BigTV English

Kanguva: మన్నింపు.. సాంగ్ బావుంది కానీ, ఎక్కడో చూసినట్టుందే..?

Kanguva: మన్నింపు.. సాంగ్ బావుంది కానీ, ఎక్కడో చూసినట్టుందే..?

Kanguva: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య- శివ కాంబోలో వస్తున్న చిత్రం కంగువ. స్టూడియో గ్రీన్ బ్యానర్ , యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో సూర్య సరసన దిశా పటానీ నటిస్తుండగా.. అనిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా సినిమాగా కంగువ నవంబర్  14 న ప్రేక్షకుల ముందుకు రానుంది.


రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో  ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం వరుస ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచుతున్నారు. ముఖ్యంగా సూర్య ఒక్కడే.. ప్రమోషన్స్ తన భుజాలపై వేసుకొని చేస్తున్నాడు. ఇప్పటికే తెలుగులో అందరి స్టార్ హీరోలను కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. నాగ్ బిగ్ బాస్ షోకు వెళ్ళాడు.  బాలయ్య అన్ స్టాపబుల్ లో సందడి చేసాడు. విశ్వంభర సెట్ లో చిరును కలిశాడు. ఇలా తెలుగులో ప్రమోషన్స్ ను నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేసి సక్సెస్ అయ్యాడు.

Bandla Ganesh: గురూజీని అప్పుడు బండబూతులు తిట్టి.. ఇప్పుడు బర్త్ డే విషెస్ చెప్తున్నావా అన్నా.. ?


ఇంకోపక్క మేకర్స్ .. ఈ సినిమాలోని ఒక్కో సాంగ్ ను రిలీజ్ చేస్తూ  మరింత  హైప్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా కంగువ నుంచి మన్నింపు అనే లిరికల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. “తననే తొలిచే మనుషులకే.. దాహం చేర్చు నేల గుణం. తననే విరిచె చేతులకే నీడై కాచే చెట్టు గానం” అంటూ మొదలైన ఈ సాంగ్ చివరివరకు ఎంతో అద్భుతంగా సాగింది. మెలోడీస్ కానీ, సాడ్ సాంగ్స్ కానీ ఇవ్వడంలో మ్యూజిక్ డైరెక్టర్  దేవి శ్రీప్రసాద్ ను కొట్టేవారు లేరు అంటే ఆశ్చర్యం లేదు.

మన్నించడం ఎంత గొప్ప లక్షణమో.. ఈ సాంగ్ లో వివరించారు. వాటికి ఉదాహారణలతో సహా రాసిన లిరిసిస్ట్ కళ్యాణ్ చక్రవర్తిని మెచ్చుకోకుండా ఉండలేము. ఇక వీడియోలో ఒక చిన్నపాపను చూసి సూర్య ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇక్కడే తెలుగువారికి ఏదో సినిమా గుర్తుస్తూ ఉంటుంది. అదే కళ్యాణ్ రామ్ బింబిసార.

Anushka Shetty: ఒక వేశ్య.. ఇంత బ్రూటల్ గా హత్యలు చేస్తుందా..?

బింబిసార చిత్రంలో కూడా  చెడ్డవాడిగా ఉన్న రాజు భూలోకానికి వచ్చి ఒక చిన్నారి ప్రేమకు, ఆమె క్షమాగుణానికి బందీ అయ్యి.. చెడును వదిలి మంచి వైపు అడుగులు వేస్తాడు. ఇప్పుడు ఈ సాంగ్ చూస్తుంటే సేమ్ అదే గుర్తొస్తుందని అంటున్నారు. ఇక్కడ కూడా యుద్ధవీరుడుగా కర్కశత్వంగా ఉండే సూర్య.. ఆ చిన్నారి వలన మారినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాకు బింబిసారకు ఏమైనా సంబంధం ఉందా.. ? లేదా.. ? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×