Mixer grinder burning smell: ప్రతిరోజూ వంట పనులను చిటికెలో.. పూర్తి చేసే మిక్సర్ గ్రైండర్ సడన్‌గా మొరాయించి, విచిత్రమైన కాలిపోతున్న వాసన ఇస్తే మనలో చాలా మందికి గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. మార్కెట్లో మంచి బ్రాండెడ్ మిక్సర్ గ్రైండర్ల ధరలు సాధారణంగా రూ. 2,500 నుంచి రూ. 7,000 వరకు ఉంటున్నాయి. అంత ధర పెట్టి కొన్న మిక్సీ కొద్ది రోజులకే రిపేరుకు వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అసలు మిక్సర్ నుంచి ఆ కాలిపోతున్న వాసన ఎందుకు వస్తుంది? దాని వెనక ఉన్న కారణాలు, మోటారు పాడయ్యే ముందు కనిపించే 4 ముఖ్యమైన సంకేతాలు ఏంటో తెలుసుకుందాం.
మనం మిక్సీ జార్‌లో చాలా గట్టి పదార్థాలు లేదా ఒకేసారి ఎక్కువ పరిమాణంలో పిండి, పప్పులు వేసి రుబ్బినప్పుడు బ్లేడ్ల మీద విపరీతమైన భారం పడుతుంది. దీని వల్ల మోటారు తిరగలేక స్ట్రగుల్ అవుతుంది. అలాగే జార్ కింద ఉండే కప్లింగ్ లేదా బేరింగ్స్ అరిగిపోయి జామ్ అయితే.. మోటారు రొటేట్ కాకుండా లోపల వైండింగ్ వేడెక్కి కాలిపోయిన వాసన వస్తుంది.
చాలా మంది ఒకే సారి పెద్ద జార్ నిండా పిండి లేదా పదార్థాలు వేసి, వేగంగా తిప్పాలని హై-స్పీడ్‌లో ఎక్కువ సేపు మిక్సీని.. రన్ చేస్తుంటారు.మిక్సీ మోటార్లకు నిర్దిష్టమైన కెపాసిటీ ఉంటుంది. ఇలా నిరంతరం ఓవర్ లోడ్ చేయడం వల్ల వైండింగ్ ఇన్సులేషన్ కరిగిపోయి.. బర్నింగ్ స్మెల్ వస్తుంది. ఇది మోటారు కాలిపోవడానికి ప్రధాన కారణం.
ఇంట్లో కరెంట్ సరఫరాలో .. తేడాలు ఉన్నప్పుడు లేదా సడన్‌గా హై వోల్టేజ్ వచ్చినప్పుడు ఎలక్ట్రానిక్ పరికరాలు దెబ్బతింటాయి. మిక్సీ పని చేస్తున్న సమయంలో.. సడన్‌గా వోల్టేజ్ పడిపోయినా.. లేదా పెరిగినా మోటారుపై తీవ్రమైన ప్రభావం పడి షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది.
కాలిపోతున్న ప్లాస్టిక్ లేదా వైర్ వాసన రావడం: మిక్సీ ఆన్ చేయగానే.. రబ్బరు లేదా ప్లాస్టిక్ కాలిపోయినట్లు ఘాటైన వాసన వస్తే.. లోపలి వైండింగ్ వేడెక్కుతుందని అర్థం. వెంటనే మిక్సీని ఆఫ్ చేయాలి.
మోటారు స్పీడ్ మందగించడం: ఎప్పుడూ లేనట్లుగా మిక్సీ బ్లేడ్లు.. తిరిగే వేగం తగ్గిపోయినా, సౌండ్ వచ్చినా మోటారులో లోపం ఉందని గుర్తించాలి.
మిక్సీ బాడీ విపరీతంగా వేడెక్కడం: కొద్దిసేపు మిక్సీ ఆన్ చేయగానే దాని కింది భాగం (బేస్) చేయి పెట్టలేనంతగా వేడెక్కితే.. వెంటనే దాన్ని వాడటం ఆపేయాలి.
అసాధారణ శబ్దాలు: జార్ తిరుగుతున్నప్పుడు కిర్రుమన్న శబ్దాలు లేదా మెటల్ సౌండ్ వస్తే బేరింగ్స్ లేదా కప్లింగ్ దెబ్బతిన్నాయని అర్థం.
Also Read: ఫోన్ ఛార్జర్లు వేడెక్కడం సాధారణమేనా? ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు
1.మిక్సీ జార్‌లను ఎప్పుడూ ఓవర్‌లోడ్ చేయకండి. పదార్థాలను కొద్ది కొద్దిగా వేసి గ్రైండ్ చేయాలి.
2.ఒక నిమిషం పాటు మిక్సీ రన్ చేసిన తర్వాత కొద్దిసేపు ఆపి, ఆ తర్వాత మళ్లీ వాడాలి.
3.మిక్సీని వాడిన తర్వాత జార్‌ను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. వాటర్ లోపలి బేరింగ్స్‌లోకి వెళ్లకుండా చూసుకోవాలి.
4.ఒకవేళ కాలిపోయే వాసన వస్తే.. సొంతంగా రిపేర్ చేయడానికి ప్రయత్నించకుండా వెంటనే.. ఒక మంచి ఎలక్ట్రిషియన్‌ను సంప్రదించడం మంచిది.