Airtel Rs 999 Plan: ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ తమ పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం ఒక అదిరిపోయే ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. రూ. 999 లేదా అంతకంటే ఎక్కువ ధర కలిగిన ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను రీఛార్జ్ చేసుకునే యూజర్లకు ఉచితంగా ‘యాపిల్ బెనిఫిట్స్’ (Apple Benefits) అందిస్తున్నట్లు ప్రకటించింది. దీనిద్వారా ఐఫోన్ లేదా ఇతర యాపిల్ డివైజ్‌లు వాడుతున్న కుటుంబాలకు అదిరిపోయే ప్రయోజనాలు లభించనున్నాయి. చేకూరనుంది.
ఈ కొత్త అప్‌డేట్ వల్ల ఎయిర్‌టెల్ రూ. 999 ఆపై ప్లాన్ వినియోగదారులకు మూడు ప్రధాన యాపిల్ సేవలు ఎలాంటి అదనపు రుసుము లేకుండా లభించనున్నాయి. అందులో ఒకటి ఐక్లౌడ్+ (iCloud+). దీని ద్వారా ఫోటోలు, వీడియోలు, ఫైళ్లు, పాస్‌వర్డ్‌లను సురక్షితంగా స్టోర్ చేసుకోవచ్చు. రెండోది యాపిల్ టీవీ. దీనిని ఉపయోగించుకొని యాపిల్ ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు, సినిమాలను స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. మూడోది యాపిల్ ఆర్కేడ్ (Apple Arcade). దీని ద్వారా ప్రకటనలు, ఎలాంటి చెల్లింపులు లేకుండా వందలాది గేమ్‌లను ఉచితంగా ఆడుకోవచ్చు.
ఒకే ప్లాన్‌తో ఇంట్లోని ముగ్గురు వ్యక్తులు బెనిఫిట్స్ పొందేందుకు ఈ ఫ్యామిలీ ప్లాన్ డిజైన్ చేశారు. ఈ ప్లాన్ కింద మొత్తం 3 సిమ్ కార్డ్‌లను (1 ప్రైమరీ + 2 యాడ్-ఆన్) వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు, ఫాస్ట్‌లేన్ టెక్నాలజీతో కూడిన రోమింగ్ డేటా లభిస్తుంది. అదనపు బెనిఫిట్స్ కింద యాపిల్ సేవలతో పాటు జియోహాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వంటి ఇతర ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు కూడా యూజర్లు పొందొచ్చు.
Also Read: సుప్రీంలో చుక్కెదురు.. దానం నాగేందర్ ఆసక్తికర రియాక్షన్.. ‘ఇది ముందే తెలుసంటూ..!’
ఈ ప్లాన్ ఉన్న ఎయిర్‌టెల్ యూజర్లు సులభంగానే యాపిల్ సేవలను పొందే వీలుంది. ముందుగా మొబైల్‌లోని ‘ఎయిర్ టెల్ థాంక్స్ యాప్’ ఓపెన్ చేసి, ‘రివార్డ్స్ అండ్ ఓటీటీలు’ సెక్షన్‌కి వెళ్లాలి. అక్కడ కనిపించే ‘Apple iCloud+’ ఆఫర్ కార్డ్‌పై క్లిక్ చేసి, ‘Apple ID’ తో సైన్ ఇన్ అయితే ఈ సేవలు తక్షణమే యాక్టివేట్ అవుతాయి. ఒకే ప్లాన్‌లో ఫ్రీ కాల్స్, డేటా, గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, క్లౌడ్ స్టోరేజ్ అన్నీ కవర్ అవుతుండటంతో ఐఫోన్ వినియోగదారులకు ఇది నిజంగా పండగే అని చెప్పవచ్చు.
Also Read: బ్యాంకుల సమ్మె ఎఫెక్ట్.. సెప్టెంబర్ 25వ తేదీనే జీతాలు.. కేంద్రం కీలక ఆదేశాలు!