E-Paper
Advertisement

ధర తగ్గింది గురూ.. తక్కువ ధరకే Apple MacBook Air M5.. ఈ ఛాన్స్ మళ్లీ రాదు!

ధర తగ్గింది గురూ.. తక్కువ ధరకే Apple MacBook Air M5.. ఈ ఛాన్స్ మళ్లీ రాదు!
Advertisement

MacBook Air M5 Price Drop: ఇటీవల యాపిల్ సంస్థ మ్యాక్‌బుక్ ధరలను పెంచిన తర్వాత వాటిని కొనడం కొంచెం భారంగానే మారింది. ఈ తరుణంలో మీరు కూడా ఒక మంచి ప్రీమియం ల్యాప్‌టాప్ కొనాలని ప్లాన్ చేస్తూ, ఆఫర్ కోసం ఎదురు చూస్తుంటే మీకొక గుడ్ న్యూస్. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, లేటెస్ట్ MacBook Air M5 వేరియంట్లపై మైండ్ బ్లోయింగ్ ఆఫర్లను ప్రకటించింది. ధరల పెంపు తర్వాత ఈ ల్యాప్‌టాప్‌పై వచ్చిన అతిపెద్ద డిస్కౌంట్ ఇదే కావడం విశేషం.

ఏకంగా రూ.16,000 డిస్కౌంట్..

ప్రస్తుతం అమెజాన్‌లో నడుస్తున్న ఈ సేల్‌లో MacBook Air M5 మోడళ్లపై ఏకంగా రూ.16,000 వరకు తగ్గింపు లభిస్తోంది. సాధారణంగా అమెజాన్ ఇచ్చే ఆఫర్లు రూ.12,500 వరకే పరిమితమవుతాయి. కానీ ఈసారి అంతకంటే ఎక్కువ తగ్గింపు ఇస్తుండటంతో.. ల్యాప్‌టాప్‌ అప్‌గ్రేడ్ చేసుకోవాలి అనుకునే స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, క్రియేటర్లకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు.

Advertisement

Also Read: 200MP కెమెరా, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో కొత్త రెడ్‌మీ ఫోన్లు.. లీక్ అయిన వివరాలు ఇవే!

ఏ వేరియంట్ ధర ఎంత తగ్గింది?

ఈ ఆఫర్లు ప్రస్తుతం 13 ఇంచుల వేరియంట్లపై అందుబాటులో ఉన్నాయి. దీనిలో 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ మోడల్ అసలు ధర సుమారు రూ.1,08,000 కాగా.. సేల్‌లో రూ.95,000కే లభిస్తోంది. అలాగే కొంచెం ఎక్కువ స్టోరేజ్ కావాలనుకునే వారి కోసం 16GB ర్యామ్, 1TB స్టోరేజ్ వేరియంట్ రూ.1,33,000 నుంచి రూ.1,18,000కి తగ్గింది. ఇక అత్యధికంగా 24GB ర్యామ్, 1TB స్టోరేజ్ ఉన్న టాప్ మోడల్ అసలు ధర రూ.1,50,000 ఉండగా.. అది ఇప్పుడు రూ.1,34,000కే అందుబాటులో ఉంది. అయితే 15 ఇంచుల మోడళ్లపై మాత్రం ప్రస్తుతం ఇలాంటి భారీ ఆఫర్లు ఏమీ లేవు.

ఇప్పుడే ఎందుకు కొనాలంటే?

Advertisement

లేటెస్ట్ ఎమ్‌5 చిప్‌సెట్, వేగవంతమైన ప్రాసెసింగ్, ఆకట్టుకునే డిజైన్, దానికి తోడు యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్.. ఇలా MacBook Air M5లో ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. అయితే అమెజాన్‌లో యాపిల్ ప్రొడక్ట్స్ ఆఫర్లు చాలా వేగంగా మారిపోతుంటాయి. దాంతో స్టాక్ పూర్తయ్యేలోపు లేదా ఆఫర్ గడువు ముగిసేలోపే కొనుగోలు చేయడం మంచిది.

Also Read: రూ.2 లక్షలా? ఈ ఫోన్లలో అంతలా ఏముంది భయ్యా.. శాంసంగ్ లేటెస్ట్ ఫోల్డబుల్స్ సేల్స్ షురూ!

Related News

మునుపెన్నడూ లేని రీతిలో తగ్గిన AirPods Pro 3 ధర.. ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే!

ఇంటి పైకప్పుపై గార్డెన్.. ఇక లైఫ్‌లో ఏసీలు, కూలర్లు అక్కర్లే.. బోలెడన్ని బెనిఫిట్స్!

200MP కెమెరా, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో కొత్త రెడ్‌మీ ఫోన్లు.. లీక్ అయిన వివరాలు ఇవే!

రూ.2 లక్షలా? ఈ ఫోన్లలో అంతలా ఏముంది భయ్యా.. శాంసంగ్ లేటెస్ట్ ఫోల్డబుల్స్ సేల్స్ షురూ!

అమెజాన్ ఫ్రీడమ్ సేల్ 2026.. సౌండ్‌బార్‌లపై భారీ డిస్కౌంట్లు!

దుమ్ము లేని ఇల్లు కావాలా ? రూ.30వేలలోపు టాప్ 5 రోబోట్ వాక్యూమ్ క్లీనర్లు!

తక్కువ బడ్జెట్‌లో.. ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే 5 ల్యాప్‌టాప్స్

Big Stories

Advertisement
×