E-Paper
Advertisement

రూ.1000లోపు బెస్ట్ బ్లూటూత్ స్పీకర్ కావాలా? Mivi Fort S16 పై ఒక లుక్కేయండి

రూ.1000లోపు బెస్ట్ బ్లూటూత్ స్పీకర్ కావాలా? Mivi Fort S16 పై ఒక లుక్కేయండి
Advertisement

Mivi Fort S16 price in India: ఈ రోజుల్లో బడ్జెట్ ధరలో బెస్ట్ గ్యాడ్జెట్స్..కోసం వెతికే వాళ్ల సంఖ్య పెరిగిపోయింది. ముఖ్యంగా మ్యూజిక్ లవర్స్‌కి తక్కువ ధరలో మంచి బేస్, అదిరిపోయే సౌండ్ ఇచ్చే బ్లూటూత్ స్పీకర్ కావాలి. సరిగ్గా ఇలాంటి వాళ్ల కోసమే.. Mivi Fort S16 బ్లూటూత్ స్పీకర్ మార్కెట్లోకి వచ్చింది. కేవలం రూ.899 ధరలోనే.. 16W పవర్‌ఫుల్ సౌండ్, వాయిస్ అసిస్టెంట్, డ్యూయల్ ఫుల్ రేంజ్ డ్రైవర్ల లాంటి టాప్ క్లాస్ ఫీచర్లతో వస్తున్న ఈ స్పీకర్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Mivi Fort S16 బ్లూటూత్ స్పీకర్ రివ్యూ:

సాధారణంగా రూ. 1000 లోపు బడ్జెట్‌లో మంచి బ్రాండెడ్ స్పీకర్ దొరకడం చాలా అరుదు. కానీ ఇండియన్ బ్రాండ్ ‘Mivi’ తన Mivi Fort S16 మోడల్‌తో మ్యూజిక్ లవర్స్‌కి క్రేజీ సర్ప్రైజ్ ఇచ్చింది. చూడటానికి ఒక ప్రీమియం మినీ సౌండ్‌బార్ లాగా ఉండే ఈ స్పీకర్‌ను రూమ్ నిండా సౌండ్ వచ్చేలా పర్ఫెక్ట్‌గా డిజైన్ చేశారు.

డ్యూయల్ డ్రైవర్స్ & 16W పవర్:

Advertisement

ఈ స్పీకర్‌లో డ్యూయల్ ఫుల్ రేంజ్ డ్రైవర్స్ ఇచ్చారు. దీని వల్ల వచ్చే 16W RMS సౌండ్ అవుట్‌ పుట్ చాలా క్లియర్‌గా ఉంటుంది. మీరు రూమ్‌లో కూర్చుని మూవీస్ చూస్తున్నా లేదా సాంగ్స్ వింటున్నా క్రిస్టల్ క్లియర్ వాయిస్ , అదిరిపోయే బేస్ ఎక్స్‌పీరియన్స్ చేయవచ్చు. ఇందులో ఉన్న రెండు పాసివ్ రేడియేటర్లు బేస్ లెవెల్స్‌ను మరింత పెంచుతాయి.

6 గంటల నాన్-స్టాప్ ప్లేబ్యాక్:

పార్టీ మూడ్‌లో ఉన్నప్పుడు లేదా జర్నీలో ఉన్నప్పుడు ఛార్జింగ్ అయిపోతే చిరాగ్గా ఉంటుంది కదా? అందుకే Mivi ఇందులో 2000mAh బ్యాటరీని అందించింది. ఇది సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 6 గంటల ప్లేబ్యాక్ టైమ్ ఇస్తుంది. అంటే మీ ఫేవరెట్ ప్లేలిస్ట్‌ని లేదా ఒక పూర్తి సినిమాను ఎటువంటి బ్రేక్ లేకుండా ఎంజాయ్ చేయొచ్చు.

