Vemula Veeresham: సీఎం రేవంత్ రెడ్డి రాకతో సిరిసిల్ల పులకించిపోయిందని ప్రభుత్వ విప్ వేముల వీరేశం అన్నారు. రైతు పక్ష పాతి పేదల పెన్నిధి సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల ప్రాంతంలో కాలినడకన తిరిగారని, ప్రజల కళ్ళలో ఆనందం కనిపిస్తోందని అన్నారు. కేటీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కేటీఆర్‌లో భయం అహంకార ఏ మాత్రం తగ్గడం లేదని అన్నారు. ఉద్యమం ముసుగులో వ్యాపారం చేసి హోటళ్లు సొంతం చేసుకున్నాడని, దేశంలోనే రిజెస్ట్ పొలిటీషియన్స్ కేసీఆర్, కేటీఆర్ అని అన్నారు.
సిరిసిల్లకు నువ్వేమ్ చేశావ్ కేటీఆర్.. చేనేత నేతలు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోలేదని అన్నారు. చేనేత కుటుంబాలకు బకాయిలు మిగిల్చావ్ తప్ప చేసింది ఏమి లేదని, బతుకమ్మ చీరల పేరుతో బకాయిలు పెట్టావని ఫైర్ అయ్యారు. ఒక్క హోటల్‌తో మూడు హోటళ్ళు చేసిన బిజినెస్ ట్రిక్ చెప్పొచ్చుకదా.. యువతకు నువ్ చేసిన బిజినెస్ టాక్టిక్స్ చెప్పొచ్చుకదా అంటూ సెటేర్లు వేసారు. ఎన్నికల అఫిడేవేట్‌లో హోటల్ వివరాలు ఎక్కడ లేవని, ఎన్నికల అఫిడవిట్ వివరాలు ఉన్నాయి అంటున్నాడని తెలిపారు.
Also read: పళ్ల ఆరోగ్యం బాగుంటే ఆయుష్షు పెరుగుతుందా? 1.90 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో ఏం తేలిదంటే!
కేటీఆర్ దొంగ దొరికిపోయిండు. మీరు ప్రజల సొమ్ము దోచుకున్న దొంగలు మీరని, ఉద్యమ ముసుగులో పీల్చి పిప్పి చేసి రిచేస్ట్ ఫామిలీగా తయారు అయ్యారని అన్నారు. నెరేళ్ల ఘటన రికార్డ్ మాయం చేశావని, నెరేళ్ల బాధితులను చూడనికి మీరా కుమారి వస్తే అడ్డుకున్నారని గుర్తు చేశారు. రాబంధులు జెలగళ్ల పీక్కుతిన్నారని ఫైర్ అయ్యారు. అప్పులు మాకు ఎంజాయ్ మెంట్ నీకు నీ భాష ఏంది అమెరికాలో నేర్చింది వాడీ వీడు అని మాట్లాడే బాషనా అంటూ వేమువ వీరేషం ఫైర్ అయ్యారు.
దళితుల పట్ల ద్రోహులు మీరంతా నీ అహంకార ధోరణి సిరిసిల్ల ప్రజలు కథలు కథలుగా చెప్పారని అన్నారు. మానేరు ఇసుక తోడినవ్ నీ కులం వారికి ప్రభుత్వ భూములు అప్పన్నంగా ఇచ్చినవని సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితుల భూములు గుంజుకున్నావని, సిరిసిల్ల లో ఏ ఒక్క దళితుడికి డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదని వేముల వీరేషం తెలిపారు. విషపు నాగులు అని కోరలు పీకినం.. కోరల్లేని బుట్టలో నాట్యానికి పరిమితం మీరంతా అంటూ కేటీఆర్ పై సెటేర్లు వేసారు.
Also read: గొర్రెల కాపరిగా 8 ఏళ్ల బాలుడు.. చలించిపోయి బాలుడిని కాపాడిన మంత్రి నారా లోకేష్!