BigTV English

9 South actors who own private jets : ప్రభాస్ నుంచి రామ్ చరణ్ దాకా… లగ్జరీ ప్రైవేట్ జెట్స్ ఉన్న స్టార్స్ వీళ్ళే

9 South actors who own private jets : ప్రభాస్ నుంచి రామ్ చరణ్ దాకా… లగ్జరీ ప్రైవేట్ జెట్స్ ఉన్న స్టార్స్ వీళ్ళే

9 South actors who own private jets : ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే రేంజ్ కు ఎదిగిపోయారు. అయితే వాళ్ల రెమ్యూనరేషన్ తో పాటు లగ్జరీ లైఫ్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. లివింగ్ లైఫ్ కింగ్ సైజ్ అనే పదానికి మన సౌత్ స్టార్స్ నిదర్శనం అని చెప్పాలి. ఖరీదైన ఆస్తులు కూడ బెట్టుకోవడమే కాదు ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టార్స్ దగ్గర ఏకంగా ఆధునిక వానిటీలతో పాటు, కోట్ల విలువైన ప్రైవేట్ జెట్లు కూడా ఉన్నాయి.


మహేష్ బాబు (Mahesh Babu)

మహేష్ బాబు గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. రాజమౌళితో ఆయన చేయబోయే సినిమానే దానికి కారణం. ఇక మహేష్ దగ్గర కూడా ఓ ప్రైవేట్ జెట్ ఉంది. ఆయన తరచూగా తన భార్య పిల్లలతో కలిసి వెకేషన్ కి ఈ జెట్ లోనే వెళతారు.


రామ్ చరణ్ (Ram Charan)

రామ్ చరణ్ ప్రస్తుతం పలు బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ లో భాగమైన సంగతి తెలిసిందే. ‘గేమ్ ఛేంజర్’ మూవీతో సంక్రాంతికి పలకరించబోతున్నారు చెర్రీ. అయితే ఆయన దగ్గర కోట్ల విలువ చేసే ట్రూజెట్ ఉందన్న విషయం ఇప్పటికే చాలామందికి తెలుసు. ఈ ప్రైవేట్ జెట్ ఆయన అత్యంత విలువైన ఆస్తులలో ఒకటి అని చెప్పొచ్చు. చెర్రీ ఈ జెట్ ను ఫ్యామిలీ వెకేషన్స్ తో పాటు సినిమాల ప్రత్యేక ఈవెంట్స్ కు వెళ్ళడానికి ఉపయోగిస్తాడు.

ప్రభాస్ (Prabhas)

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం అనగానే గుర్తొచ్చే స్టార్ ప్రభాస్. గత కొన్ని ఏళ్ల నుంచి ఆయన క్రేజ్ పీక్స్ లో ఉంది. అయితే ప్రభాస్ దగ్గర కూడా అత్యంత విలువైన జెట్ ఉంది.

అల్లు అర్జున్ (Allu Arjun)

ప్రస్తుతం ఎక్కడ చూసినా అల్లు అర్జున్ గురించే చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న బన్నీ, అభిమానగణమే కాదు ఆస్తులు కూడా భారీగానే ఉన్నాయి. అందుకే ఆయన లైఫ్ స్టైల్ విలాసవంతంగా ఉంటుంది. ఆయన దగ్గర ఆరు సీట్లతో కూడిన ప్రైవేట్ జెట్ ఉంది. స్నేహ రెడ్డితో వివాహం జరిగిన వెంటనే అల్లు అర్జున్ దీన్ని కొన్నాడు.

అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)

టాలీవుడ్ కు నాలుగు స్తంభాలుగా ఉన్న దిగ్గజ సినీ కుటుంబాల్లో అక్కినేని ఫ్యామిలీ కూడా ఒకటి. ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ దగ్గర ఒక విలాసవంతమైన ప్రైవేట్ జెట్ ఉంది.

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTr)

పాన్ ఇండియా స్టార్లుగా దూసుకెళ్తున్న హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. ఆయనకు ఆటోమొబైల్ పట్ల ప్రత్యేకమైన ప్రేమ ఉంది అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హై ఎండ్ కార్లు మార్కెట్ లోకి వస్తే చాలు అవి తన గ్యారేజ్ లో ఉండేలా చూసుకునే తారక్ దగ్గర కూడా ఓ ప్రైవేట్ జెట్ ఉంది. దీని విలువ 8 కోట్లు అని పుకారు.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గర కూడా ఒక చార్టెడ్ జెట్ ఉంది. ఆయన తన రాజకీయ వ్యవహారాలతో పాటు వ్యక్తిగత పనులకు కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఇక వీళ్ళతో పాటు రజనీకాంత్, నయనతార దగ్గర కూడా ఈ ప్రైవేట్ జెట్ లు ఉన్నాయి.

Related News

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Kissik Talks Promo : మహేష్ విట్టా లవ్ స్టోరిలో ఇన్ని ట్విస్టులా..ఆ ఒక్క కోరిక తీరలేదు..

Ritu Chaudhary : చెప్పు రీతు నువ్వు నన్ను మోసం చేయలేదా? రీతుకి కళ్యాణ్ తో బంధం తెగిపోయిందా?

Bigg boss emmanuel : నా బాధ మీకు తెలియదు, రోజు దుప్పటి కప్పుకుని ఏడుస్తాను

Siva Jyothi: గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ శివజ్యోతి..దయచేసి దిష్టి పెట్టకండి అంటూ!

Big Stories

×