E-Paper
Advertisement

బైకా? స్కూటరా? రోజువారీ ప్రయాణానికి ఏది బెస్ట్?

బైకా? స్కూటరా? రోజువారీ ప్రయాణానికి ఏది బెస్ట్?
Advertisement

Bike vs Scooter Comparison: రోజూ ఆఫీస్‌కు, కాలేజీకి, ఇతర పనుల కోసం టూ వీలర్ ఉపయోగించే వారికి బైక్, స్కూటర్‌ లో ఏది కొనాలి అనే డౌట్ ఉంటుంది. మైలేజ్, సౌకర్యం, మెయింటెనెన్స్ ఖర్చు, స్టోరేజ్ లాంటి అంశాలను చూసిన తర్వాతే సరైన వెహికల్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి ప్రయాణ అవసరాలు ఒకేలా ఉండవు.

మైలేజ్ విషయంలో బైక్‌లదే పైచేయి!

పెట్రోల్ మైలేజ్ విషయానికి వస్తే సాధారణ కమ్యూటర్ బైక్‌లు ముందుంటాయి. 100cc నుంచి 110cc వరకు ఉండే బైక్‌లు మంచి మైలేజ్‌ను అందిస్తాయి. హీరో స్ప్లెండర్, హోండా షైన్ లాంటి మోడళ్లు రోజువారీ ప్రయాణాలకు తక్కువ ఫ్యూయల్ ఖర్చు అవుతుంది. సాధారణ పెట్రోల్ స్కూటర్లు మాత్రం బైక్‌లతో పోలిస్తే కొంత తక్కువ మైలేజ్ ఇస్తాయి. అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ల విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. పెట్రోల్ ఖర్చు లేకపోవడం వల్ల రోజువారీ ప్రయాణంలో రన్నింగ్ కాస్ట్‌ ను భారీగా తగ్గించుకోవచ్చు.

ట్రాఫిక్‌లో స్కూటర్ నడపడం ఈజీ

Advertisement

సిటీలో ట్రాఫిక్ మధ్య బైక్ నడిపేటప్పుడు తరచూ గేర్లు మార్చాల్సి వస్తుంది. క్లచ్‌ను పదేపదే ఉపయోగించడం వల్ల రోజువారీ ప్రయాణం కొంత అలసటగా అనిపిస్తుంది.  స్కూటర్‌ లో మాత్రం గేర్లు, క్లచ్ ఉండవు. యాక్సిలరేటర్ తిప్పితే చాలు. అందుకే ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో స్కూటర్ నడపడం సులభంగా ఉంటుంది. అయితే రోడ్లు సరిగ్గా లేని ప్రాంతాల్లో బైక్‌ ల బెస్ట్. పెద్ద చక్రాలు, మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్ కారణంగా గుంతలు, రఫ్ రోడ్లపై బైక్‌లు కొంత మంచి స్టెబులిటీని అందిస్తాయి.

స్టోరేజ్ విషయంలో స్కూటర్ బెస్ట్

రోజువారీ ఉపయోగంలో స్కూటర్లకు మరో పెద్ద అడ్వాంటేజ్ స్టోరేజ్. సీటు కింద ఉండే స్థలంలో హెల్మెట్, రెయిన్‌ కోట్, బ్యాగ్, ఛార్జర్ లాంటి వస్తువులను పెట్టుకోవచ్చు. కొన్ని స్కూటర్లలో ముందు భాగంలో కూడా చిన్న స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. బైక్‌లలో ఇలాంటి ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఉండదు. అవసరమైతే అదనంగా టాప్ బాక్స్, ఇతర లగేజీ సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలి. అందుకే ఆఫీస్‌కు వెళ్లేవారికి, రోజూ చిన్నచిన్న వస్తువులు తీసుకెళ్లేవారికి స్కూటర్ మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

మెయింటెనెన్స్ ఖర్చు ఏదికి తక్కువ?

Advertisement

కమ్యూటర్ బైక్‌లు సాధారణ మెకానికల్ సిస్టమ్‌తో ఉంటాయి. వాటి విడిభాగాలు కూడా సాధారణంగా అందుబాటులో ఉంటాయి. దీంతో దీర్ఘకాలంలో నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండే అవకాశం ఉంది. స్కూటర్లలో CVT బెల్ట్, క్లచ్ లాంటి మెయింటెనెన్స్ అవసరం ఉంటుంది. బాడీ ప్యానెల్స్ కారణంగా కొన్ని రిపేర్లకు ఖర్చు కూడా పెరగవచ్చు. అయితే వాహనాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు? ఎలాంటి మోడల్ ఎంచుకున్నారు? అనే అంశాలపై అసలు మెయింటెనెన్స్ ఖర్చు ఆధారపడి ఉంటుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవచ్చా?

రోజూ ఒకే మార్గంలో 30 నుంచి 50 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వారికి ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.  ఛార్జింగ్ ఖర్చు తక్కువగా ఉండటం వల్ల రన్నింగ్ ఖర్చు తగ్గుతుంది. అయితే ఎక్కువ దూరాలు ప్రయాణించేవారు, తరచూ హైవేపై వెళ్లేవారు, ఇంట్లో ఛార్జింగ్ సదుపాయం లేని వారు పెట్రోల్ బైక్‌ను ఎంచుకోవడం మంచిది. సిటీ ట్రాఫిక్‌లో సులభంగా నడపడం, స్టోరేజ్, సౌకర్యం ముఖ్యమైతే స్కూటర్ మంచిది. రోజువారీ ప్రయాణంతో పాటు ఎక్కువ దూరాలు వెళ్లాల్సి ఉంటే, మంచి మైలేజ్, మన్నిక, తక్కువ మెయింటెనెన్స్ కావాలంటే కమ్యూటర్ బైక్ వైపు చూడటం మంచిది.

Read Also: ఏబీఎస్ vs సీబీఎస్.. వర్షాకాలంలో బైక్‌కు ఏ బ్రేకింగ్ సిస్టమ్ సేఫ్?

Tags

Related News

ఏబీఎస్ vs సీబీఎస్.. వర్షాకాలంలో బైక్‌కు ఏ బ్రేకింగ్ సిస్టమ్ సేఫ్?

కొనుగోలుదారులకు షాక్.. టీవీఎస్ ఆర్బిటర్ ధర పెంపు!

ఆగస్టు 15న మహీంద్రా డబుల్ సర్‌ప్రైజ్.. విజన్ S, BE 7 గ్రాండ్ ఎంట్రీ!

భారత సైన్యం ఇప్పటికీ బుల్లెట్‌ను ఎందుకు నమ్ముతుంది? ఇదీ అసలు కథ!

కియా To హ్యుందాయ్.. ఇండియన్ మార్కెట్ లోకి అడుగు పెట్టబోతున్న 5 క్రేజీ కార్లు ఇవే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి బిగ్ అడ్వెంచర్ బైక్.. లాంచ్ కు ముందే హిమాలయన్ 750 లీక్!

అమ్మకాల్లో దుమ్మురేపిన మారుతి గ్రాండ్ విటారా.. ఏకంగా 4 లక్షల యూనిట్లు సేల్!

Big Stories

Advertisement
×