E-Paper
Advertisement

నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు షాక్.. ఇకపై ప్రతి ప్రొఫైల్‌కూ విడివిడిగా ఈమెయిల్స్.. తప్పనిసరి చేసిన ఓటీటీ దిగ్గజం!

నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు షాక్.. ఇకపై ప్రతి ప్రొఫైల్‌కూ విడివిడిగా ఈమెయిల్స్.. తప్పనిసరి చేసిన ఓటీటీ దిగ్గజం!
Advertisement

Netflix Profiles: ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ తన వినియోగదారులకు మరో షాక్ ఇచ్చింది. గతంలో పాస్‌వర్డ్ షేరింగ్‌పై ఉక్కుపాదం మోపిన ఈ సంస్థ.. ఇప్పుడు అకౌంట్ సెక్యూరిటీ, యూజర్ అనుభవాన్ని మెరుగుపరిచే నెపంతో సరికొత్త నిబంధనను తీసుకువచ్చింది. ఇకపై ఒకే అకౌంట్‌లో ఉండే వేర్వేరు ప్రొఫైల్‌లను లాగిన్ చేయాలంటే.. ప్రతి ప్రొఫైల్‌కు ఒక విభిన్నమైన (Unique) ఈ-మెయిల్ ఐడీని లింక్ చేయడం తప్పనిసరి చేసింది. ఈ కొత్త మార్పును జూన్ 15 నుంచి ప్రపంచవ్యాప్తంగా దశలవారీగా నెట్ ఫ్లిక్స్ అమల్లోకి తీసుకొస్తోంది.

అసలు ఏంటీ మార్పు?

ఇప్పటివరకు ఒక నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే అందులో కుటుంబ సభ్యుల కోసం గరిష్టంగా ఐదు ప్రొఫైల్‌లను క్రియేట్ చేసుకునే వెసులుబాటు ఉండేది. వీరందరూ అకౌంట్ ఓనర్.. ఈమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయ్యేవారు. కానీ కొత్త నిబంధన ప్రకారం యాప్ ఓపెన్ చేయగానే మీ ప్రొఫైల్‌కు విడిగా ఒక ఇమెయిల్ ఐడీని జత చేయమంటూ స్క్రీన్‌పై ఒక నోటిఫికేషన్ కనిపిస్తుంది. ఆ ఈమెయిల్ ఐడీని ఎంటర్ చేస్తేనే సదరు ప్రొఫైల్‌ను ఉపయోగించడానికి వీలవుతుంది. అయితే చిన్నపిల్లల కోసం కేటాయించిన ‘కిడ్స్ ప్రొఫైల్స్’కు మాత్రం ఈ నిబంధన నుండి మినహాయింపు ఇచ్చారు.

యూజర్లకు లాభామేంటి?

Advertisement

ఈ నిర్ణయం వల్ల వినియోగదారులకు కొన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయని నెట్ ఫ్లిక్ చెబుతోంది. ఒక కొత్త డివైజ్‌లో లాగిన్ అవ్వాలనుకున్నప్పుడు ప్రతిసారీ మెయిన్ అకౌంట్ ఓనర్ ఓటీపీ (OTP) లేదా పాస్‌వర్డ్ కోసం వారిపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని పేర్కొంది. ప్రొఫైల్‌కు లింక్ చేసిన ఈమెయిల్‌కే నేరుగా వెరిఫికేషన్ కోడ్ వస్తుందని తెలియజేసింది. అంతేకాకుండా ప్రతీ యూజర్.. తమ ప్రొఫైల్ కు నచ్చినట్లు సబ్ టైటిల్స్, ఆడియో లాంగ్వేజ్, డిస్ ప్లే సెట్టింగ్స్ ఇతరులకు ఇబ్బంది లేకుండా మార్చుకోవచ్చు.

