E-Paper
Advertisement

టీడీపీ ఆదేశంతో చలసాని బిగ్ డెసిషన్.. కృష్ణా డెయిరీ ఛైర్మన్ పదవికి రాజీనామా!

టీడీపీ ఆదేశంతో చలసాని బిగ్ డెసిషన్.. కృష్ణా డెయిరీ ఛైర్మన్ పదవికి రాజీనామా!
Advertisement

Chalasani Anjaneyulu:  కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ) చైర్మన్ పదవిని చుట్టుముట్టిన ఉత్కంఠకు, రాజకీయ అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ, కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ పదవితో పాటు బోర్డు డైరెక్టర్ పదవికి కూడా చలసాని ఆంజనేయులు రాజీనామా చేశారు. మంత్రుల సుదీర్ఘ మంత్రాంగాలు, సంప్రదింపుల తర్వాత ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

రాజీనామా వెనుక మంత్రుల మంత్రాంగం

Advertisement

పార్టీ నిర్ణయించిన నాయకత్వ మార్పును గౌరవించాలని కోరుతూ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, కొలుసు పార్థసారథిలు కృష్ణా మిల్క్ యూనియన్ డైరెక్టర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అయితే, ఆ సమయంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చలసాని ఆంజనేయులు మొదట రాజీనామాకు నిరాకరించారు. అవసరమైతే తనపై అవిశ్వాస తీర్మానం పెట్టి తొలగించుకోవచ్చని తేల్చిచెప్పడంతో ఉత్కంఠ మరింత పెరిగింది.

కొలుసు సంప్రదింపులు.. ఫలించిన నచ్చజెప్పుడు

Advertisement

పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న మంత్రి కొలుసు పార్థసారథి స్వయంగా ఆసుపత్రికి వెళ్లి చలసానితో మాట్లాడారు. పార్టీ ప్రయోజనాలు, భవిష్యత్తును వివరించి ఆయనకు నచ్చజెప్పడంతో చలసాని మెత్తబడ్డారు. పార్టీయే తనకు ముఖ్యమని, అధిష్ఠానం ఆదేశాలు పాటిస్తానని రాజీనామా లేఖపై సంతకం చేశారు. మరొకరికి అవకాశం కల్పించాలనే సదుద్దేశంతోనే ఆయన వైదొలిగారని మంత్రి పార్థసారథి తెలిపారు.

చలసాని పెట్టిన షరతులు.. మంత్రి హామీ

రాజీనామా చేసే ముందు చలసాని మంత్రి పార్థసారథి ముందు రెండు కీలక హామీలు ఉంచారు. విజయవాడ చిట్టినగర్‌లోని 24.70 ఎకరాల మిల్క్ ఫ్యాక్టరీ స్థలానికి కృష్ణా మిల్క్ యూనియన్ పేరుతో టైటిల్ డీడ్ ఇప్పించాలని కోరారు. అయితే ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే, ఖాళీ అయిన డైరెక్టర్ పోస్టులో గతంలో నామినేషన్ సమయంలో వైదొలిగిన చలసాని చక్రపాణికి అవకాశం ఇవ్వాలని కోరారు. దానికి కూడా మంత్రి సానుకూలంగా స్పందించారు.

Also Read: హైడ్రా ఉద్యోగాల ఈవెంట్స్.. సరూర్‌నగర్ స్టేడియం వద్ద గందరగోళం!

Tags

Related News

ట్రావెల్ బస్సులో అగ్నిప్రమాదం.. ప్రమాదం సమయంలో 38 మంది ప్రయాణికులు, శ్రీశైలంలో ఘటన

కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, విద్యాసంస్థలకు సెలవు

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. హైకోర్టు విచారణపై స్టే, ఈనెల 30 లోపు..

శ్రీకాకుళంలో విషాదం.. టెక్కలి వద్ద రైలు ఢీకొని నలుగురు యువకులు దుర్మరణం!

మెగా డీఎస్సీ రచ్చ.. 250 మంది వైసీపీ నేతలపై అట్రాసిటీ కేసులు!

ఏపీలో పొంగి ప్రవహిస్తున్న వాగులు-వంకలు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష, కంట్రోల్ రూమ్ నెంబర్లు

ఏపీలో పింఛన్‌దారులకు బిగ్ అలర్ట్.. కేంద్రం వాటా బ్యాంక్ ఖాతాలోకి, ఒకసారి చెక్ చేసుకోండి?

ధర్మవరంలో కేతిరెడ్డి మాస్టర్ స్ట్రోక్.. ఆ మాజీ కౌన్సిలర్లకు మైండ్ బ్లాంక్!

Big Stories

Advertisement
×