E-Paper
Advertisement

ఆఫర్‌లో 40 ఇంచుల టీవీ రూ. 20 వేలకే..సేల్ పూర్తవకముందే కొనేయండి

ఆఫర్‌లో 40 ఇంచుల టీవీ రూ. 20 వేలకే..సేల్ పూర్తవకముందే కొనేయండి
Advertisement

Mi 40 Inch Full HD TV 4A: ప్రస్తుత కాలంలో స్మార్ట్ టీవీ అనేది ప్రతి ఇంటికి అత్యంత ముఖ్యమైన ఎంటర్‌టైన్‌మెంట్ గార్జెట్‌గా మారిపోయింది. ఇదిలా ఉంటే.. ఓటీటీ ఫ్లాట్ ఫారమ్‌లు విపరీతంగా పెరిగిన సమయంలో..పెద్ద స్క్రీన్‌పై సినిమాలు , వెబ్ సిరీస్‌లు చూసేందుకు ప్రతి ఒక్కరూ ఇష్ట పడుతున్నారు. అయితే .. ఎక్కువ ధర పెట్టలేక టీవీ కొనే విషయంలో సతమతమయ్యే మిడిల్ క్లాస్ ఫ్యామిలీల కోసం షావోమి సంస్థ అత్యంత తక్కువ ధరకే.. అద్భుతమైన ఫీచర్లతో Mi 40 Inch Full HD TV (4A) మోడల్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. తక్కువ ధరకే బెస్ట్ ఫీచర్లతో వస్తున్న ఈ టీవీ కూవలం రూ. 20 వేలకే డిస్కౌంట్‌లో కొనొచ్చు. మరి ఈ టీవీ ఫీచర్ల గురించి తెలుసుకుందామా..

Mi 40 Inch Full HD TV ఫీచర్లు:

1.డిస్ ‌ప్లే,పిక్చర్ క్వాలిటీ:

ఈ టీవీ స్పెషల్ అట్రాక్షన్ దీని 40 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే. దీని రిజల్యూషన్ 1920×1080 పిక్సెల్స్ ఉండటం వల్ల వీడియోలు చాలా స్పష్టంగా, చాలా బాగా కనిపిస్తాయి. సినిమా హాల్ ఫీల్ ఇంటికి తీసుకువచ్చే వివిద్ పిక్చర్ ఇంజిన్ టెక్నాలజీ దీనిలో ఉంటుంది కాబట్టి దీని వల్ల రంగులు, డీప్ బ్లాక్ షేడ్స్ కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి.

2.సౌండ్, ఆడియో పర్ఫార్మెన్స్:

Advertisement

కేవలం పిక్చరే కాకుండా సౌండ్ విషయంలో కూడా ఈ టీవీ అదర గొడుతుంది. దీనిలో.. 20 వాట్ల స్పీకర్లు ఇచ్చారు. డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా దీనిలో ఉండటం వల్ల క్రిస్టల్ క్లియర్ సౌండ్ వస్తుంది. అంతే కాకుండా ఇంట్లోనే హోం థియేటర్ ఫీలింగ్ పొందాలనుకునే.. వారికి ఈ ఆడియో అవుట్‌పుట్ సరిగ్గా సరి పోతుంది.

Also Read: సగానికి పైగా డిస్కౌంట్‌తో.. అమెజాన్ సేల్‌లో సైడ్-బై-సైడ్ ఫ్రిజ్‌లు

3.స్మార్ట్ ఫీచర్లు, హార్డ్‌వేర్:

Advertisement

ఆండ్రాయిడ్ టీవీ ప్లాట్‌ఫారమ్‌పై పని చేసే ఈ Mi స్మార్ట్ టీవీలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి పాపులర్ ఓటీటీ యాప్‌లను నేరుగా డౌన్‌ లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ ఉన్న వాయిస్ రిమోట్ ద్వారా కేవలం మాటలతోనే.. టీవీని ఆపరేట్ చేయవచ్చు. అలాగే క్రోమ్‌కాస్ట్ ఇన్‌బిల్ట్ ఉండటం వల్ల మీ మొబైల్ స్క్రీన్‌ను నేరుగా టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్టివిటీ కోసం హెచ్‌డీఎంఐ పోర్టులు, యూఎస్‌బీ పోర్టులు, వైఫై కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

4.ధర:

ఈ అద్భుతమైన ఫీచర్లు కలిగిన టీవీ మోడల్ మార్కెట్లో.. కేవలం రూ. 19,999 ధరకే కస్టమర్లకు అందుబాటులో ఉంది. రూ.20 వేల బడ్జెట్‌లో.. ఇంతకంటే మంచి ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ టీవీ దొరకడం కష్టమనే చెప్పాలి.

తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు, అద్భుతమైన డిస్‌ప్లే , సూపర్ సౌండ్ క్వాలిటీ కోరుకునే వారికి ఈ Mi 40 అంగుళాల స్మార్ట్ టీవీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మీ హాల్ లేదా బెడ్‌రూమ్‌ను మరింత అందంగా మార్చుకోవడానికి ఈ టీవీని వెంటనే కొనేయండి మరి.

Related News

పాత ఫోన్ వేస్ట్ అనుకుంటే పొరపాటే..ఇలా వాడితే ఎన్నో లాభాలు!

పాన్ కార్డ్ ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలా?

యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు..ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

రీఛార్జ్ టెన్షన్ వద్దు..ఒక్క క్లిక్‌తో 1000+టీవీ ఛానెళ్లు ఫ్రీ!

మరుగుతున్న నీటిలో పడినా పాడవ్వదు..8100mAh బ్యాటరీతో హానర్ సరికొత్త అద్భుతం!

స్మార్ట్‌వాచ్ వెనుక ఆకుపచ్చ లైట్ ఎందుకు వెలుగుతుందో తెలుసా? అసలు కారణం ఇదే!

ఏఐ మోసాలకు చెక్ పెట్టే టెక్నాలజీ..గూగుల్,ఆపిల్ ఫోన్లలోని అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లు!

వాట్సాప్‌లో.. ఈ 5 సెట్టింగ్‌లను పొరపాటున కూడా మరవొద్దు!

Big Stories

Advertisement
×