E-Paper
Advertisement

ఫోన్ పోయిందా? వెంటనే చేయాల్సిన పనులేంటో తెలుసా?

ఫోన్ పోయిందా? వెంటనే చేయాల్సిన పనులేంటో తెలుసా?
Advertisement

Stolen smartphone emergency steps: ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్‌ ఫోన్ అనేది మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమైపోయింది. ప్రయాణాల్లో.. ఉన్నప్పుడు లేదా రద్దీ ప్రాంతాల్లో మన ఫోన్ పోగొట్టుకున్నా.. లేదా ఎవరైనా దొంగిలించినా కలిగే టెన్షన్ అంతా ఇంతా కాదు. కేవలం ఫోన్ పోయిందన్న బాధే కాకుండా.. అందులో ఉన్న మన బ్యాంక్ యాప్స్, యూపీఐ సేవలు, వాట్సాప్ దుర్వినియోగం అవుతాయనే.. భయం అందరినీ వెంటాడుతుంది. ఫోన్ పోయిన క్షణంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా చేయాల్సిన అత్యవసర పనులు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

సిమ్ కార్డ్ బ్లాక్ చేయడం :

ఫోన్ పోయిన వెంటనే మనం చేయాల్సిన మొట్టమొదటి, అత్యంత ముఖ్యమైన పని మన మొబైల్ నంబర్ సిమ్ కార్డ్‌ను బ్లాక్ చేయడం. దొంగల చేతికి సిమ్ వెళితే.. వారు మీ నంబర్ ద్వారా ఓటీపీలను తీసుకుని యూపీఐ యాప్స్ అయిన గూగుల్ పే, ఫోన్‌పే లేదా పేటీఎంల ద్వారా మీ బ్యాంకు అకౌంట్ ఖాళీ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే .. వేరే ఫోన్ ద్వారా మీ టెలికాం ఆపరేటర్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి మీ సిమ్ కార్డ్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేయించండి.

వాట్సాప్ అకౌంట్‌:

Advertisement

చాలా మంది స్మార్ట్‌ ఫోన్ పోయిన తర్వాత వాట్సాప్ సేఫ్టీ గురించి ఆందోళన చెందుతారు. మీ వాట్సాప్ దుర్వినియోగం కాకుండా ఉండటానికి కొత్త సిమ్ తీసుకుని, అదే నంబర్‌తో వేరే ఫోన్‌లో వాట్సాప్‌ను లాగిన్ చేయండి. పాత ఫోన్ నంబర్ కొత్త సిమ్‌‌లోకి యాక్టివేట్ కాగానే.. పాత ఫోన్‌లోని వాట్సాప్ ఆటోమేటిక్‌గా లాగ్‌అవుట్ అయిపోతుంది. అలాగే మీ వాట్సాప్ అకౌంట్‌ను శాశ్వతంగా డిసేబుల్ చేయాలనుకుంటే support@whatsapp.com కు మెయిల్ చేయెచ్చు.

యూపీఐ , బ్యాంక్ అకౌంట్:

మీ ఫోన్ పోయిన వెంటనే మీ బ్యాంక్ హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేసి మీ మొబైల్ బ్యాంకింగ్ , యూపీఐ సర్వీసులను బ్లాక్ చేయమని చెప్పండి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందించిన పోర్టల్ ద్వారా లేదా టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా నేరుగా యూపీఐ ఐడీలను నిలిపివేయెచ్చు. తద్వారా సైబర్ నేరగాళ్లు మీ అకౌంట్ లోని డబ్బును కాజేయకుండా అడ్డుకోవచ్చు.

Advertisement

Also Read: బడ్జెట్‌లో నెంబర్-1 కిచెన్ అప్లయెన్స్..ఈ మిక్సీ మిస్సయ్యారంటే కష్టమే!

CEIR పోర్టల్ :

భారత ప్రభుత్వం టెలికాం శాఖ ఆధ్వర్యంలో.. ప్రవేశపెట్టిన సీఈఐఆర్ పోర్టల్‌ను ఉపయోగించి మీ పోయిన ఫోన్ ఐఎంఈఐ నంబర్‌ను బ్లాక్ చేయెచ్చు. దీని వల్ల ఆ ఫోన్‌లో దొంగలు వేరే సిమ్ వేసినా ఆ ఫోన్ దేశ వ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌లోనూ పని చేయదు. అలాగే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్ కాపీని సేఫ్ చేయడం చాలా ముఖ్యం.

మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న సమయంలో భయపడకుండా వెంటనే అప్రమత్తమై పైన పేర్కొన్న చర్యలు తీసుకోవడం ద్వారా పెద్ద ప్రమాదాల నుంచి బయటపడొచ్చు. మీ పర్సనల్ డేటా, ఆర్థిక భద్రతను కాపాడుకోవడానికి ఈ నిబంధనలు ఎంతో అవసరం.

Related News

రూమ్‌లో డీజే మోగించాలా? అయితే ఈ అమెజాన్ ఆఫర్స్ అసలు మిస్సవ్వొద్దు

అమెజాన్ సేల్‌లో సగం ధరకే ప్రీమియం ట్యాబ్స్..ఆపర్ ముగిసేలోపే కొనేయండి

ఛార్జర్‌లపై ఉండే.. 5V, 9V, 12V అర్థం ఏంటి? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు

బిగ్ అప్‌డేట్ ఇచ్చిన యాపిల్.. ఆ తేదీన మార్కెట్‌లోకి 3 సరికొత్త స్మార్ట్ డివైజ్‌లు!

బడ్జెట్‌లో నెంబర్-1 కిచెన్ అప్లయెన్స్..ఈ మిక్సీ మిస్సయ్యారంటే కష్టమే!

టీనేజర్ల కోసం వాట్సప్ కీలక నిర్ణయం.. ఇకపై ఆ ఆప్షన్ మారాలంటే పేరెంట్స్ పర్మిషన్ కావాల్సిందే!

వాట్సాప్‌లో ఈ 3 సీక్రెట్ ఫీచర్లు తెలుసా? మీ పని చాలా ఈజీ అయిపోతుంది!

Big Stories

Advertisement
×