E-Paper
Advertisement

పర్వతాల నుంచి ఎడారుల వరకు.. దేశంలో కచ్చితంగా చూడాల్సిన 8 బెస్ట్ ప్లేసెస్ ఇవే!

పర్వతాల నుంచి ఎడారుల వరకు.. దేశంలో కచ్చితంగా చూడాల్సిన 8 బెస్ట్ ప్లేసెస్ ఇవే!
Advertisement

Incredible Indian Destinations: దేశం అంటే కేవలం చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, బీచ్‌లు మాత్రమే కాదు. మంచుతో కప్పుకున్న పర్వతాల నుంచి ఎడారి ప్రాంతాల వరకు, ప్రశాంతమైన బ్యాక్‌ వాటర్స్ నుంచి సందడిగా ఉండే నగరాల వరకు ఎన్నో రకాల అనుభూతులను అందించే ప్రదేశాలు దేశంలో ఉన్నాయి. వాటిలో టాప్ 8 ప్లేసెస్ ఏంటనేవి ఇప్పుడు చూద్దాం..

1.ఢిల్లీ, చరిత్రకు అద్దం

దేశ రాజధాని ఢిల్లీలో ఆధునిక జీవితం ఎంత వేగంగా సాగుతుందో, చరిత్ర కూడా అంతే బలంగా కనిపిస్తుంది. మొఘల్ కాలం నాటి స్మారక చిహ్నాలు, పాత కోటలు, చారిత్రక నిర్మాణాలు నగరానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. చరిత్రను ఇష్టపడేవారికి ఢిల్లీ మంచి డెస్టినేషన్.

2.డార్జిలింగ్, టీ తోటల మధ్య ప్రయాణం

Advertisement

బెంగాల్‌ లోని డార్జిలింగ్ ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. కొండల మధ్య విస్తరించిన టీ తోటలు, చల్లని వాతావరణం, పాపులర్ టాయ్ ట్రైన్ ప్రయాణం ఆకట్టుకుంటుంది. ఉదయం వేళ కొండలపై కనిపించే దృశ్యాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.

3.వారణాసి, గంగా ఒడ్డున ఆధ్యాత్మిక అనుభూతి

వారణాసి నగరానికి గంగానది ప్రత్యేక గుర్తింపు. సాయంత్రం సమయంలో ఘాట్‌ల వద్ద జరిగే గంగా హారతి చూడటానికి దేశం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. నది ఒడ్డున వెలిగే దీపాలు, పురాతన వీధులు నగరానికి ప్రత్యేకమైన వాతావరణాన్ని అందిస్తాయి.

4.ఉదయ్‌ పూర్, సిటీ ఆఫ్ లేక్స్   

Advertisement

రాజస్థాన్‌ లోని ఉదయ్‌పూర్‌ను లేక్స్ ఆఫ్ సిటీగా పిలుస్తారు. సరస్సుల మధ్య కనిపించే రాజభవనాలు, పాత కోటలు, రాజస్థానీ నిర్మాణ శైలి ఈ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా కొనసాగుతుంది. ప్రశాంతమైన విహారయాత్రకు బెస్ట్ ప్లేస్ గా చెప్పుకోవచ్చు.

5.గోవా, బీచ్‌లు

గోవా అంటే ముందుగా గుర్తుకొచ్చేది సముద్రతీరాలు. అయితే, బీచ్‌లతో పాటు పోర్చుగీస్ కాలం నాటి చర్చిలు, పాత భవనాలు, స్థానిక సంస్కృతి కూడా ఆకట్టుకుంటుంది.

6.మేఘాలయ, చెట్ల వేళ్ల వంతెనలు

మేఘాలయలోని  చెట్ల వేరు వంతెనలు ఆకట్టుకుంటాయి. చెట్ల వేర్లను ఉపయోగించి స్థానికులు రూపొందించిన ఈ వంతెనలు కాలక్రమంలో మరింత బలంగా మారాయి. పచ్చని అడవులు, జలపాతాలు కూడా ఆకట్టుకుంటాయి.

7.లడఖ్, ఎత్తైన పర్వతాలు

లడఖ్ పర్వత ప్రాంతం సాహస యాత్రలను ఇష్టపడేవారికి ఎంతో ప్రత్యేకం. ఎత్తైన పర్వతాలు, విశాలమైన లోయలు, ప్రత్యేకమైన భౌగోళిక దృశ్యాలు ప్రయాణాన్ని మరచిపోలేని అనుభూతిగా మారుస్తాయి.

10.జైసల్మేర్, గోల్డెన్ సిటీ  

రాజస్థాన్‌ లోని జైసల్మేర్ ఎడారి ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణ. పసుపు రంగు ఇసుకరాయితో నిర్మించిన కోటలు, భవనాలపై సూర్యకాంతి పడినప్పుడు నగరం బంగారు రంగులో మెరిసిపోతుంది. ఎడారి సఫారీ, స్థానిక సంస్కృతి కూడా ప్రత్యేక అనుభూతిని అందిస్తాయి.

Read Also: 1964లో మూసేసిన రైల్వే లైన్.. ఇప్పుడు ఏటా 60 వేల మంది సందర్శించే టూరిస్ట్ స్పాట్.. అలా ఎలా?

Tags

Related News

మానవులు ఏలియన్స్ తో మాట్లాడవచ్చా? భవిష్యత్ లోనైనా సాధ్యమేనా?

సూర్యాపేటకు రైలు కూత.. దశాబ్దాల కలకు కీలక అడుగులు!

పండుగ సీజన్‌లో ప్రయాణికులకు గుడ్ న్యూస్, హైటెక్ సిటీలో రైలు ఎక్కొచ్చు!

రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. జర్నీలో ఈ తప్పులు చేస్తే.. జరిమానాతో పాటు డైరెక్ట్ జైలే!

కొండవాలుపై ‘కృష్ణుడి వెన్నముద్ద’ రాయి.. 1200 ఏళ్లుగా దొర్లని వైనం.. సైన్స్‌కే అంతుపట్టని రహస్యం!

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర రోడ్డుపై బైక్ రైడ్.. గిన్నీస్ రికార్డుల్లోకి తుని యువకుడు!

మహిళలకు అలర్ట్.. రైల్వే స్టేషన్‌లోని ఈ అద్భుతమైన సౌకర్యాలు మీకు తెలుసా?

రైలు ఫుడ్‌పై రైల్వే కీలక నిర్ణయం.. వంట నుంచి ప్యాకింగ్ వరకు AI నిఘా!

Big Stories

Advertisement
×