Microsoft Warning: సైబర్‌దాడులకు రోజు రోజుకూ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో హెచ్చరిక జారీ చేసింది టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్. ప్రయాణికులు, హోటళ్లలో బస చేసే వారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడులకు కుట్ర జరుగుతోందని మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ టీమ్ హెచ్చరించింది. హోటల్-పబ్లిక్ ప్రాంతాల్లో ఉన్న వైఫై నెట్‌వర్క్‌ల ద్వారా దాడులు జరిగే అవకాశముందని పేర్కొంది. ఈ దాడి వెనుక రష్యాకు చెందిన హ్యాకింగ్ గ్రూప్‌తో సంబంధం ఉన్న సంస్థలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తంచేసింది.
రోజు రోజుకూ సైబర్ దాడులు ప్రమాదకరంగా మారుతున్నాయని తెలిపింది మైక్రోసాఫ్ట్. హోటళ్లు, ఎయిర్‌పోర్టులు, కాన్ఫరెన్స్ సెంటర్లు, ఉచిత వైఫైకి కనెక్ట్ అయిన తర్వాత హ్యాకర్లు దాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారని ప్రస్తావించింది. మాల్వేర్ సిస్టమ్‌లోకి ఎంట్రీ కాగానే యూజర్ స్క్రీన్‌ను రికార్డ్ చేయడం, ఆడియో-వీడియో సంభాషణలు వినడం, స్క్రీన్‌షాట్లు తీసే ప్రమాదం పేర్కొంది. కీబోర్డ్‌పై టైప్ చేసే ప్రతి అక్షరం, బ్రౌజర్‌లో సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లు, మైక్రోసాఫ్ట్ 365 లాగిన్ వివరాలను రికార్డ్ చేస్తున్నట్లు వెల్లడించింది.
బ్రౌజర్ అప్‌డేట్ చేయాలని, విండోస్ సెక్యూరిటీ స్కాన్ చేయాలని.. గూగుల్ సెక్యూరిటీ చెక్ పూర్తయిందంటూ… యూజర్ల చేత హానికర సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేయిస్తున్నట్లు గుర్తించింది సదరు కంపెనీ. ఒక్కసారి మాల్వేర్ సిస్టమ్‌లోకి ప్రవేశిస్తే.. కంప్యూటర్‌ను రిమోట్‌గా నియంత్రించగలరని స్పష్టంచేసింది. ఈ క్రమంలో హోటళ్లు, పబ్లిక్ ప్రదేశాల్లో వైఫైకి దూరంగా ఉండాలని సూచన చేసింది. వ్యక్తిగత మొబైల్ హాట్‌స్పాట్ లేదా ఎన్‌క్రిప్టెడ్ ప్రైవేట్ కనెక్షన్‌లను వాడాలని పేర్కొంది. అనుమానాస్పద పాప్-అప్‌లను నమ్మవద్దని తెలిపింది.
ప్రయాణాల సమయంలో ఉద్యోగులు పబ్లిక్ నెట్‌వర్క్‌లలో కార్పొరేట్ సమాచారాన్ని, ఖాతా వివరాలను ఎంటర్ చేయకుండా జాగ్రత్త వహించాలని హెచ్చరించింది మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ టీమ్. ఇంటర్నెట్ దాడిని క్యాప్టివ్‌క్రంచ్ గా వర్ణించింది. మే నెల నుండి చురుకుగా సాగుతోందని, అతిథులను ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయడానికి ఉపయోగించే వై-ఫై మౌలిక సదుపాయాలను క్యాప్టివ్ పోర్టల్‌లను దెబ్బతీయవచ్చని పేర్కొంది. ఈ కార్యకలాపాలకు స్టార్మ్-2945 అనే సమూహం కారణమని, అది రష్యాకు చెందిన హ్యాకింగ్ సంస్థ మిడ్‌నైట్ బ్లిజార్డ్‌తో సంబంధం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేసింది. దీనిని APT29 లేకుంటే కోజీ బేర్ అని పిలుస్తారని తెలిపింది.
ALSO READ: వీఐ యూజర్లకు శుభవార్త.. కొత్తగా ప్లాన్స్ లాంఛ్, నిజంగా అదిరిపోయాయ్