E-Paper
Advertisement

ఎల్జీ కొత్త వాషింగ్ మిషన్లు.. బుర్ర బద్దలయ్యే క్రేజీ ఫీచర్లు.. మార్కెట్‌ షేక్ అవ్వడం పక్కా!

ఎల్జీ కొత్త వాషింగ్ మిషన్లు.. బుర్ర బద్దలయ్యే క్రేజీ ఫీచర్లు.. మార్కెట్‌ షేక్ అవ్వడం పక్కా!
Advertisement

LG Washing Machines: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ‘ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా’ దేశీయ మార్కెట్లోకి కొత్త శ్రేణి సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లను లాంచ్ చేసింది. మొండి మరకలు తొలగింపు, బట్టలు వేగంగా ఆరేందుకు వీలుగా వీటిని రూపొందించారు. మొత్తం 15 విభిన్న మోడళ్లలో 8 కేజీల నుంచి 12 కేజీల కెపాసిటీల్లో ఈ వాషింగ్ మిషన్లను పరిచయం చేశారు. వాటిలోని ప్రధాన ఫీచర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఆకర్షణీయమైన డిజైన్..

ఎల్జీ ఈ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ల డిజైన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించింది. అంతేకాకుండా ఒనిక్స్ బ్లాక్, మిడిల్ బ్లాక్, బర్గండి వంటి ప్రీమియం రంగుల్లో ఎంతో ఆకర్షణీయంగా అందుబాటులోకి తెచ్చింది. ప్రధాన ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ వాషింగ్ మిషన్లలో ప్రత్యేకమైన సాంకేతికను ఎల్జీ పొందుపరిచింది. డ్యూయల్ స్పిన్ షవర్ ఫీచర్ తో వీటిని తీసుకొచ్చింది. ఇందులో ఉండే రెండు వాటర్ ఇన్లెట్లు దుస్తులను నీటితో శుభ్రంగా కడిగి సబ్బు చారలు పూర్తిగా తొలగిపోయేలా సాయపడతాయి.

హైలెట్ ఫీచర్లు ఇవే..

Advertisement

ఈ సెమీ వాషింగ్ మిషన్లలోని రోలర్ జెట్ పల్సేటర్+ ను.. తిమింగలం తోక ఆకారాన్ని స్ఫూర్తిగా తీసుకుని తయారు చేశారు. ఇది నీటిని బలంగా తిప్పడం ద్వారా మొండి మరకలను సులువుగా తొలగిస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. అలాగే ఆల్ట్రా స్క్రబ్ వాల్ ఫీచర్.. కాలర్లు, కఫ్‌ల దగ్గర ఎక్కువగా ఉండే మురికిని తొలగిస్తుందని పేర్కొన్నాయి. అటు విండ్ జెట్ డ్రై+ ఫీచర్.. బట్టలు పిండే సమయంలో గాలి ప్రసరణ పెంచి తేమను త్వరగా తొలగించనుంది. తద్వారా దుస్తులు వేగంగా ఆరడానికి సాయపడనుంది. మరోవైపు బట్టలు ఉతికేటప్పుడు వచ్చే పీచును స్మార్ట్ ఫిల్టర్ పట్టుకొని తొలగించనుంది. మరోవైపు ఎలుకల నుంచి మిషన్ ను కాపాడేందుకు ‘ర్యాట్ అవే టెక్నాలజీ’ని సైతం ఇందులో వినియోగించారు.

Also Read: యూపీఐ వాడేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. భీమ్ యాప్‌లోకి కొత్తగా ‘MyUPI’ ఏఐ అసిస్టెంట్!

ఎల్జీ కంపెనీ ఏమన్నారంటే?

Advertisement

లాంచ్ సందర్భంగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా హోమ్ అప్లయన్సెస్ విభాగాధిపతి యాగగ్ మిన్ హ్వాంగ్ మాట్లాడారు. రోజువారీ లాండ్రీలో మెరుగైన అనుభవాన్ని కోరుకునే భారతీయ వినియోగదారుల కోసం అధునాతన సాంకేతికతతో, ప్రీమియం డిజైన్‌తో వీటిని తెచ్చినట్లు తెలిపారు. ఈ కొత్త ఉత్పత్తులన్నీ ఎల్జీకి చెందిన గ్రేటర్ నోయిడా ప్లాంట్‌లో తయారవుతున్నాయని పేర్కొన్నారు. త్వరలోనే వీటి ధరలకు సంబంధించిన మరింత సమాచారం పంచుకుంటామని స్పష్టం చేశారు. కాగా, ప్రతీ మిషన్ నాణ్యతను ‘ఏఐ విజన్ ఇన్స్పెక్షన్’ ద్వారా 100 శాతం తనిఖీ చేసిన తర్వాతే మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు ఎల్జీ కంపెనీ వెల్లడించింది.

Also Read: డేటా అక్కర్లేని వారికి గుడ్‌ న్యూస్.. Airtel, Jio, Vi నుంచి.. అత్యంత చౌకైన ప్లాన్స్ వచ్చేస్తున్నాయ్!

Tags

Related News

శాటిలైట్ ఇంటర్నెట్ అంటే ఏంటి? అంతరిక్షం నుంచి మీ ఇంటికి నెట్‌వర్క్ ఎలా వస్తుంది?

అమెజాన్ Vs ఫ్లిప్‌కార్ట్ సేల్..వస్తువులు కొనడానికి ఏది బెస్ట్?

ప్రైమ్ మెంబర్స్‌కు మాత్రమే అందే అద్భుతమైన లాభాలు!

యూపీఐ వాడేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. భీమ్ యాప్‌లోకి కొత్తగా ‘MyUPI’ ఏఐ అసిస్టెంట్!

రూమ్ చిన్నదైనా సౌండ్ మాత్రం అదుర్స్.. క్రిస్టల్ క్లియర్ ఆడియోనిచ్చే మినీ థియేటర్లు!

డేటా అక్కర్లేని వారికి గుడ్‌ న్యూస్.. Airtel, Jio, Vi నుంచి.. అత్యంత చౌకైన ప్లాన్స్ వచ్చేస్తున్నాయ్!

కరెంట్ పోతే ఏంటీ ? సినిమా మాత్రం ఆగదు బాస్!

Big Stories

Advertisement
×