వాయిస్ అసిస్టెంట్ & స్మార్ట్ ఫీచర్స్:

Advertisement

ఈ స్పీకర్‌లో వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ ఉంది. అంటే.. మీరు స్పీకర్ నుంచే గూగుల్ అసిస్టెంట్ లేదా సిరిని యాక్టివేట్ చేసి, చేతులతో తాకకుండానే వాయిస్ కమాండ్స్ ద్వారా సాంగ్స్ మార్చవచ్చు లేదా కాల్స్ మాట్లాడవచ్చు.

కనెక్టివిటీ ఆప్షన్స్:

ఇందులో బ్లూటూత్ v5.1 లేటెస్ట్ కనెక్టివిటీ ఉంది. దీని వల్ల స్మార్ట్‌ఫోన్ లేదా లాప్‌టాప్‌కి క్షణాల్లో కనెక్ట్ అవుతుంది. బ్లూటూత్ మాత్రమే కాకుండా.. పెన్‌డ్రైవ్ కోసం USB స్లాట్, SD కార్డ్ స్లాట్, AUX కేబుల్ కనెక్టివిటీ కూడా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:

ధర:రూ.899 కే దొరుకుతున్న బెస్ట్ బడ్జెట్ డీల్.

డిజైన్: ప్రీమియం ఫాబ్రిక్ మెష్ , మ్యాట్ ఫినిషింగ్‌తో లగ్జరీ లుక్ ఇస్తుంది.

సౌండ్ క్వాలిటీ: చిన్న, మీడియం రూమ్స్ కోసం 16W పర్ఫెక్ట్.

Also Read: బడ్జెట్ ధర.. రాకెట్ స్పీడ్ డ్రైయింగ్! ఈ 5 వాషింగ్ మెషీన్లపై ఓ కన్నేయండి!

మైనస్ పాయింట్స్:

అవుట్‌డోర్ (బయట) పెద్ద పార్టీలకి దీని సౌండ్ కొంచెం తక్కువగా అనిపించవచ్చు.

ఎవరు కొనాలి?

మీరు రూ.1000 లోపు బడ్జెట్‌లో, టీవీకి లేదా లాప్‌టాప్‌కి కనెక్ట్ చేసుకోవడానికి ఒక స్టైలిష్ మినీ సౌండ్‌బార్ లేదా బ్లూటూత్ స్పీకర్ కోసం చూస్తుంటే Mivi Fort S16 ని కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు. ఈ ప్రైస్ రేంజ్‌లో ఇంతకంటే.. బెస్ట్ ఫీచర్స్ ఉన్న స్పీకర్ దొరకడం కష్టమే.

Related News

బిగ్ స్క్రీన్ లవర్స్‌కు పండగే..మార్కెట్‌లోకి మరో కొత్త ప్రొజెక్టర్ వచ్చేసింది!

మూడు సార్లు మడతపెట్టే ఫోన్.. Huawei Mate XT 2లో ఇవన్నీ ఉంటాయా?

బడ్జెట్ ధరలోనే అల్ట్రా-ప్రీమియం స్మార్ట్‌వాచ్! క్లాసీ లుక్ ఖాయం

Poco F9 Ultraపై భారీ అంచనాలు.. కొత్త చిప్‌సెట్, ప్రీమియం డిజైన్‌తో ఎంట్రీ!

వీడియో ఎడిటర్లు, గేమర్లకు ఇక తిరుగులేదు.. ASUS నుండి బెస్ట్ ప్రాసెస్ ల్యాప్‌టాప్స్ వచ్చేశాయ్!

అతి తక్కువ ధరలో.. స్మార్ట్ టీవీ! హోమ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ గ్యారంటీ

8000mAh బ్యాటరీ.. 80W ఛార్జింగ్.. Realme P4s 5Gలో ఇవే హైలైట్స్!

Airtel ఆల్‌ రౌండర్ ప్లాన్.. 3 నెలల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ 5G, ఫ్రీగా 20+ ఓటీటీలు!

Big Stories

Advertisement
×