Mobile charger overheating causes: మనం వాడే మొబైల్ ఫోన్లు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుండటంతో, ఛార్జింగ్ పెట్టే సమయంలో.. ఛార్జర్ లేదా అడాప్టర్ కొద్దిగా వేడెక్కడం చాలా సాధారణం.ఎలక్ట్రానిక్ పరికరాలు పని చేసేటప్పుడు కరెంట్ ప్రసరణ కారణంగా ఉష్ణోగ్రత పెరగడం సహజం. అయితే.. ఆ వేడి ఎంత వరకు ఉందనే దాని బట్టి అది సాధారణమా లేదా ప్రమాదకరమా అనేది నిర్ణయించొచ్చు. మీ చేతితో ఛార్జర్‌ను తాకి చూసినప్పుడు అది గోరు వెచ్చగా ఉంటే.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ చేయి పెట్టలేనంతగా కాలిపోతుంటే.. మాత్రం అది కచ్చితంగా ఒక డేంజర్ అలర్ట్ అని అర్థం చేసుకోవాలి.
ఫోన్ బ్యాటరీకి పవర్ ఇస్తున్నప్పుడు ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ జరుగుతుంది. దీని వల్ల ఛార్జర్ కొద్దిగా వేడెక్కుతుంది. ముఖ్యంగా 65W, 100W లేదా అంతకంటే.. ఎక్కువ వాటేజ్ ఉన్న ఫాస్ట్ ఛార్జర్లు సాధారణ ఛార్జర్ల కంటే కొంచెం ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఇది కేవలం ఫోన్ ఛార్జ్ అవుతున్నంత సేపు మాత్రమే ఉండి, ఆ తర్వాత చల్లబడిపోతుంది. అదే సమయంలో.. ఛార్జింగ్ తీసేసినా కూడా అడాప్టర్ వేడిగా ఉండటం, ప్లాస్టిక్ వాసన రావడం లేదా అడాప్టర్ రంగు మారడం జరిగితే అది ప్రమాదకరమైన హెచ్చరిక సంకేతంగా భావించాలి.
లోకల్ లేదా ఫేక్ ఛార్జర్లు వాడటం: ఒరిజినల్ ఛార్జర్ పోయిందని మార్కెట్లో దొరికే రూ.200 నుంచి రూ.500 లోపు లభించే లోకల్ ఛార్జర్లు వాడటం వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. బ్రాండెడ్ ఒరిజినల్ ఛార్జర్ల ధరలు సాధారణంగా రూ. 1,000 నుంచి రూ.3,000 వరకు ఉంటాయి.
దెబ్బతిన్న ఛార్జింగ్ కేబుల్స్: వైర్ ఎక్కడైనా కట్ అయిపోయినా లేదా లోపల కాపర్ వైర్లు డ్యామేజ్ అయినా కరెంట్ సప్లై సరిగా జరగక ఛార్జర్ మీద భారం పడి వేడెక్కుతుంది.
ఫోన్ కవర్ వేసి ఛార్జ్ చేయడం: చాలా మంది ఫోన్‌కు మందపాటి.. రబ్బరు లేదా సిలికాన్ కవర్లు అలాగే ఉంచి ఛార్జింగ్ పెడుతుంటారు. దీని వల్ల ఫోన్ లోపల ఉత్పత్తయ్యే వేడి బయటకు పోలేక బ్యాటరీతో పాటు ఛార్జర్ కూడా ఓవర్ హీట్ అవుతుంది.
పోర్ట్స్‌లో దుమ్ము చేరడం: ఛార్జింగ్ జాక్ లేదా కేబుల్ పోర్ట్‌లో దుమ్ము, ధూళి నిండిపోవడం వల్ల కనెక్షన్ లూజ్ అయ్యి రెసిస్టెన్స్ పెరిగి వేడెక్కుతుంది.
Also Read: వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్..ఈ 4 రకాల మెసేజ్‌లతో సర్వం కోల్పోతారు జాగ్రత్త!
1.ఎప్పుడూ మీ ఫోన్ కంపెనీకి సంబంధించిన ఒరిజినల్ లేదా సర్టిఫైడ్ ఛార్జర్లను మాత్రమే ఉపయోగించండి.
2.ఎండలో లేదా గాలి ఆడని దిండ్లు, దుప్పట్ల మీద ఫోన్ పెట్టి ఛార్జ్ చేయకూడదు.
3.ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ విపరీతంగా వేడెక్కితే వెంటనే స్విచ్ ఆఫ్ చేసి కాసేపు ఆపాలి.
4. రాత్రి అంతా ఫోన్ ఛార్జింగ్‌లో ఉంచే అలవాటును మానుకోవడం బ్యాటరీ , ఛార్జర్ లైఫ్‌ను పెంచుతుంది.
మొబైల్ ఛార్జర్ వేడెక్కడాన్ని.. ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు. చిన్న అజాగ్రత్త కూడా భారీ షార్ట్ సర్క్యూట్‌కు లేదా ఫోన్ పేలడానికి దారి తీసే అవకాశం ఉంది. మీ ఛార్జర్ టెంపరేచర్‌ను గమనిస్తూ.. తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా మీ స్మార్ట్ ఫోన్‌ను, మీ ప్రాణాలను కాపాడుకోవచ్చు!