E-Paper
Advertisement

టికెట్ లేకున్నా వారిని రైల్లో నుంచి దించకూడదట, ఇండియన్ రైల్వేలో చాలామందికి తెలియని సేఫ్టీ రూల్..

టికెట్ లేకున్నా వారిని రైల్లో నుంచి దించకూడదట, ఇండియన్ రైల్వేలో చాలామందికి తెలియని సేఫ్టీ రూల్..
Advertisement

Indian Railways Travel Rule: రైలులో ప్రయాణించే చాలా మందికి రైల్వే రూల్స్ గురించి పెద్దగా అవగాహన ఉండదు. రైల్వే ప్రయాణం చేయాలంటే టికెట్ కచ్చితంగా ఉండాలి. కానీ, కొన్నిసార్లు టికెట్ లేకపోయినా రైల్లో నుంచి దించకూడదనే రూల్స్ ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో భారతీయ రైల్వే ప్రయాణికుల భద్రతకు సంబంధించిన కొన్ని ప్రత్యేక నిబంధనలను అమలు చేస్తోంది. వాటిలో ఒకటి మహిళలు, చిన్నారుల రక్షణకు సంబంధించినది.

టికెట్ లేకపోయినా మహిళలు, చిన్నారులను దించకూడదు!

రాత్రి సమయంలో టికెట్ లేకుండా మహిళలు లేదంటే, మైనర్ పిల్లలు రైలులో ప్రయాణిస్తున్నట్లు గుర్తించినా, వారిని వెంటనే రైలు నుంచి దించేయ కూడదని రైల్వే రూల్స్ చెప్తున్నాయి. అలాంటి సందర్భాల్లో వారి భద్రతకు  ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రత్యేక మార్గదర్శకాలను తీసుకొచ్చారు. అర్థరాత్రి సమయంలో తెలియని ప్రాంతంలో మహిళలను, చిన్నారులను రైలు నుంచి దించడం వల్ల వారి ప్రాణాలకు, భద్రతకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే అలాంటి పరిస్థితుల్లో అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచిస్తారు.

Advertisement

నిజానికి ఈ రూల్ టికెట్ లేకుండా ప్రయాణించడానికి అనుమతి అని భావించకూడదు. టికెట్ లేకుండా ప్రయాణించడం ఇప్పటికీ నిబంధనలకు విరుద్ధమే. అలాంటి ప్రయాణికులపై జరిమానాతో పాటు ఇతర చర్యలు తీసుకునే అధికారం రైల్వే అధికారులకు ఉంటుంది. కానీ.. మహిళలు, మైనర్ల విషయంలో ముందుగా వారి భద్రతను దృష్టిలో ఉంచి నిర్ణయం తీసుకోవాలని రైల్వే మార్గదర్శకాలు చెబుతున్నాయి.

రైలు ఎక్కగానే TTEకి విషయం చెప్పాలి!

ఎప్పుడు ఏ పరిస్థితి ఎదురవుతుందో ఎవరికీ తెలియదు. అత్యవసరంగా రైలెక్కాల్సి రావచ్చు. టికెట్ తీసుకునే అవకాశం లేకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో భయపడకుండా వెంటనే టికెట్ ఎగ్జామినర్, లేదంటే రైల్వే సిబ్బందిని కలిసి విషయం చెప్పాలి. సమస్యను వారికి వివరించి, నిబంధనల ప్రకారం అవసరమైన ఛార్జీలు,  జరిమానా చెల్లించి ప్రయాణాన్ని కొనసాగించవచ్చు.

Advertisement

రైలులో ప్రయాణించే ప్రతి కుటుంబం ఈ విషయాన్ని తెలుసుకోవడం మంచిది. ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించే మహిళలు, విద్యార్థులు, చిన్నారులతో ప్రయాణించే తల్లిదండ్రులకు ఈ సమాచారం ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంది. చిన్న సమాచారం అనిపించినా, సరైన సమయంలో అది పెద్ద సహాయంగా మారుతుంది. అందుకే రైలులో తరచూ ప్రయాణించే మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ విషయాన్ని చెప్పండి. అవసరమైన సమయంలో ఈ అవగాహన వారికి ధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా, సరైన నిర్ణయం తీసుకోవడంలో కూడా ఉపయోగపడుతుంది.

Read Also: రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపిస్తున్నారా? అయితే, కష్టాల్లో పడినట్లే.. ఎందుకంటే?

Related News

పెంగ్విన్ల మలంతో కరుగుతున్న మంచు.. అంటార్కిటికాలో వింత పరిణామం!

మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 25 గంటల తర్వాత అన్ని స్టేషన్లు ఓపెన్!

రైళ్ల రద్దుపై కీలక అప్‌డేట్.. ఇండియన్ రైల్వే ఏం చెప్పిందంటే!

రన్నింగ్ ట్రైన్ లోనూ కన్ఫార్మ్ టికెట్ పొందొచ్చు, IRCTCలో ఈ సింపుల్ ట్రిక్ ఫాలోకండి!

బ్లింకిట్ గా మారిపోయిన ఇండియన్ రైల్వే.. రిక్వెస్ట్ పెట్టిన 10 నిమిషాల్లోనే డైపర్లు వచ్చేశాయ్!

రైలు క్యాన్సిల్ అయినా నో టెన్షన్.. టికెట్ డబ్బులు సింపుల్ గా ఇలా పొందవచ్చు!

IRCTC సూపర్ టూర్ ప్యాకేజీ.. భాగ్యనగర అందాలతో పాటు శ్రీశైలం మల్లన్న దర్శనం కూడా!

జస్ట్ రూ.70 వేలకే శ్రీలంక టూర్.. ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ప్యాకేజీ వివరాలివే!

Big Stories

Advertisement
×