E-Paper
Advertisement

పవర్ బ్యాంక్‌పై..ఊహించని డిస్కౌంట్, కొనడానికి ఇదే కరెక్ట్ టైమ్

పవర్ బ్యాంక్‌పై..ఊహించని డిస్కౌంట్, కొనడానికి ఇదే కరెక్ట్ టైమ్
Advertisement

GOBOULT 20000 mAh power bank: ప్రస్తుత డిజిటల్ యుగంలో.. స్మార్ట్‌ ఫోన్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమైపోయింది. ప్రయాణాలు చేసేటప్పుడు లేదా రోజంతా బయట ఉండే సమయంలో ఫోన్ బ్యాటరీ అయిపోవడం అనేది పెద్ద సమస్యగా మారుతుంది.ఈ టెన్షన్‌ను పూర్తిగా తగ్గించడానికి ప్రముఖ బ్రాండ్ గోబౌల్ట్ మార్కెట్‌లోకి ఒక అద్భుతమైన గ్యాడ్జెట్‌ను తీసుకువచ్చింది. అదే ‘గోబౌల్ట్ 20000 mAh 22.5W పవర్ బ్యాంక్’. చూడటానికి ఆకర్షణీయంగా, ప్యూర్ బ్లాక్ కలర్‌లో లభించే ఈ పవర్ బ్యాంక్, తక్కువ ధరలో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. మొబైల్స్ మాత్రమే కాకుండా ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్‌లను కూడా వేగంగా ఛార్జ్ చేసే ఈ డివైస్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

గోబౌల్ట్ 20000 mAh 22.5W పవర్ బ్యాంక్ ఫీచర్లు:

1.డిజైన్, బిల్డ్ క్వాలిటీ:

గోబౌల్ట్ 20000 mAh పవర్ బ్యాంక్ చూడటానికి చాలా కాంపాక్ట్‌గా, స్టైలిష్‌గా ఉంటుంది. ప్యూర్ బ్లాక్ కలర్ ఫినిషింగ్.. దీనికి ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. దీన్ని పాకెట్‌లో.. లేదా బ్యాగ్‌లో ఎక్కడికైనా చాలా ఈజీగా మోసుకెళ్లొచ్చు. దీని తయారీలో వాడిన లిథియం పాలిమర్ బ్యాటరీ టెక్నాలజీ కారణంగా ఇది బరువులో తేలికగా ఉంటూనే.. ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది.

2.పవర్‌ఫుల్ 22.5W ఫాస్ట్ ఛార్జింగ్:

Advertisement

ఈ పవర్ బ్యాంక్ మెయిన్ హైలైట్ దీని ఫాస్ట్ ఛార్జింగ్ . ఇది 22.5W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీని వల్ల మీ స్మార్ట్‌ ఫోన్ చాలా తక్కువ సమయంలోనే.. ఫుల్ ఛార్జ్ అవుతుంది. అలాగే ఇందులో మల్టి పుల్ అవుట్‌ పుట్ పోర్ట్స్ ఉండటం వల్ల ఒకే సమయంలో.. ఒకటి కంటే ఎక్కువ డివైస్‌లను ఛార్జ్ చేసుకోవడానికి వీలుంటుంది. మొబైల్స్‌తో పాటు బ్లూటూత్ ఇయర్‌బడ్స్, ట్యాబ్లెట్లు, స్మార్ట్‌వాచ్‌లను కూడా వేగంగా ఛార్జ్ చేస్తుంది.

3.ఎల్ఈడీ డిజిటల్ డిస్‌ప్లే:

సాధారణ పవర్ బ్యాంక్స్‌లో బ్యాటరీ ఎంత ఉందనేది తెలుసుకోవడం కొంచెం కష్టం. కానీ.. ఈ గోబౌల్ట్ మోడల్‌లో స్మార్ట్ LED డిజిటల్ డిస్‌ప్లేను ఇచ్చారు. దీని ద్వారా పవర్ బ్యాంక్‌లో.. ఎంత వరకు ఛార్జ్ మిగిలి ఉందో స్పష్టంగా గమనించవచ్చు. ఇది యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Advertisement

Also Read: ఏఐ సౌండ్ యాప్‌తో లీఫ్ బడ్స్ ఎక్స్121.. అదిరిపోయే ఫీచర్లతో లాంచ్!

4.సేఫ్టీ ఫీచర్లు, ధర:

ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌లో సేఫ్టీ అనేది చాలా ముఖ్యం. ఈ పవర్ బ్యాంక్‌లో.. ఓవర్‌చార్జ్ ప్రొటెక్షన్, షార్ట్ సర్క్యూట్, టెంపరేచర్ సేఫ్టీ వంటివి ఉన్నాయి. దీని ధర మార్కెట్లో సుమారు రూ.1,299 గా ఉంది. ఈ బడ్జెట్‌లో ఇంత పెద్ద కెపాసిటీ, ఫాస్ట్ ఛార్జింగ్ లభించడం నిజంగా గొప్ప విషయమే.

తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ , ఫాస్ట్ ఛార్జింగ్ కోరుకునే వారికి గోబౌల్ట్ 20000 mAh 22.5W పవర్ బ్యాంక్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. స్టైలిష్ లుక్, లైట్‌వెయిట్ డిజైన్, నమ్మకమైన పని తీరుతో ఇది మార్కెట్లో ట్రెండ్ సృష్టిస్తోంది. మీరు కూడా ఒక మంచి పవర్ బ్యాంక్ కొనాలనుకుంటే.. దీన్ని నిరభ్యంతరంగా ఎంచుకోవచ్చు.

Related News

లక్షన్నర iPhone 17 Pro Max రూ.98 వేలకే? కానీ ఆ ట్విస్ట్ తెలిస్తే షాక్ అవుతారు!

ఏఐ సౌండ్ యాప్‌తో లీఫ్ బడ్స్ ఎక్స్121.. అదిరిపోయే ఫీచర్లతో లాంచ్!

ఆఫర్ల పండగ.. Flipkart Saleలో సగం ధరకే మోటరోలా 5G ఫోన్లు.. డోంట్ మిస్!

BoAt Vs Noise..బ్యాటరీ, సౌండ్,ధర పరంగా ఏది కొంటే బెటర్?

ఇవి బడ్స్ కాదండోయ్.. శాంసంగ్ నుంచి మునుపెన్నడూ చూడని సరికొత్త డివైజ్!

మ్యూజిక్‌కు తగ్గట్టుగా 360-డిగ్రీ లైటింగ్ షో.. దద్దరిల్లే బేస్‌తో JBL స్పీకర్

జియోలో ఇంత మంచి ప్లాన్ ఉందా.. రూ. 666తో 70 రోజులపాటు ఫ్రీ కాల్స్, డేటా.. సామాన్యులకు పండగే!

Big Stories

Advertisement
×