E-Paper
Advertisement

BoAt Vs Noise..బ్యాటరీ, సౌండ్,ధర పరంగా ఏది కొంటే బెటర్?

BoAt Vs Noise..బ్యాటరీ, సౌండ్,ధర పరంగా ఏది కొంటే బెటర్?
Advertisement

Noise vs boAt earbuds: ఇండియన్ మార్కెట్లో బడ్జెట్ ధరలో లభించే ఆడియో గ్యాడ్జెట్లలో బోట్ (boAt), నాయిస్ (Noise) బ్రాండ్లు ముందు వరుసలో ఉంటాయి. చాలా మంది కొత్తగా ఇయర్‌ బడ్స్ కొనాలనుకున్నప్పుడు ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనే కన్ఫ్యూజన్‌లో ఉంటారు. ముఖ్యంగా బ్యాటరీ బ్యాకప్, సౌండ్ క్వాలిటీ విషయంలో… ఏ బ్రాండ్ మెరుగ్గా పని చేస్తుందో తెలుసుకోవాలని ఆశపడుతుంటారు. ఈ రెండు ప్రముఖ బ్రాండ్ల మధ్య ఉన్న ప్రధాన తేడాలు, ధరల గురించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నాయిస్,బోట్ ఇయర్‌బడ్స్‌లో ఏది కొంటే బెటర్ ?

1. సౌండ్ క్వాలిటీ, ఆడియో :

మ్యూజిక్ లవర్స్‌కు సౌండ్ క్వాలిటీ అనేది అత్యంత ముఖ్యమైన అంశం. బోట్ ఇయర్‌బడ్స్ ప్రధానంగా.. డీప్ బేస్, సౌండ్ ట్యూనింగ్‌తో వస్తాయి. మీరు బాలీవుడ్ పాటలు, హిప్-హాప్ లేదా ఎనర్జిటిక్ మ్యూజిక్ ఇష్ట పడేవారైతే బోట్ ఎయిర్‌ డోప్స్ మీకు మంచి ఫీల్ అందిస్తాయి. ఇవి ఎక్కువ వాల్యూమ్, సౌపర్ బేస్‌ను అందిస్తాయి.

Advertisement

మరోవైపు.. నాయిస్ ఇయర్‌బడ్స్ మరింత బ్యాలెన్స్‌డ్ సౌండ్ ప్రొఫైల్‌ను కూడా కలిగి ఉంటాయి. ఇవి వోకల్ క్లారిటీ, పాడ్‌కాస్ట్‌లు, కొన్ని రకాల మ్యూజిక్‌లకు చాలా అనుకూలంగా ఉంటాయి. మీరు ఎక్కువగా ఆఫీస్ కాల్స్ మాట్లాడేవారైతే.. లేదా స్పష్టమైన మాటలు వినాలనుకుంటే.. నాయిస్ బ్రాండ్ మీకు మెరుగైన అనుభవాన్ని ఇస్తుంది. కాల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC) విషయంలో నాయిస్ ఇయర్‌బడ్స్ మంచి రేటింగ్ కలిగి ఉన్నాయి.

2.బ్యాటరీ లైఫ్ , ఛార్జింగ్ ఫీచర్లు:

బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఈ రెండు బ్రాండ్లు పోటీపడి మరీ అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నాయి. బోట్ ఇయర్‌బడ్స్ సింగిల్ ఛార్జ్‌పై సుమారు 8 గంటల వరకు, ఛార్జింగ్ కేస్‌తో కలిపి 40 నుంచి 50 గంటల వరకు ప్లేటైమ్‌ను అందిస్తాయి. వీటిలో ఉన్న ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ద్వారా కేవలం కొన్ని నిమిషాలు ఛార్జ్ చేస్తే.. గంటల తరబడి మ్యూజిక్ ఆస్వాదించవచ్చు.

Advertisement

నాయిస్ ఇయర్‌బడ్స్ కూడా తమ ‘ఇన్‌స్టాఛార్జ్ టెక్నాలజీతో తక్కువ సమయంలో.. ఎక్కువ బ్యాటరీని అందిస్తున్నాయి. నాయిస్ బడ్స్ మోడల్స్ కూడా సుమారు 45 నుంచి 50 గంటల వరకు టోటల్ బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తాయి. తక్కువ ఛార్జింగ్ సమయంలో.. ఎక్కువసేపు బ్యాటరీ రావాలని కోరుకునేవారికి.. ఈ రెండు బ్రాండ్లూ గొప్ప ప్రత్యామ్నాయాలుగా నిలుస్తున్నాయి.

Also Read: మ్యూజిక్‌కు తగ్గట్టుగా 360-డిగ్రీ లైటింగ్ షో.. దద్దరిల్లే బేస్‌తో JBL స్పీకర్

3.డిజైన్, ధరలు:

బోట్ ప్రొడక్ట్స్ రంగులమయంగా, యూత్ రిచ్ లుక్‌తో , అత్యంత తక్కువ ధరలకే లభిస్తాయి. రూ.999 ప్రారంభ ధర నుంచి ఇవి అందుబాటులో ఉంటాయి. ఇక నాయిస్ విషయానికి వస్తే,..ఇవి మరింత మినిమలిస్ట్, మాట్టే ఫినిష్ ,ప్రీమియం లుక్‌తో వస్తాయి. లాంగ్ టైమ్ వాడేవారికి నాయిస్ డిజైన్ చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది.

మీకు ఎక్కువ బేస్, పవర్ ఫుల్ మ్యూజిక్ కావాలంటే బోట్ (boAt) ఇయర్‌బడ్స్ తీసుకోవడంబెస్ట్. అలాకాకుండా క్లియర్ కాల్స్, బ్యాలెన్స్‌డ్ సౌండ్ ,ప్రొఫెషనల్ వాడకం ముఖ్యం అనుకుంటే.. నాయిస్ (Noise) ఇయర్‌ బడ్స్ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. మీ వ్యక్తిగత ప్రాధాన్యతలను బట్టి సరైన బ్రాండ్ ఎంచుకోండి!

Related News

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో పాతాళానికి పడిపోయిన మోటో ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందంటే?

రూ.10వేల వాషింగ్ మెషీన్ ఇప్పుడు రూ.5,099కే! ఎగబడి కొంటున్న జనం

నమ్మలేని పెర్ఫార్మెన్స్, అదిరిపోయే లుక్‌తో..అసుస్ రోగ్ జి16 లాంచ్!

రూ.999కే..స్పాటియల్ ఆడియో ఇయర్ బడ్స్! భారీగా తగ్గిన ధర

రూ.10వేలలోపే స్మార్ట్ టీవీలు..ఫీచర్లు తెలిస్తే షాక్ అవడం ఖాయం!

డాక్యుమెంట్ స్కాన్ కోసం ప్రత్యేక యాప్ అక్కర్లేదు.. మన ఫోన్‌లోనే ఈ సూపర్ ఆప్షన్ ఉందిగా!

పోగొట్టుకున్న కాంటాక్ట్‌లను..నిమిషాల్లో వెనక్కి తెచ్చుకోండిలా!

ఈ స్పీకర్‌ను మూడు ముక్కలుగా విడదీయొచ్చు.. పోర్ట్రానిక్స్ సరికొత్త ప్రయోగం, ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×