్షన్ అస్సలు ఉండదు.

మౌస్ బెనిఫిట్స్ ఇవే..

Advertisement

ఫోటోషాప్ లాంటి ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ వాడేటప్పుడు, కోడింగ్ చేసేటప్పుడు లేదా గేమింగ్ ఆడేటప్పుడు మౌస్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అది అందించే ఫాస్ట్ పనితీరును టచ్‌ప్యాడ్ ఇవ్వలేదు. స్క్రీన్‌పై ఒక చిన్న పాయింట్‌ను క్లిక్ చేయాలన్నా, ఒక ఫైల్‌ను డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలన్నా ఆ పనిని మౌస్ చాలా తేలిగ్గా చేసేస్తుంది. ఎక్కువ సేపు ల్యాప్‌టాప్ ముందు కూర్చుని పని చేసే ప్రొఫెషనల్స్‌కు మౌస్ చాలా సమయాన్ని ఆదా చేస్తుందని చెప్పొచ్చు.

ఆరోగ్యం, శారీరక శ్రమ

గంటల తరబడి టచ్‌ప్యాడ్ వాడటం వల్ల చేతి వేళ్లు, మణికట్టుపై ఒత్తిడి పడే అవకాశముంది. దీనివల్ల లాంగ్ రన్‌లో ‘కార్పల్ టన్నెల్ సిండ్రోమ్’ వంటి నొప్పులు వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే ఎర్గోనామిక్ డిజైన్‌తో వచ్చే మౌస్‌లను వాడటం వల్ల చేయి సహజమైన స్థితిలో ఉంటుంది. కాబట్టి ఆఫీస్ వర్క్ లేదా లాంగ్ అవర్స్ పని చేసే వారికి ఆరోగ్య పరంగా మౌస్ వాడటమే మంచిది.

Advertisement

Also Read: వర్షంలో ఫోన్ తీసుకెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకో మామ.. లేదంటే మెుబైల్ మటాషే!

పైనల్గా ఏది బెస్ట్?

కేవలం బ్రౌజింగ్, ఈమెయిల్స్, సినిమాలు చూడటం, ప్రయాణాలలో ల్యాప్‌టాప్ వాడటం అయితే టచ్‌ప్యాడ్ సరిపోతుంది. కానీ ఆఫీస్ టేబుల్ దగ్గర కూర్చుని ఎడిటింగ్, గేమింగ్, డేటా ఎంట్రీ లాంటి పెద్ద పనులు చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఒక మంచి మౌస్ కొనుక్కోవడం బెస్ట్ అని నిపుణులు తేల్చి చెబుతున్నారు. కాబట్టి మీ అవసరానికి ఏది సరిగ్గా సరిపోతుందో చూసి మీరే ఎంచుకోండి.

Also Read: మీ ఫోన్ హ్యాక్ అయిందా? ఈ 5 సంకేతాలు ఉంటే.. ప్రమాదంలో పడ్డట్లే!

Related News

ఇలాంటి ఫ్రిజ్ ఇంట్లో ఉంటే..15 రోజులైనా ఫ్రెష్ ఫుడ్

సెప్టెంబర్ 4 నుంచి గూగుల్ అసిస్టెంట్ బంద్.. ఇకపై అంతా Gemini మయం!

సూపర్ ఆఫర్.. ‘గూగుల్ పిక్సెల్ 10’ పై ఏకంగా రూ. 24,000 తగ్గింపు.. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో బంపర్ డీల్!

డెస్క్‌టాప్ vs ల్యాప్‌టాప్.. ఇంటి నుంచి వర్క్ చేయడానికి.. రెండింట్లో ఏది బెస్ట్?

నెట్ స్లోగా ఉందా? మీ ఏరియాలో 5G ఉందో లేదో ఇలా చెక్ చేయండి!

యూట్యూబ్ మోనిటైజేషన్ నిబంధనలు మార్పు.. కొత్త క్రియేటర్లకు మరిన్ని సవాళ్లు!

రూ.41,000 తగ్గింపు గురూ.. Amazon Freedom Saleలో మునుపెన్నడూ చూడని షాకింగ్ ఆఫర్లు!

ఏఐ టెక్నాలజీతో హైయర్ సరికొత్త వాషింగ్ మెషీన్.. బట్టలపై నూనె, టీ మరకలు క్షణాల్లో మాయం!

Big Stories

Advertisement
×