Moto Book 60 Pro| మోటోరోలా కంపెనీ భారతదేశంలో కొత్త ల్యాప్‌టాప్ Moto Book 60 Proని లాంచ్ చేసింది. ఈ ల్యాప్‌టాప్ ఇంటెల్ కోర్ అల్ట్రా 7, కోర్ అల్ట్రా 5 హెచ్-సిరీస్ ప్రాసెసర్‌లతో వస్తుంది. ఇందులో అనేక AI ఫీచర్లు ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్ MIL-STD-810H డ్యూరబిలిటీ ప్రమాణాలతో దీన్ని తయారు చేశారు. 14 ఇంచ్ 2.8K OLED డిస్‌ప్లే, డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్లతో వస్తుంది. ఇది 60Wh బ్యాటరీతో 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది.
గత ఏప్రిల్‌లో మోటోరోలా ఇంటెల్ కోర్ 7 240H CPUతో Moto Book 60 బేస్ మోడల్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.
Moto Book 60 Pro ధర, లభ్యత
Moto Book 60 Pro ధర ఇంటెల్ కోర్ అల్ట్రా 5 వేరియంట్ (16GB RAM, 1TB SSD) ధర రూ. 64,990 నుంచి ప్రారంభమవుతుంది. ఇంటెల్ కోర్ అల్ట్రా 7 వేరియంట్ (32GB RAM, 1TB SSD) ధర రూ. 80,990. బ్యాంక్ ఆఫర్లతో, ఇంటెల్ కోర్ అల్ట్రా 5 (512GB స్టోరేజ్) రూ. 59,990కి, ఇంటెల్ కోర్ అల్ట్రా 7 (512GB స్టోరేజ్) రూ. 75,990కి లభిస్తాయి. ఈ ల్యాప్‌టాప్ బ్రాంజ్ గ్రీన్, వెడ్జ్‌వుడ్ రంగుల్లో వస్తుంది. ఈ ప్రత్యేక ల్యాప్ టాప్ ని ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా ఇండియా వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
Moto Book 60 Pro స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
Moto Book 60 Proలో 14 ఇంచ్ 2.8K (2,880×1,800) OLED స్క్రీన్ ఉంది, ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ సాధారణ బ్రైట్‌నెస్, 1,100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 100% DCI-P3 కలర్ గ్యామట్ కవరేజ్‌ను అందిస్తుంది. ఈ డిస్‌ప్లే TÜV రీన్‌ల్యాండ్ లో బ్లూ లైట్ మరియు ఫ్లికర్ ఫ్రీ సర్టిఫికేషన్లను కలిగి ఉంది.
ఈ ల్యాప్‌టాప్ ఇంటెల్ కోర్ అల్ట్రా 5 225H లేదా కోర్ అల్ట్రా 7 225H CPUలతో వస్తుంది. ఇవి వరుసగా 16GB లేదా 32GB DDR5 RAMని సపోర్ట్ చేస్తాయి. రెండు వేరియంట్లు 1TB SSD స్టోరేజ్‌ను అందిస్తాయి. ఇది విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
Moto Book 60 Proలో స్మార్ట్ కనెక్ట్ ఫీచర్ ఉంది, ఇది క్రాస్ డివైస్ ఫీచర్లను అందిస్తుంది. ఉదాహరణకు, క్రాస్ కంట్రోల్ ద్వారా టాబ్లెట్‌ను ల్యాప్‌టాప్ నుంచి నియంత్రించవచ్చు, స్వైప్ టు స్ట్రీమ్ ద్వారా యాప్‌లను పెద్ద స్క్రీన్‌కు మార్చవచ్చు, ఫైల్ ట్రాన్స్‌ఫర్ ద్వారా డివైస్‌ల మధ్య ఫైల్స్ ను త్వరగా షేర్ చేయవచ్చు. ఇది MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ ప్రమాణాలను పాటిస్తుంది.
ల్యాప్‌టాప్‌లో రెండు 2W డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఇందులో విండోస్ హలో ఫేషియల్ రికగ్నిషన్ కోసం IR కెమెరా, ప్రైవసీ షట్టర్ కూడా ఉన్నాయి.
Moto Book 60 Proలో 60Wh బ్యాటరీ ఉంది, ఇది 65W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో Wi-Fi 7, బ్లూటూత్ 5.4, రెండు USB 3.2 జెన్ 1, రెండు USB-C 3.2 జెన్ 1 (పవర్ డెలివరీ 3.0, డిస్‌ప్లే పోర్ట్ 1.4 సపోర్ట్‌తో), ఒక HDMI 2.1 TMDS, ఒక 3.5mm ఆడియో జాక్, ఒక మైక్రోSD కార్డ్ రీడర్ ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్ 313.4×221×16.9 mm కొలతలు, 1.39 కేజీల బరువు కలిగి ఉంది.
Also Read: డ్రైవింగ్ చేస్తూ నిద్రపోయిన యువతి.. కారు ప్రమాదంలో ప్రాణాలు కాపాడిన ఐఫోన్