Mobile charger 5V 9V 12V meaning: మనం రోజూ స్మార్ట్ ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి రక రకాల ఛార్జర్లను ఉపయోగిస్తుంటాం. అయితే.. ఆ ఛార్జర్ అడాప్టర్‌లపై చిన్న అక్షరాలతో 5V, 9V లేదా 12V అని రాసి ఉండటాన్ని ఎప్పుడైనా గమనించారా? అసలు ఈ గుర్తుల అర్థం ఏంటి? ఫోన్ ఛార్జింగ్ వేగం పెరగడానికి ఇవి ఎలా సహాయపడతాయి? ఈ విషయాలు చాలా మందికి తెలియవు. టెక్నాలజీ పరంగా ఫోన్ బ్యాటరీని సురక్షితంగా, వేగంగా ఛార్జ్ చేయడానికి ఉపయోగపడే ఈ వోల్టేజ్ చిహ్నాల వెనక ఉన్న అసలు రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా మొబైల్ ఛార్జర్లపై కనిపించే ‘V’ అనే అక్షరం ‘వోల్ట్’ను సూచిస్తుంది. ఇది కరెంట్ ప్రసార ఒత్తిడిని లేదా శక్తిని కొలిచే ప్రమాణం. మార్కెట్లో లభించే రూ.15,000 నుంచి రూ.1,00,000 వరకు ఉండే ఏ ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ ఛార్జర్‌పై అయినా.. ఈ వోల్టేజ్ రేటింగ్స్ స్పష్టంగా ముద్రించి ఉంటాయి. కరెంట్ ఎంత వేగంగా లేదా ఎంత శక్తితో ఫోన్‌లోకి ప్రవేశించాలనేది ఈ వోల్టేజ్ , ఆంపియర్ పైన ఆధారపడి ఉంటుంది. వీటి ద్వారానే ఛార్జర్ వాటేజ్ లెక్కిస్తారు.
5V :
పాత కాలపు మొబైల్స్ , సాధారణ స్మార్ట్ ఫోన్ ఛార్జర్లు అన్నీ 5V (5 వోల్ట్స్) పద్ధతిలోనే పని చేసేవి. ఇది చాలా ప్రామాణికమైన వోల్టేజ్ స్థాయి. ఎలాంటి ఫోన్ అయినా వేడెక్కకుండా.. బ్యాటరీకి ఎలాంటి హాని కలగకుండా నెమ్మదిగా ఛార్జ్ చేయడానికి ఇది ఉపయోగ పడుతుంది.ఇప్పటికీ చాలా బేసిక్ ఛార్జర్లు లేదా పవర్ బ్యాంకులు ఈ 5V అవుట్ పుట్‌ను అందిస్తాయి. సాధారణంగా.. మార్కెట్లో ఇలాంటి ఛార్జర్ల ధర రూ. 300 నుంచి రూ.800 వరకు ఉంటుంది.
ప్రస్తుత టెక్నాలజీలో ఫోన్లు నిమిషాల్లో ఛార్జ్ కావడానికి ఈ 9V, 12V వోల్టేజ్‌లు ఎంతో కీలకం. ఫాస్ట్ ఛార్జింగ్ లేదా క్విక్ ఛార్జ్ సపోర్ట్ చేసే అడాప్టర్లు డైనమిక్‌గా వోల్టేజ్‌ను.. మారుస్తుంటాయి. ఫోన్ బ్యాటరీ శాతాన్ని.. బట్టి, ఛార్జర్ అవసరమైనప్పుడు వోల్టేజ్‌ను 5V నుంచి 9V లేదా 12V కి పెంచుతుంది. ఉదాహరణకు.. 9V లేదా 12V సపోర్ట్ ఉన్న 18W, 33W, 67W లేదా 120W ఫాస్ట్ ఛార్జర్లు ఫోన్‌ను చాలా తక్కువ సమయంలో ఛార్జింగ్ పూర్తి చేస్తాయి. అందుకే ఇలాంటి నాణ్యమైన ఫాస్ట్ ఛార్జర్ల ధరలు విడివిడిగా రూ. 600 నుంచి రూ.2,500 వరకు ఉంటాయి.
Also Read: ఫోన్ పోయిందా? వెంటనే చేయాల్సిన పనులేంటో తెలుసా?
మీ ఫోన్ కేవలం 5V వరకు మాత్రమే సపోర్ట్ చేస్తే.. దానికి 12V ఛార్జర్‌ను వాడటం అంత మంచిది కాదు. అయితే నేటి స్మార్ట్ ఫోన్లలో ‘చార్జింగ్ కంట్రోలర్ చిప్’ ఉంటుంది కాబట్టి, ఫోన్‌కు ఎంత అవసరమో అంతే వోల్టేజ్‌ను అది తీసుకుంటుంది. అయినప్పటికీ.. ఫోన్ కంపెనీ అందించిన ఒరిజినల్ ఛార్జర్ లేదా క్వాలిటీ గల సర్టిఫైడ్ ఛార్జర్లను మాత్రమే ఉపయోగించడం ద్వారా బ్యాటరీని కాపాడుకోవచ్చు.
మొబైల్ ఛార్జర్‌లపై ఉండే 5V, 9V, 12V లు కేవలం అక్షరాలు కావు, అవి మీ ఫోన్ బ్యాటరీకి ఎంత వేగంతో కరెంట్ అందాలనేది నిర్ణయించే కీలకమైన ప్రమాణాలు. ఈ టెక్నికల్ విషయాలను అర్థం చేసుకోవడం ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌ను సురక్షితంగా ఛార్జ్ చేసుకోవచ్చు.