BigTV English

Moto E14 Launched: మోటో మామ అదరగొట్టిండు.. రూ.7వేలకే కొత్త ఫోన్ లాంచ్.. ఫీచర్లు కెవ్ కేక!

Moto E14 Launched: మోటో మామ అదరగొట్టిండు.. రూ.7వేలకే కొత్త ఫోన్ లాంచ్.. ఫీచర్లు కెవ్ కేక!

Moto E14 Price in India: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మోటోరోలా కంపెనీ రూటే సపరేటు. ఈ మధ్య కొంత కాలం నుంచి పలు బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కొత్త కొత్త  ఫోన్లను భారీ ధరలకు రిలీజ్ చేస్తుంటే.. మోటో మాత్రం సామాన్యులను దృష్టిలో పెట్టుకుని కొత్త ఫోన్లను చాలా తక్కువ ధరలో లాంచ్ చేస్తుంది. ఇటీవలే ఒక కొత్త ఫోన్‌ను రూ.6999 ధరకు మోటో లాంచ్ చేసింది. ఇక ఇప్పుడు మరొక ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.


Motorola తాజాగా UK మార్కెట్‌లో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ‘Moto E14’ని విడుదల చేసింది. Moto E14 ఫోన్ 6.56 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 13 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. ఈ స్మార్ట్‌ఫోన్ UNISOC T606 ప్రాసెసర్‌తో వస్తుంది. Moto E14 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరతో సహా ఇతర విషయాల గురించి తెలుసుకుందాం..

Moto E14 Price


Moto E14 ధర £69.99 అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.7,412 ఉంటుంది. ఒక రకంగా ఈ ధర సామాన్యులకు మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు. ఇది మూడు కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ గ్రాఫైట్ గ్రే, పాస్టెల్ గ్రీన్, పాస్టెల్ పర్పుల్ వంటి కలర్‌లలో వస్తుంది. ఈ ఫోన్‌ Currys, JLP, O2, GiffGaff, Tesco, Amazon, Argos, Motorola అధికారిక వెబ్‌సైట్‌తో సహా పలు రిటైలర్‌ల వద్ద అందుబాటులో ఉంది.

Also Read: వావ్ ఇలాంటి ఫోన్ ఎప్పుడైనా చూశారా.. త్వరలో వచ్చేస్తుంది.. స్పెసిఫికేషన్లు అదుర్స్!

Moto E14 Features and Specifications

Moto E14 మృదువైన స్క్రోలింగ్, షార్ప్ ఇమేజ్‌ల కోసం 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇది 267 ppi పిక్సెల్ డెన్సిటీతో 6.56-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే చీకటి పరిస్థితుల్లో కంటి ఒత్తిడిని తగ్గించడానికి నైట్ లైట్ మోడ్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో డాల్బీ అట్మాస్ టెక్నాలజీ కూడా ఉంది. ఇది మంచి క్వాలిటితో ఎక్కువ సౌండ్‌ను అందిస్తుంది. Moto E14 స్ప్లాష్‌ల నుండి రక్షించడానికి IP52 వాటర్-రిపెల్లెంట్ డిజైన్‌తో అమర్చబడింది.

కెమెరా సెటప్ విషయానికొస్తే.. Moto E14 AI మద్దతుతో 13-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించబడింది. ఆపరేటింగ్ సిస్టమ్ కోసం ఇది ఆండ్రాయిడ్ 14 గో ఎడిషన్‌లో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆక్టా-కోర్ UNISOC T606 ప్రాసెసర్ ఉంది. ర్యామ్ బూస్ట్ టెక్నాలజీని ఫోన్‌లో అందించారు. మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు స్టోరేజీని విస్తరించుకునే సదుపాయాన్ని కూడా ఈ స్మార్ట్‌ఫోన్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది

Tags

Related News

Oppo K13 Turbo: ఒప్పో K13 టర్బో సిరీస్ ఇండియాలో లాంచ్.. 7,000mAh బ్యాటరీ, కూలింగ్ ఫ్యాన్‌తో సూపర్ ఫీచర్లు

Pixel 9 Discount: పిక్సెల్ 9పై భారీ తగ్గింపు.. రూ.27000 డిస్కౌంట్ త్వరపడండి

ChatGPT Chess Grok: గ్రోక్ ఏఐని ఓడించిన చాట్‌జీపీటీ.. చెస్ పోటీల్లో అద్భుత గెలుపు

iQOO Z10R vs Moto G96 vs Galaxy F36: మిడ్ రేంజ్‌లో విన్నర్ ఎవరు?

Chat GPT: సజేషన్ కోసం చాట్ జీపీటీని అడిగాడు.. చివరకు సీన్ కట్ చేస్తే..?

2025 Best Budget Phones: iQOO Z10x, Poco M7, Moto G85.. 2025లో ₹15,000 లోపు బెస్ట్ 5G ఫోన్స్ ఇవే..

Big Stories

×