TRAI New Rules 2026: దేశంలోని టెలికాలం యూజర్లకు త్వరలోనే అతిపెద్ద ఊరట లభించనుంది. ఇంట్లో, ఆఫీసుల్లో వై-ఫై ఉండి డేటా అక్కర్లేని ప్లాన్స్ కోరుకునేవారికి కోసం తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులోకి రానున్నాయి. కేవలం కాలింగ్, ఎస్‌ఎంఎస్ సేవలు అందించే చౌకైన ప్లాన్లను జియో, ఎయిర్‌టెల్, వీఐ (Vi) లాంచ్ చేయనున్నాయి. ఈ మేరకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కీలక ఆదేశాలు జారీ చేసింది.
టెలికాం వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కీలక సవరణలతో ట్రాయ్ ‘టెలికాం కన్స్యూమర్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్ – 2026’ను తీసుకొచ్చింది. ప్రస్తుతం టెలికాం కంపెనీలు అందిస్తున్న వాయిస్, ఎస్‌ఎంఎస్ రీఛార్జ్ ప్లాన్లు చాలా పరిమితంగా ఉన్నాయని అందులోనూ ఎక్కువ కాలపరిమితి (వాలిడిటీ) ఉన్న ప్లాన్లే ఎక్కువగా ఉన్నాయని ట్రాయ్ గుర్తించింది. తక్కువ రోజులకు రీఛార్జ్ చేసుకోవాలనుకునే వారికి సరైన ప్లాన్లు లేకపోవడాన్ని గమనించి కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.
టెలికాం సంస్థలకు ట్రాయ్ విడుదల చేసిన మార్గదర్శకాల్లో మూడు అంశాలు హైలెట్ గా నిలుస్తున్నాయి. వాటి ప్రకారం ఒకటి 30 రోజులు లేదా అంతకంటే తక్కువ వాలిడిటీతో డేటాతో కూడిన ప్లాన్లు తీసుకొని రావాలి. అదే సమయంలో కేవలం వాయిస్, ఎస్‌ఎంఎస్ కోరుకునే వారి కోసం అందుబాటు ధరలో స్పెషల్ టారిఫ్ వోచర్లను పరిచయం చేయాలి. ఈ ప్లాన్ల వాలిడిటీ ప్రతి నెల ఒకే తేదీన ముగిసేలా ఉండాలి. ఒకవేళ వచ్చే నెలలో ఆ తేదీ లేకపోతే ఆ నెల చివరి తేదీని ముగింపు తేదీగా పరిగణించాలి. మూడో అంశం కింద నెలవారీ ప్లాన్లతో పాటు, సాధారణ డేటా ప్లాన్ల మాదిరిగానే ఎక్కువ వాలిడిటీ ఉండే కనీసం ఒక వాయిస్, ఎస్‌ఎంఎస్ ప్లాన్‌నైనా కంపెనీలు అందించాల్సి ఉంటుంది.ట
Also Read: కీబోర్డ్ F, J కీలపై ఉండే చిన్న గీతల కథేంటి? టైపింగ్ వేగానికి, ఆరోగ్యానికి ఉన్న లింకేంటి?
గతంలో టెలికాం కంపెనీలు డేటా లేని ప్లాన్లను అందించినప్పటికీ వాటి ధరలు చాలా ఎక్కువగా ఉండేవి. అయితే ట్రాయ్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయాల వల్ల జియో, ఎయిర్‌టెల్, వీఐ వినియోగదారులకు తక్కువ ధరల్లోనే కాలింగ్, ఎస్‌ఎంఎస్ ప్లాన్లు లభించనున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ వాడని వారికి తక్కువ ఆదాయం ఉన్న వర్గాలకు, నెట్‌వర్క్ కేవలం కాలింగ్ కోసమే వాడుకునే వారికి ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడనుంది.
Also Read: ఏడాదంతా ఫ్రీ కాల్స్, 5G డేటా.. Airtel, Jio, Viలో బెస్ట్ ప్లాన్స్ ఇవే.. ఎంజాయ్ పండగో!