ICC Women’s T20 World Cup 2024 Winner’s prize money increased by 134%: క్రికెట్ ప్రపంచంలో మహిళలు-పురుషులు అనే తారతమ్యం లేదని ఐసీసీ నిరూపించింది. మహిళల టోర్నీలో విజేతలకు ఇచ్చే ప్రైజ్‌మనీ విషయంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పురుషులతో సమానంగా మహిళలకు ప్రైజ్ మనీ ఉంటుందని తెలిపింది.
వచ్చెేనెల అక్టోబరు 3 నుంచి 20 వరకు యూఏఈలో జరిగే మహిళా టీ 20 ప్రపంచకప్ నకు సంబంధించి ప్రైజ్ మనీని ఐసీసీ ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా 134 శాతం ప్రైజ్ మనీ పెరిగిపోయింది. ఇక విజేతగా నిలిచిన జట్టుకి ఇండియన్ కరెన్సీలో రూ. 19 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది.
రన్నరప్ గా నిలిచిన జట్టుకు రూ. 9 కోట్ల నగదు బహుమతి ఉంటుంది. సెమీఫైనల్ లో ఓడిన రెండు జట్లకు గతంలో 2,10,00 డాలర్లు ఇచ్చేవారు. అంటే ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే రమారమి రూ.2 కోట్ల వరకు ఉండేది. ఇప్పుడు దానిని 6,75,000 డాలర్లకు పెంచారు. అంటే దాదాపు రూ. 5.80 కోట్లకు పెంచారు. ఇంక ఓవరాల్ గా చెప్పాలంటే మొత్తం ప్రైజ్ మనీ రూ.66 కోట్లుగా ఉంది.
ఇటీవల జరిగిన వార్షిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. క్రికెట్ లో ఇక లింగ వివక్షకు తావు లేదని తెలిపింది. ఇక్కడ ఎవరైనా ఒకటేనని పేర్కొంది. ప్రపంచ దేశాల్లో జరిగే పలు ప్రధాన క్రీడల్లో ఇంకా లింగ వివక్ష ఉందని, క్రికెట్లో అది లేకుండా చేయాలనేది తమ ఉద్దేశమని తెలిపింది.
Also Read: ఐపీఎల్ లో తన్నుకున్నారు..ఇప్పుడు వాళ్లే టీమిండియాలో చీలిక తెచ్చారు..ప్రోమో అదుర్స్ !
అయితే మహిళా టీ 20 ప్రపంచకప్ బంగ్లాదేశ్ లో జరగాలి. కానీ అక్కడేర్పడిన అనూహ్య పరిస్థితుల కారణంగా వేదికను యూఏఈకి మార్చింది. మొత్తం 10 జట్లు ఈ మెగా టోర్నమెంటులో పాల్గొంటున్నాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. మెన్స్ టీ 20 ప్రపంచకప్ జరిగినట్టే ఇక్కడ విధివిధానాలు రూపొందించారు.
గ్రూప్ లోని ప్రతి జట్టు.. మరో జట్టుతో తలపడుతుంది. ప్రతి గ్రూప్ నుంచి రెండు జట్లు సెమీఫైనల్ కి వెళతాయి. అక్కడ గెలిచిన జట్లు ఫైనల్ కి వెళతాయి. ఇకపోతే గ్రూప్ ఏలోనే భారత్, పాకిస్తాన్ ఉన్నాయి. వీటితో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక ఉన్నాయి. అయితే గ్రూప్ ఏ లో అన్నీ బలమైన జట్లే ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి నెట్టుకురావడం అనుకున్నంత ఈజీ కాదని అంటున్నారు.
ఇక గ్రూప్ బీలో సౌతాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండిస్, స్కాట్లాండ్, బంగ్లాదేశ్ ఉన్నాయి. వీటిలో చివరి మూడు దేశాలు బలహీనమైన జట్లుగానే ఉన్నాయి. గ్రూప్ ఏలో శ్రీలంక కూడా తాజాగా ఆసియా కప్ గెలిచింది. అందువల్ల గ్రూప్స్ డివిజన్ పారదర్శకంగా జరగలేదని నెటిజన్లు సీరియస్ అవుతున్నారు.