Neem Karoli Devotee Profit| 21 ఏళ్ల వయసులో చాలామంది యువత ఉద్యోగం, కెరీర్ గురించి ఆలోచిస్తారు. అయితే అనుప్రియ నగర్ మాత్రం తన జీవితంలో ఊహించని నిర్ణయం తీసుకున్నారు. స్విట్జర్‌ల్యాండ్‌లో వచ్చిన వచ్చిన మంచి ఉద్యోగ అవకాశాన్ని పక్కన పెట్టి ఆమె తన అనూహ్యంగా రూ.50 లక్షలు పెట్టుబడి చేశారు. దాని ఫలితంగా ఆమెకు కొన్ని నెలల వ్యవధిలోనే రూ.50 కోట్లు రాబడి వచ్చింది. అయితే ఈ లాభాలు అంతటితో ఆగలేదు. ఇంకా పెరిగే అవకాశం ఉంది.
అనుప్రియ యూకేలో ఎకనామిక్స్ చదువుతున్న సమయంలో ఆమె నీమ్ కరోలి బాబా గురించి తెలుసుకున్నారు. ఆపిల్ కంపెనీ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్‌కు ఉన్న అనుబంధం గురించి చదివిన తర్వాత ఆమె ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత నీమ్ కరోలి బాబా జీవితం, బోధనల గురించి మరింత తెలుసుకున్నారు. ఈ కథను యువతకు కూడా పరిచయం చేయాలని ఆమె భావించారు. అదే సమయంలో హనుమాన్ అంష్ సినిమా కథ ఆమె ముందుకు వచ్చింది. కథ నచ్చడంతో ఆమె ఈ ప్రాజెక్టుకు ఆర్థికంగా మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
హనుమాన్ అంష్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో అనుప్రియ నగర్ ప్రాజెక్టులోకి వచ్చారు. ఆ సమయంలో సినిమాను పూర్తి చేయడానికి నిర్మాతలకు అదనపు నిధులు అవసరమయ్యాయి.
అనుప్రియ సినిమాకు సంబంధించిన కథను చదివి దానిపై ఆసక్తి చూపించారు. తర్వాత ప్రాజెక్టుకు తాను ఎలా సహాయం చేయగలనని చిత్రబృందాన్ని అడిగారు. అప్పుడే సినిమాకు నిధుల అవసరం ఉందని ఆమెకు తెలిసింది. సినిమా బడ్జెట్ దాదాపు రూ.1.5 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. అందులో దాదాపు మూడో వంతు మొత్తాన్ని అనుప్రియ పెట్టుబడిగా పెట్టారు. ఈ డబ్బు ఆమె విదేశాల్లో చదువుతున్న సమయంలో కూడబెట్టిన పొదుపు నుంచి ఉపయోగించారు.
విశాల్ చతుర్వేది.. హనుమాన్ అంష్ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా నీమ్ కరోలి బాబా జీవితం, బోధనల నుంచి స్ఫూర్తి పొందింది. శోభినావ్ సత్య ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా 2026 ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదల తర్వాత సినిమాకు మంచి స్పందన లభించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. తర్వాత సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో వసూళ్లు సాధించినట్లు సమాచారం.
Also Read: ప్రేమ లేదా ఫ్రెండ్‌షిప్.. చాటింగ్‌లో ఈ చిన్న సంకేతాలు కనిపిస్తే పట్టేయండి
నివేదికల ప్రకారం.. హనుమాన్ అంష్ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. అనుప్రియకు చివరకు దాదాపు రూ.50 కోట్ల వాటా రావచ్చని ఆమె పేర్కొన్నట్లు సమాచారం.
అయితే తుది లెక్కలు ఇంకా పూర్తికాలేదు. అందువల్ల రూ.50 కోట్ల మొత్తాన్ని ప్రస్తుతానికి తుది రాబడిగా చూడలేం. అయినప్పటికీ, రూ.50 లక్షల ప్రారంభ పెట్టుబడి భారీ స్థాయికి చేరే అవకాశం ఆసక్తిని కలిగిస్తోంది.
Also Read: రోజూ నెయ్యి తింటున్నారా? గుండె ఆరోగ్య సమస్యలున్నవారు ఈ విషయాలు తెలుసుకోండి
అనుప్రియ ప్రయాణం ఆధ్యాత్మికతపై ఆసక్తితో ప్రారంభమైంది. ఆ ఆసక్తి చివరకు ఆమెను సినిమా పెట్టుబడి వైపు తీసుకెళ్లింది. ప్రాజెక్టుకు నిధులు అవసరమైన సమయంలో ఆమె కథపై నమ్మకం ఉంచారు. ఆ సమయంలో సినిమా విజయం సాధిస్తుందనే హామీ లేదు. అయినప్పటికీ ఆమె తన పొదుపులోని పెద్ద మొత్తాన్ని ఈ ప్రాజెక్టులో పెట్టారు. ఇప్పుడు ఆ నిర్ణయం ఆమె జీవితంలో ఒక ప్రత్యేకమైన అవకాశంగా మారింది.
రూ.50 లక్షల పెట్టుబడికి రూ.50 కోట్ల వరకు వాటా వస్తుందనే అంచనాలు ప్రస్తుతం ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే తుది ఆర్థిక లెక్కలు వెల్లడైన తర్వాతే అసలు రాబడి ఎంతనేది స్పష్టమవుతుంది.