Noise Master Buds Open: స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే.. చెవుల్లో ఇయర్‌ఫోన్స్ ఉండటం ఇప్పుడు సర్వసాధారణం. మ్యూజిక్ వినడం, కాల్స్ మాట్లాడటం, వీడియోలు చూడటం ఇలా రోజులో ఎక్కువ సమయం ఇయర్‌బడ్స్‌తోనే గడిస్తుంటారు చాలామంది. అయితే గంటల తరబడి చెవుల్లో ఇయర్‌బడ్స్ పెట్టుకోవడం కొందరికి అసౌకర్యంగా అనిపిస్తుంది. ఈ సమస్యకు భిన్నమైన పరిష్కారాన్ని చూపించేందుకు ప్రముఖ ఆడియో బ్రాండ్ నాయిస్ సరికొత్త ఓపెన్-ఈర్ ఇయర్‌బడ్స్‌తో ముందుకొచ్చింది. ‘నాయిస్ మాస్టర్ బడ్స్ ఓపెన్’ పేరుతో భారత మార్కెట్లోకి అడుగుపెడుతున్న ఈ ఇయర్‌బడ్స్ ప్రస్తుతం ప్రీ-బుకింగ్స్‌కు అందుబాటులో ఉన్నాయి. ఇక వీటికి ప్రత్యేక ఆకర్షణగా ‘సౌండ్ బై బోస్’ టెక్నాలజీ ఉండటం విశేషం.
సాధారణ ఇయర్‌బడ్స్‌లాగా ఇవి చెవి లోపలికి వెళ్లవు. దీనికోసం సీ-బ్రిడ్జ్ అనే ప్రత్యేక డిజైన్‌ను ఇచ్చారు. ఇది చెవి బయట భాగంలో సౌకర్యవంతంగా అమరుతుంది. దీనివల్ల మనం పాటలు వింటున్నా, చుట్టుపక్కల ఏం జరుగుతుందో స్పష్టంగా తెలుస్తుంది. ట్రాఫిక్‌లో ప్రయాణించేటప్పుడు లేదా ఆఫీస్‌లో ఉన్నప్పుడు పరిసరాల పట్ల అవగాహన ఉండటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సుదీర్ఘ సమయం వాడినా చెవి నొప్పి రాకుండా ఈ డిజైన్ తోడ్పడుతుంది.
Also Read: ఒక్కసారి కొంటే 5 ఏళ్లు తిరుగుండదు.. బడ్జెట్‌లో టాప్-5 ఆండ్రాయిడ్ ఫోన్లు ఇవే!
ఇందులో 10.8 మిమీ డైనమిక్ డ్రైవర్లను అందించారు. బోస్ ఆడియో ట్యూనింగ్ వల్ల సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. మన అభిరుచికి తగ్గట్టు ఆడియోను మార్చుకోవడానికి ఆరు రకాల ప్రిసెట్స్ ఉంటాయి. నాయిస్ యాప్ ద్వారా కూడా సౌండ్‌ను అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే కాల్స్ మాట్లాడేటప్పుడు బయటి నాయిస్ తగ్గడానికి నాలుగు మైక్రోఫోన్లు ఉన్న ఇఎన్‌సి సాంకేతికతను వాడారు. దీనివల్ల రద్దీ ప్రదేశాల్లో కూడా స్పష్టంగా మాట్లాడవచ్చు.
బ్లూటూత్ 5.4 వెర్షన్‌తో పనిచేసే ఈ బడ్స్‌ను ఒకేసారి రెండు డివైజ్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం ఫాస్ట్ పైరింగ్ సదుపాయం ఉంది. ఒక్కసారి పూర్తి ఛార్జింగ్ చేస్తే కేసుతో కలిపి మొత్తం 28 గంటల ప్లేబ్యాక్ టైమ్ వస్తుంది. అంతేకాకుండా.. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటంతో తక్కువ సమయంలోనే ఛార్జ్ చేసుకోవచ్చు.
నాయిస్ మాస్టర్ బడ్స్ ఓపెన్ ప్రారంభ ఆఫర్ కింద రూ.7,999 ధరకు లభిస్తున్నాయి. కార్బన్, మెర్క్యురీ అనే రెండు మెటాలిక్ కలర్స్‌లో ఇవి అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం నాయిస్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా వీటిని ప్రీ-బుక్ చేసుకోవచ్చు. అక్టోబర్ 23 నుండి ఇవి అమెజాన్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్ వంటి ప్రముఖ వేదికల్లో అందుబాటులోకి వస్తాయి.
Also Read: Wi-Fi 8 రాకతో డెడ్ జోన్స్ మాయం.. సిగ్నల్ డ్రాప్స్‌కి పర్మనెంట్ చెక్ పెట్టేసే కొత్త ఫీచర్లు!