E-Paper
Advertisement

200MP కెమెరా, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో కొత్త రెడ్‌మీ ఫోన్లు.. లీక్ అయిన వివరాలు ఇవే!

200MP కెమెరా, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో కొత్త రెడ్‌మీ ఫోన్లు.. లీక్ అయిన వివరాలు ఇవే!
Advertisement

Redmi K100 Pro Series: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రెడ్‌మీ.. తమ కొత్త K100 Pro సిరీస్‌ను త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సిరీస్ రాక గురించి ఇప్పటికే టెక్ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, మొదట చైనాలో విడుదల చేసిన తర్వాతే భారత్‌లో లాంచ్ చేయాలని షియోమీ ఆలోచిస్తున్నట్లు ప్రముఖ టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న K100 Pro సిరీస్ ఫోన్లలోని టాప్ ఫీచర్లు, ప్రత్యేకతలపై ఒక లుక్కేద్దాం రండి!

Redmi K100 Pro and K100 Pro Max రెండింటిలోనూ ఫ్లాట్ ఓలెడ్ డిస్‌ప్లేలు అందించే అవకాశం ఉంది. Pro మోడల్ 6.59 ఇంచుల సైజుతో వస్తుండగా.. Pro Max ఏకంగా 6.9 ఇంచుల పెద్ద స్క్రీన్‌తో రానుంది. అంతేకాకుండా.. గేమింగ్, స్క్రోలింగ్ అనుభవాన్ని మరింత స్మూత్‌గా మార్చడానికి 185 హర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌ను అందించబోతున్నారు.

Advertisement

Also Read: రూ.2 లక్షలా? ఈ ఫోన్లలో అంతలా ఏముంది భయ్యా.. శాంసంగ్ లేటెస్ట్ ఫోల్డబుల్స్ సేల్స్ షురూ!

ఈ సిరీస్ ఫోన్లలో క్వాల్కమ్ టాప్ ఎండ్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ జెన్ 5 చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నారు. ఇది అత్యంత వేగవంతమైన పనితీరును అందిస్తుంది. హెవీ గేమింగ్, మల్టీ టాస్కింగ్ సులువుగా చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సరికొత్త AI ఫీచర్లు కూడా ఈ ఫోన్లలో భాగం కానున్నాయి.

Advertisement

ఫొటోగ్రఫీ ప్రేమికుల కోసం ఈ ఫోన్లలో సాలిడ్ కెమెరా సెటప్ ఇస్తున్నారు. రెండు మోడల్స్‌లోనూ 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంటుంది. Pro Max మోడల్‌లో 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్, అల్ట్రావైడ్ కెమెరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇవి అద్భుతమైన ఫొటోలు, వీడియోలను తీయడానికి తోడ్పడతాయి.

ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. ఈ ఫోన్లు కొత్త రికార్డు సృష్టించనున్నాయి. K100 Pro మోడల్‌లో 8580 mAh బ్యాటరీ ఉండగా.. K100 Pro Max మోడల్‌లో ఏకంగా 9070 mAh భారీ బ్యాటరీని అందించనున్నారు. దీంతో ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే రెండ్రోజుల వరకు బ్యాటరీ అయిపోదు. త్వరలోనే ఈ సిరీస్ ఫోన్ల విడుదల తేదీ వెల్లడయ్యే అవకాశం ఉంది.

Also Read: భారీ బ్యాటరీ, ఉచితంగా క్లౌడ్ స్టోరేజ్.. భారత్‌లో విడుదలైన Vivo S2 ఫోన్ పూర్తి వివరాలు!

Related News

ధర తగ్గింది గురూ.. తక్కువ ధరకే Apple MacBook Air M5.. ఈ ఛాన్స్ మళ్లీ రాదు!

రూ.2 లక్షలా? ఈ ఫోన్లలో అంతలా ఏముంది భయ్యా.. శాంసంగ్ లేటెస్ట్ ఫోల్డబుల్స్ సేల్స్ షురూ!

అమెజాన్ ఫ్రీడమ్ సేల్ 2026.. సౌండ్‌బార్‌లపై భారీ డిస్కౌంట్లు!

దుమ్ము లేని ఇల్లు కావాలా ? రూ.30వేలలోపు టాప్ 5 రోబోట్ వాక్యూమ్ క్లీనర్లు!

తక్కువ బడ్జెట్‌లో.. ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే 5 ల్యాప్‌టాప్స్

కేంద్రంతో రూ.5,000 కోట్ల వివాదం.. Airtel, Vi కు సుప్రీం కోర్టు నోటీసులు!

రోజుల తరబడి వాడినా ఫోన్ ఛార్జింగ్ అయిపోకూడదా? అయితే ఈ సీక్రెట్ సెట్టింగ్స్ ఇప్పుడే మార్చండి!

Big Stories

Advertisement
×