E-Paper
Advertisement

ఇవి బడ్స్ కాదండోయ్.. శాంసంగ్ నుంచి మునుపెన్నడూ చూడని సరికొత్త డివైజ్!

ఇవి బడ్స్ కాదండోయ్.. శాంసంగ్ నుంచి మునుపెన్నడూ చూడని సరికొత్త డివైజ్!
Advertisement

Samsung Galaxy H1: టెక్ దిగ్గజం శాంసంగ్ తమ వినియోగదారులకు సరికొత్త ఆడియో ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు కేవలం బడ్స్ (ఇయర్ ఫోన్స్)కే పరిమితమైన ఈ కంపెనీ.. ఇప్పుడు Over Ear Headphonesతో మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. గెలాక్సీ వేరబుల్ యాప్‌లో దర్శనమిచ్చిన ఆధారాల ప్రకారం.. శాంసంగ్ ఈ కొత్త హెడ్‌ఫోన్స్‌ను వేగంగా అభివృద్ధి చేస్తోంది.

Galaxy H1 కోడ్‌నేమ్‌తో ప్రయోగం:

యాప్ కోడింగ్‌లో ఈ హెడ్‌ఫోన్స్‌కు ‘గెలాక్సీ H1’ అని తాత్కాలికంగా పేరు పెట్టినట్లు సమాచారం. అయితే మార్కెట్లోకి వచ్చేసరికి దీని పేరు మారే అవకాశం ఉంది. చాలా కాలం తర్వాత శాంసంగ్ ఓవర్-ఇయర్ విభాగంలోకి వస్తుండటంతో టెక్ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇవి అత్యుత్తమ బ్లూటూత్ కనెక్టివిటీతో పనిచేస్తాయని లీకైన వివరాలు చెబుతున్నాయి.

Advertisement

Also Read: కనిపించకుండా పోయిన వస్తువుల్ని చిటికెలో పట్టేస్తుంది.. గూగుల్ కొత్త డివైజ్ వచ్చేసింది!

అధునాతన ఫీచర్లు:

Samsung Galaxy H1లో నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), అడాప్టివ్ ఆడియో, అంబియంట్ సౌండ్ మోడ్స్ వంటి టాప్ క్లాస్ ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అసిస్టెంట్ సపోర్ట్, మల్టీడివైజ్ ఆటో స్విచ్ వంటి ఫీచర్లు వినియోగదారుల అనుభవాన్ని మరింత సులభతరం చేస్తాయి. సాధారణ బడ్స్ కంటే వీటిలో బ్యాటరీ లైఫ్ చాలా ఎక్కువగా ఉండేలా డిజైన్ చేస్తున్నారట.

మార్కెట్లో గట్టిపోటీ తప్పదా?

Advertisement

రాబోయే రోజుల్లో Samsung Galaxy H1 మార్కెట్లోకి వస్తే.. యాపిల్ ఎయిర్‌పాడ్స్ మాక్స్, సోనీ, జేబీఎల్ వంటి దిగ్గజ బ్రాండ్ల ప్రీమియం మోడళ్లకు గట్టిపోటీ ఇవ్వడం ఖాయం. ప్రస్తుతం ప్రాజెక్ట్ ప్రారంభ దశలోనే ఉన్నందున.. వచ్చే ఏడాది ఆరంభంలో జరగబోయే గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో శాంం‌సంగ్ వీటిని అధికారికంగా పరిచయం చేసే అవకాశం కనిపిస్తోంది. సాంకేతిక ప్రియులు ఈ కొత్త డివైజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: బ్లడ్ షుగర్ చెక్ చేయకుండానే.. ఇన్సులిన్ మార్పులను పసిగట్టే గూగుల్ టెక్నాలజీ!

Tags

Related News

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో పాతాళానికి పడిపోయిన మోటో ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందంటే?

రూ.10వేల వాషింగ్ మెషీన్ ఇప్పుడు రూ.5,099కే! ఎగబడి కొంటున్న జనం

నమ్మలేని పెర్ఫార్మెన్స్, అదిరిపోయే లుక్‌తో..అసుస్ రోగ్ జి16 లాంచ్!

రూ.999కే..స్పాటియల్ ఆడియో ఇయర్ బడ్స్! భారీగా తగ్గిన ధర

రూ.10వేలలోపే స్మార్ట్ టీవీలు..ఫీచర్లు తెలిస్తే షాక్ అవడం ఖాయం!

డాక్యుమెంట్ స్కాన్ కోసం ప్రత్యేక యాప్ అక్కర్లేదు.. మన ఫోన్‌లోనే ఈ సూపర్ ఆప్షన్ ఉందిగా!

పోగొట్టుకున్న కాంటాక్ట్‌లను..నిమిషాల్లో వెనక్కి తెచ్చుకోండిలా!

ఈ స్పీకర్‌ను మూడు ముక్కలుగా విడదీయొచ్చు.. పోర్ట్రానిక్స్ సరికొత్త ప్రయోగం, ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×