E-Paper
Advertisement

చరిత్రలో తొలిసారి.. రైల్లో కాశ్మీర్‌కు పెట్రోల్, డీజిల్ సరఫరా!

చరిత్రలో తొలిసారి.. రైల్లో కాశ్మీర్‌కు పెట్రోల్, డీజిల్ సరఫరా!
Advertisement

First Fuel Train to Kashmir: కాశ్మీర్ లోయకు ఇంధన సరఫరాలో భారతీయ రైల్వే మరో కీలక ముందడుగు వేసింది. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్  మార్గంలో తొలిసారిగా పెట్రోల్, డీజిల్‌ను తరలించే ఇంధన రైలును విజయవంతంగా నడిపింది. BTPN బోగీల్లో పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లను తీసుకెళ్లిన ఈ గూడ్స్ రైలు ట్రయల్ రన్‌ను పూర్తి చేసింది. ఇప్పటివరకు కాశ్మీర్ లోయకు పెట్రోల్, డీజిల్ సహా నిత్యావసర వస్తువుల సరఫరా ప్రధానంగా రోడ్డు మార్గంపైనే ఆధారపడి ఉంది. ముఖ్యంగా జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి ద్వారా సరుకులు లోయకు చేరేవి. అయితే కొండచరియలు విరిగిపడటం, భారీ వర్షాలు, రోడ్డు దెబ్బతినడం లాంటి కారణాలతో ఈ మార్గంలో తరచూ రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.

ఫ్యూయల్ సరఫరా ట్రయల్ రన్ సక్సెస్

ఈ నేపథ్యంలో రైల్వే మార్గం ద్వారా ఇంధనాన్ని తరలించేందుకు చేసిన తొలి ప్రయత్నం ప్రాధాన్యత సంతరించుకుంది. కాశ్మీర్‌కు రైలు సర్వీసులు ప్రారంభమైన తర్వాత ఇంధన రైళ్లను నడపడంపై భద్రతాపరమైన అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. ముఖ్యంగా పొడవైన రైల్వే సొరంగాలు, ఇంధనం వల్ల ఏర్పడే అగ్ని ప్రమాదాల వంటి అంశాలను అధికారులు పరిశీలించారు. పలు భద్రతా అంచనాల తర్వాత తాజాగా ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భవిష్యత్తులో కాశ్మీర్‌కు పెట్రోల్, డీజిల్ సరఫరాలో రైల్వే కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. రైళ్ల ద్వారా ఇంధనాన్ని తరలించడం వల్ల రోడ్డు రవాణాపై ఆధారపడటం తగ్గడంతో పాటు సరఫరా వేగంగా, సురక్షితంగా జరిగే అవకాశం ఉంటుంది. రవాణా ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

కాశ్మీర్‌కు ఇప్పటికే పలు సరుకు రైళ్లు

Advertisement

USBRL మార్గం పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత కాశ్మీర్‌కు పలు రకాల సరుకులను రైళ్ల ద్వారా తరలిస్తున్నారు. సిమెంట్‌తో నిండిన సరుకు రైళ్లు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఆహార ధాన్యాలు, ఎరువులు వంటి సరుకులు ఇప్పటికే లోయకు చేరాయి. వాహనాల రవాణాలో కూడా రైల్వే మార్గం ఉపయోగపడుతోంది. రైలు ద్వారా కాశ్మీర్‌ కు చేరిన తొలి మారుతి సుజుకి వాహనాలు కూడా ఇటీవల వార్తల్లో నిలిచాయి. భారత సైన్యానికి అవసరమైన శీతాకాల సరఫరాలను కూడా రైళ్ల ద్వారా తరలిస్తున్నారు.

మరోవైపు కాశ్మీర్‌లో పండ్ల సీజన్ ప్రారంభం కావడంతో ఆపిల్స్, చెర్రీలు, ఇతర ఉద్యానవన ఉత్పత్తులను దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలించడంలో కూడా రైల్వే సేవలు ఉపయోగపడుతున్నాయి. రోడ్లు ధ్వంసం అయిన సందర్భాల్లో రైతులకు నష్టం తగ్గించేందుకు ప్రత్యేక పార్సిల్, కార్గో రైళ్లను ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాశ్మీర్‌కు తొలి ఇంధన రైలు ట్రయల్ రన్ విజయవంతం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. భవిష్యత్తులో ఇంధనం సహా కీలకమైన సరుకుల రవాణాలో రైల్వే మరింత ముఖ్యమైన మార్గంగా మారే అవకాశం ఉంది.

Advertisement

Read Also: CNGపై కేంద్రం సంచలన నిర్ణయం.. 2028 నుంచి కొత్త ఇంధన విధానం అమలు!

Tags

Related News

ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన ప్రేమ.. 9 వేల మైళ్లు దాటి అమెజాన్‌కు వెళ్లిన యువతి!

ఎమర్జెన్సీ డోర్ తెరవబోయిన ప్రయాణికుడు.. విమానంలో హైడ్రామా!

కేరళ వెళ్లేవారికి గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు!

జర్మన్ యువతితో హైదరాబాదీ యూట్యూబర్‌ ఎంగేజ్ మెంట్.. వీళ్ల పరిచయం భలే గమ్మత్తు!

వరదలతో ట్రైన్ క్యాన్సిల్.. రీఫండ్ ఇవ్వని రైల్వేకు భారీ షాక్!

కల్కా-సిమ్లా టాయ్ ట్రైన్ మళ్లీ ప్రారంభం.. టికెట్ ధర జస్ట్ 50 రూపాయలే!

తత్కాల్ మిస్ అయ్యిందా? చివరి నిమిషంలో కన్ఫర్మ్ టికెట్ బుక్ చేసుకునే సీక్రెట్ ట్రిక్ ఇదే!

Big Stories

Advertisement
×