E-Paper
Advertisement

ఏఐ సౌండ్ యాప్‌తో లీఫ్ బడ్స్ ఎక్స్121.. అదిరిపోయే ఫీచర్లతో లాంచ్!

ఏఐ సౌండ్ యాప్‌తో లీఫ్ బడ్స్ ఎక్స్121.. అదిరిపోయే ఫీచర్లతో లాంచ్!
Advertisement

Leaf Buds X121:  ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో వైర్‌ లెస్ ఇయర్‌ బడ్స్ వాడకం విపరీతంగా.. పెరిగిపోయింది. ప్రయాణాల్లో ఉన్నప్పుడు, వ్యాయామం చేసే సమయంలో లేదా మ్యూజిక్ వినడానికి ఇయర్‌ బడ్స్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయాయి. అయితే.. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు అందించే బ్రాండ్ కోసం.. చూస్తున్నవారికి ‘లీఫ్’సంస్థ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయాన్ని తెచ్చింది. అదే ‘లీఫ్ బడ్స్ ఎక్స్121 ట్రూ.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్’. కార్బన్ బ్లాక్ కలర్‌లో.. అత్యంత ఆకర్షణీయంగా లభించే.. ఈ ఇయర్‌ బడ్స్, కేవలం రూ.599 బడ్జెట్‌లోనే.. శక్తి వంతమైన ఆడియో ఫీల్ అందిస్తాయి. ఏఐ సౌండ్ యాప్ సపోర్ట్, బెస్ట్ బ్యాటరీ లైఫ్, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి లేటెస్ట్ హంగులతో.. వస్తున్న ఈ డివైస్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Leaf Buds X121 ఫీచర్లు:

1.డిజైన్,లుక్:

ఈ ఇయర్‌ బడ్స్ కార్బన్ బ్లాక్ కలర్ ఫినిషింగ్‌తో.. చాలా స్టైలిష్‌గా కనిపిస్తాయి. ఇన్-ఇయర్ డిజైన్ కలిగి ఉండటం వల్ల ఇవి చెవుల్లో చాలా సౌకర్యంగా కూర్చుంటాయి. ఎక్కువ సేపు పెట్టుకున్నా.. ఎలాంటి అసౌకర్యం కలగదు. వీటి తేలికపాటి బరువు కారణంగా జేబులో లేదా చిన్న పర్సులో ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు.

Advertisement

2.ఏఐ సౌండ్ యాప్, ఆడియో పర్ఫార్మెన్స్:

ఈ ప్రైస్ రేంజ్‌లో లీఫ్ బడ్స్ ఎక్స్121 అందించే.. అతిపెద్ద ప్రత్యేకత ‘ఏఐ సౌండ్ యాప్’సపోర్ట్. ఈ యాప్ ద్వారా కస్టమర్లు తమకు నచ్చిన విధంగా ఆడియో సెట్టింగ్స్‌ను మార్చుకోవచ్చు. ఇందులో.. అమర్చిన 10mm డ్రైవర్లు పంచీ బేస్, స్పష్టమైన వోకల్స్‌ను అందిస్తాయి. పాటలు వినేటప్పుడు లేదా సినిమా చూసేటప్పుడు ఇది మంచి థ్రిల్‌ను ఇస్తుంది.

Advertisement

Also Read: మ్యూజిక్‌కు తగ్గట్టుగా 360-డిగ్రీ లైటింగ్ షో.. దద్దరిల్లే బేస్‌తో JBL స్పీకర్

3.బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్:

రోజంతా బ్యాటరీ టెన్షన్ లేకుండా.. ఉండటానికి ఇది సహాయ పడుతుంది. పూర్తి ఛార్జ్‌పై ఈ ఇయర్‌ బడ్స్ సుమారు 30 గంటల వరకు ప్లేటైమ్‌ను అందిస్తాయి. అంటే రోజూ ఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా.. కొన్ని రోజుల పాటు  వడొచ్చు. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల అత్యవసర సమయాల్లో తక్కువ సమయంలోనే ఎక్కువ టైం వాడొచ్చు.

4.కనెక్టివిటీ, ఇతర ఫీచర్లు:

ఇందులో లేటెస్ట్ బ్లూటూత్ టెక్నాలజీ ఉండటం వల్ల స్మార్ట్‌ ఫోన్‌తో చాలా త్వరగా, స్టెబిలిటీతో కనెక్ట్ అవుతుంది. గేమింగ్ ఆడేవారి కోసం.. ప్రత్యేకంగా తక్కువ లేటెన్సీ మోడ్ కూడా ఇందులో లభిస్తుంది. దీని వల్ల ఆడియో , వీడియో సింక్ కచ్చితంగా ఉంటుంది. అలాగే రోజూ వారీ వ్యాయామాలు చేసేటప్పుడు చెమట తగిలినా పాడవకుండా ఉండేందుకు తగిన రక్షణ సౌకర్యం ఉంది.

కేవలం రూ.599 ధరకే 30 గంటల బ్యాటరీ లైఫ్, 10mm డ్రైవర్లు, ఏఐ సౌండ్ యాప్ సపోర్ట్ వంటి ఫీచర్లు.. కోరుకునే వారికి లీఫ్ బడ్స్ ఎక్స్121 ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. తక్కువ బడ్జెట్‌లో .. ప్రీమియం ఫీల్ పొందాలనుకుంటే.. ఈ ఇయర్‌ బడ్స్‌ను నిరభ్యంతరంగా ఎంచుకోవచ్చు.

Related News

రూ. 30 వేలలోపు నెక్స్ట్ లెవెల్ ఏఐ ఫోన్‌లు.. మధ్యతరగతికి పర్ఫెక్ట్ ఛాయిస్!

పవర్ బ్యాంక్‌పై..ఊహించని డిస్కౌంట్, కొనడానికి ఇదే కరెక్ట్ టైమ్

లక్షన్నర iPhone 17 Pro Max రూ.98 వేలకే? కానీ ఆ ట్విస్ట్ తెలిస్తే షాక్ అవుతారు!

ఆఫర్ల పండగ.. Flipkart Saleలో సగం ధరకే మోటరోలా 5G ఫోన్లు.. డోంట్ మిస్!

BoAt Vs Noise..బ్యాటరీ, సౌండ్,ధర పరంగా ఏది కొంటే బెటర్?

ఇవి బడ్స్ కాదండోయ్.. శాంసంగ్ నుంచి మునుపెన్నడూ చూడని సరికొత్త డివైజ్!

మ్యూజిక్‌కు తగ్గట్టుగా 360-డిగ్రీ లైటింగ్ షో.. దద్దరిల్లే బేస్‌తో JBL స్పీకర్

Big Stories

Advertisement
×