BigTV English

Swaroopananda’s Security: స్వరూపానంద సెక్యూరిటీ మాటేంటి? కంటిన్యూ చేస్తారా, నెలకు 20 లక్షలా..?

Swaroopananda’s Security: స్వరూపానంద సెక్యూరిటీ మాటేంటి? కంటిన్యూ చేస్తారా, నెలకు 20 లక్షలా..?

Swaroopananda’s Security: వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు భారీగా అవినీతి జరిగిందని టీడీపీ నేతలు పదేపదే చెబుతున్నారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది. గతంలో జరిగిన అనవసర ఖర్చులను బయటకు తీస్తోంది. వైసీపీ నేతలే కాదు, జగన్ సన్నిహితులు కూడా విలాసవంతమైన జీవితాన్ని గడిపారని పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం ఉంది. అలాంటివారిలో స్వరూపానంద స్వామి ఒకరు.


జగన్‌ను అధికారంలోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేశారు స్వరూపానంద స్వామి. రిషికేష్ తీసుకెళ్లి ప్రత్యేకంగా అక్కడి పండితులతో హోమాలు చేశారాయన. స్వరూపానంద చేసిన పూజలు ఫలించాయి. అన్నట్లుగానే వైసీపీ అధికారంలోకి వచ్చేసింది. అన్నట్లు స్వామికి చేయాల్సినదంతా చేసింది అప్పటి వైసీపీ ప్రభుత్వం.

ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. వైసీపీ హయాంలో స్వరూపానందకు వై కేటగిరీ భద్రత కల్పించారట. విశాఖ జిల్లా పెందుర్తిలో ఉన్న స్వరూపానందస్వామి పీఠానికి నలుగురు గన్‌మెన్లు, ఆరుగురు సిబ్బందితో పికెట్ నిర్వహించేవారు. ఈ వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఓ ఏఎస్ఐ స్థాయిని అధికారిని నియమించారు. తరచూ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడికి వచ్చి స్వామి సేవలో తరించేవారు.


ఈ సౌకర్యాల కోసం ప్రతి నెల ప్రభుత్వం 15 నుంచి 20 లక్షల వరకు కేటాయించినట్టు సమాచారం. అంతేకాదు శారదా పీఠం కోసం ప్రత్యేకంగా కొంత భూమి కూడా కేటాయించినట్టు తెలుస్తోంది. విచిత్రం ఏంటంటే చాలామంది వైసీపీ నాయకులకు ఈ తరహా సౌకర్యాలు లేవు. తిరుమల వెళ్లినప్పుడు కూడా వీఐపీ తరహాలో స్వామి అక్కడికి వెళ్లివారు. కూటమి అధికారంలోకి వచ్చాక స్వరూపానందస్వామి భద్రతను తొలగించాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు ఈ లెక్కలు బయటకు తీసే పనిలోపడింది.

ALSO READ: జగన్ ఇంటికి భద్రత, 30 మంది ప్రైవేటు సెక్యూరిటీ

ఎన్నికల ఫలితాలు రాగానే స్వారూపానంద స్వామి మాట మార్చారు. సీఎం చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు. తాను ఎవరికీ భయపడి మీడియా సమావేశం పెట్టలేదని, శారదాపీఠంపై తప్పుడు అభిప్రాయాలు వెల్లడించకుండా ఉంటారని వివరించారు. సీఎం చంద్రబాబు అంటే తనకు చాలా గౌరవమని తెలిపారు. ఈసారైనా దేవాలయాల పాలన బాగుండేలా చూడాలని కోరారు. సంపాదన కోసం ఉన్న పీఠం తమది కాదన్నారు. అమరావతిలో శారదా పీఠం నిర్మిస్తామని మనసులోని మాట బయట పెట్టారు స్వరూపానందస్వామి.

Tags

Related News

Pulivendula ByPoll: పులివెందులలో పోలింగ్.. నన్ను బంధించారన్న వైసీపీ అభ్యర్థి, జగన్ ఖర్చు రూ100 కోట్లు

AP Liquor Case: లిక్కర్ కేసులో కొత్త విషయాలు.. ముడుపుల చేర్చడంలో వారే కీలకం, బిగ్‌బాస్ చుట్టూ ఉచ్చు

Pulivendula bypoll: పులివెందుల జెడ్పీ బైపోల్.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు, ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Big Stories

×