కొందరిలో అసంతృప్తి

నెట్‌ఫ్లిక్స్ తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఒకే ఇంట్లో ఉంటూ వేర్వేరు డివైజ్‌లలో చూసే కుటుంబ సభ్యులకు ఇది అదనపు భారంగా మారుతుందని పేర్కొంటున్నారు. అలాగే కొందరు వినియోగదారులు తమ వ్యక్తిగత ఇష్టాల ప్రకారం సినిమాలు చూడటానికి ఒక ప్రొఫైల్, డాక్యుమెంటరీల కోసం మరో ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటారు. ఇప్పుడు అలాంటి వారు కూడా ప్రతి ప్రొఫైల్‌కు వేర్వేరు ఇమెయిల్స్ సృష్టించాల్సి రావడంపై మండిపడుతున్నారు.

వ్యక్తిగత గోప్యతపై సందేహాలు

Advertisement

నెట్ ఫ్లిక్స్ తీసుకున్న ఈ నిర్ణయంపై వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్ తన ప్రైవసీ పాలసీ ప్రకారం వినియోగదారుల ఈమెయిల్ ఐడీలను మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ కంపెనీలతో పంచుకునే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. దీనివల్ల యూజర్ల ఇన్‌బాక్స్‌లు ప్రమోషనల్ ఈమెయిల్స్‌తో నిండిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్.. ఆండ్రాయిడ్ ధరకే ఐఫోన్లు.. ఏకంగా రూ.22,000 తగ్గింపు!

పాస్‌వర్డ్ షేరింగ్‌కు చెక్ పెట్టడానికేనా?

2023లో నెట్‌ఫ్లిక్స్ ప్రవేశపెట్టిన ‘పాస్‌వర్డ్ షేరింగ్ బ్యాన్’ తర్వాత సంస్థకు భారీగా కొత్త సబ్‌స్క్రైబర్లు పెరిగారు. ఇప్పుడు ఈ విడివిడి ఈమెయిల్ ఐడీల నిబంధన ద్వారా ఒకే అకౌంట్‌ను వేర్వేరు ప్రాంతాల నుండి ఎవరు వాడుతున్నారనే విషయాన్ని మరింత కచ్చితత్వంతో ట్రాక్ చేయడానికి నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ చేస్తోందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఈ ప్రొఫైల్‌లను పూర్తిగా విడివిడి అకౌంట్లుగా మార్చమని ఒత్తిడి తెచ్చే వ్యూహంలో భాగమే ఇదనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Also Read: మార్కెట్లోకి సరికొత్త రెడ్‌మీ కొత్త ఫోన్.. 50MP OIS కెమెరా, ఆండ్రాయిడ్ 16తో అరాచకం!

Related News

మార్కెట్‌లో ఫుల్ క్రేజ్ ఉన్నఇయర్‌బడ్స్.. ఇప్పుడు ఆఫర్‌‌లో !

Whatsapp Webలో అదిరిపోయే అప్‌డేట్.. ఇకపై బ్రౌజర్‌ నుంచే గ్రూప్ వీడియో కాల్స్!

ఫోన్ వెనుక మరో డిస్‌ప్లేనా? టెక్నో నుంచి మైండ్ బ్లోయింగ్ 5G ఫోన్.. లాంచ్ డేట్ ఫిక్స్!

కిచెన్ జిడ్డుకు గుడ్‌బై చెప్పండి! అమెజాన్‌లో.. మోస్ట్ ట్రెండింగ్‌ చిమ్నీలు!

డిస్ట్రాక్షన్ ఫ్రీ హెల్త్ ట్రాకర్.. భారత్‌లోకి వచ్చేస్తున్న Google Fitbit Air, రేటు ఎంతంటే?

యాపిల్ iPhone Ultra రాకముందే.. ఫోల్డబుల్ మార్కెట్‌పై గూగుల్, శాంసంగ్ కన్ను!

లక్షల డాలర్లు తగలేసి ఇదేం డిజైన్ రా బాబు? Instagram కొత్త లోగోపై ఏకిపారేస్తున్న నెటిజన్లు!

రీచార్జ్ బాదుడుకి BSNL చెక్.. రూపాయికే సిమ్, 412 రోజుల వ్యాలిడిటీ!

Big Stories

Advertisement
×