BigTV English
Advertisement

North Korean soldiers: రష్యా సైన్యంలో ఉత్తర కొరియా ఆర్మీ.. యుద్ధం వదిలేసి ‘ఆ’ వీడియోలతో జల్సా, మరీ ఇంత కరువా!

North Korean soldiers: రష్యా సైన్యంలో ఉత్తర కొరియా ఆర్మీ.. యుద్ధం వదిలేసి ‘ఆ’ వీడియోలతో జల్సా, మరీ ఇంత కరువా!

రష్యా, ఉక్రెయిన్ నడుమ గత రెండు సంవత్సరాలుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ రెండు దేశాలు పరస్పర దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యాకు మద్దతుగా తమ సైన్యాన్ని రంగంలోకి దింపారు. ఇప్పటికే సుమారు 10 వేల మంది సైన్యాన్ని రష్యాకు పంపించారు. ఉక్రెయిన్ కు వ్యతిరేకంగా పోరాట బాట పట్టించారు.


ఉక్రెయిన్ సైన్యం చేసిన పనికి అందరూ షాక్!

యుద్ధం కోసం రష్యాకు వెళ్లిన నార్త్ కొరియా సైనికులు చేసే పని చూసి అందరూ షాక్ అవుతున్నారు. యుద్ధాన్ని పక్కకు పెట్టి ఫోన్లలో ఆ వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారట. తాజాగా ఈ విషయాన్ని ఓ అంతర్జాతీయ పత్రిక బయటపెట్టింది. ఉక్రెయిన్ సైన్యానికి రష్యా ప్రభుత్వం అపరిమిత ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించింది. ఈ నేపథ్యంలో చాలా మంది సైనికులు ఆ వీడియోల్లో మునిగితేలుతున్నారట.


నార్త్ కొరియాలో ఇంటర్నెట్ పై ఆంక్షలు

కిమ్ జోంగ్ ఉన్ నార్త కొరియాలో ఇంటర్నెట్ వినియోగం మీద బోలెడు ఆంక్షలు పెట్టారు. ఇంటర్నెట్ యాక్సెస్ అనేది కేవలం కొద్దిమందికే ఉంటుంది. ఉత్తర కొరియన్లు కేవలం 28 వెబ్ సైట్లను మాత్రమే యాక్సెస్ చేసే అవకాశం ఉన్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇక సౌత్ కొరియాలో అశ్లీల వెబ్ సైట్లు యాక్సెస్ చేయడం అనేది అస్సలు సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో రష్యాకు వెళ్లిన ఉత్తరకొరియా సైనికులకు ఎలాంటి ఆంక్షలు లేని ఇంటర్నెట్ సౌకర్యం లభించడంతో చాలా మంది ఆ వీయోలు చూస్తూ టైంపాస్ చేస్తున్నారట.

రష్యాలోనూ అశ్లీల వెబ్ సైట్లపై నిషేధం

ఉత్తరకొరియా మాదిరిగానే రష్యాలోనూ ఇంటర్నెట్ విషయంలో చాలా ఆంక్షలు ఉన్నాయి. కిమ్ జోంగ్ ఉన్ మాదిరిగానే  పుతిన్ కూడా ఆన్‌ లైన్ ప్రపంచం మీద సెన్సార్ విధించారు. 2015లో ప్రపంచంలోని అతిపెద్ద అశ్లీల సైట్లపై నిషేధాన్ని విధించారు. 2021 తర్వాత మరిన్ని అలాంటి సైట్లను బ్లాక్ చేశారు. అయితే, అశ్లీల సైట్ల విషయంలో పలు ఆంక్షలు ఉన్నప్పటికీ సైనికులు ఆ సైట్లను యాక్సెస్ చేస్తున్నారు.

Read Also: రాత్రిళ్లు ఫోన్ చూస్తున్నారా? ఇక ‘అది’ కష్టమే.. మరిచిపోండి, ఎవరు చెప్పినా వినరు కదా!

రష్యా సైన్యంతో కలిసి యుద్ధరంగంలోకి నార్త్ కొరియా సైన్యం   

మరోవైపు నార్త్ కొరియా సైన్యం రష్యా సైన్యంతో కలిసి ఉక్రెయిన్ భూభాగంలోకి అడుగు పెట్టింది. రెండేళ్లుగా జరుగుతున్న ఈ యుద్ధంలోకి మూడో దేశం అడుగు పెట్టడం ఇదే తొలిసారి. రష్యా సైనిక స్థావరాల్లో కిమ్ దళాలు శిక్షణ తీసుకుంటున్నాయి. ఉక్రెయిన్ ఆక్రమించిన రష్యా భూభాగం కుర్స్క్ ను తిరిగి పొందేందుకు ప్రయత్నించిన  కనీసం 40 మంది ఉత్తర కొరియా సైనికులను ఉక్రేనియన్ దళాలు ఇప్పటికే తుడిచిపెట్టినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ యుద్ధం ఎటు మలుపు తిరుగుతుందోనని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Read Also: అలా వదిలేస్తే కష్టమే.. క్షీణిస్తున్న సునీత విలియమ్స్ ఆరోగ్యం, డాక్టర్ల షాకింగ్ రిపోర్ట్

Related News

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Adarsh Behera: సూడాన్ లో భారతీయుడు కిడ్నాప్, ఇంతకీ ఎవరీ ఆదర్శ్ బెహరా?

Big Stories

×