E-Paper
Advertisement

పండును ఈ పరిస్థితుల్లో చూస్తే కన్నీళ్లు ఆగవు.. మళ్లీ డ్యాన్స్ చేయగలడా? రికవరీకి ఎంత టైమ్?

పండును ఈ పరిస్థితుల్లో చూస్తే కన్నీళ్లు ఆగవు.. మళ్లీ డ్యాన్స్ చేయగలడా? రికవరీకి ఎంత టైమ్?
Advertisement

Pandu Master Recovery Journey: ప్రముఖ కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ అభిమానులకు తన తాజా హెల్త్ కండీషన్ గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. కొన్ని నెలల క్రితం జరిగిన ప్రమాదం తర్వాత చికిత్స తీసుకుంటూ, ప్రస్తుతం క్రమంగా కోలుకుంటున్నట్లు వెల్లడించారు. యాక్సిడెంట్.. ఆ తర్వాత తన రికవరీ జర్నీకి సంబంధించిన వీడియోను యూట్యూబ్‌ లో షేర్ చేయబోతున్నట్లు ప్రకటించారు.ఒకప్పుడు తన డ్యాన్స్‌ తో అలరించిన పండు మాస్టర్ ఇప్పుడు నెమ్మదిగా కోలుకుంటూ కనిపించడం అభిమానులను భావోద్వేగానికి గురిచేస్తోంది.

నాలుగు నెలల క్రితం ప్రమాదం

సుమారు నాలుగు నెలల క్రితం పండు మాస్టర్‌కు యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో ఆయన కాలు పూర్తిగా విరిగిపోయింది. డాక్టర్లు కష్టపడి కాలుకు ఆపరేషన్ చేసి.. చికిత్స అందించారు. ఆ తర్వాత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో పోరాడుతూ, రికవరీ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి గతంతో పోలిస్తే మెరుగుపడుతున్నప్పటికీ, పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.

రికవరీ జర్నీని అభిమానులతో పంచుకోనున్న పండు

Advertisement

తన ప్రస్తుత పరిస్థితిని అభిమానులకు తెలియజేస్తూ పండు మాస్టర్ యూట్యూబ్‌లో ఓ చిన్న వీడియోను షేర్ చేశారు. అయితే, త్వరలోనే పూర్తి వీడియోను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. అందులో తన రికవరీ ఎలా కొనసాగుతుందో పంచుకోనున్నట్లు చెప్పారు. నెమ్మదిగా అయినా ఆరోగ్యం మెరుగుపడుతోందనే విషయాన్ని అభిమానులతో పంచుకోవడంతో నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. అదే సమయంలో తాను త్వరగా రికవరీ కావాలని ప్రార్థనలు చేస్తున్న ప్రతి ఒక్కరికీ పండు మాస్టర్ కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులు చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత తనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నట్లు  వెల్లడించారు.

యాక్సిడెంట్ నుంచి చికిత్స వరకు పూర్తి వివరాలు త్వరలో..

ప్రమాదం ఎలా జరిగింది? ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? ఎలాంటి చికిత్స తీసుకున్నారు? ప్రస్తుతం రికవరీ ఎలా కొనసాగుతోంది? అనే విషయాలపై పూర్తి వివరాలతో పూర్తి వీడియోను త్వరలో విడుదల చేయనున్నట్లు పండు మాస్టర్ తెలిపారు. దీంతో ఆయన అభిమానుల్లో ఆ వీడియోపై ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు బయటకు రాని తన ఆరోగ్య ప్రయాణానికి సంబంధించిన వివరాలను పండు మాస్టర్ స్వయంగా వెల్లడించే అవకాశం ఉంది.

మళ్లీ డ్యాన్స్ చేయగలరా?

Advertisement

పండు మాస్టర్‌ను అభిమానులు ఎక్కువగా గుర్తు చేసుకునేది ఆయన డ్యాన్స్‌ కోసమే. అందుకే ఇప్పుడు ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్న వార్త అభిమానుల్లో ఆనందంతో పాటు ఒక ప్రశ్నను కూడా రేకెత్తిస్తోంది. పండు మాస్టర్ మళ్లీ మునుపటిలా డ్యాన్స్ చేయగలరా? దీనికి ఇప్పుడే సమాధానం చెప్పడం సాధ్యం కాదు. ప్రమాదం తర్వాత శరీరం పూర్తిగా కోలుకునే సమయం వ్యక్తి ఆరోగ్య పరిస్థితి, గాయాల తీవ్రత, చికిత్స, ఫిజియోథెరపీ, వైద్యుల సూచనలు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. సో, ఆయన మళ్లీ ఎప్పుడు డ్యాన్స్ చేయగలరనే విషయాన్ని వైద్యుల సూచనలు, ఆయన పూర్తి రికవరీ ఆధారంగానే అంచనా వేయాల్సి ఉంటుంది. ఆయన అభిమానులు మాత్రం త్వరగా పూర్తిగా కోలుకుని మళ్లీ తన డ్యాన్స్‌ తో ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుంటున్నారు.

Read Also: పసిబిడ్డ కోసం తల్లి అడిగిన చిన్న సాయం.. రైల్వే సిబ్బంది చేసిన పనికి నెటిజన్లు ఫిదా!

Tags

Related News

“బిందెల బిందెలు బావయ్యో”.. మరో ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన మాధురీ రాథోడ్!

బిగ్ బాస్ 10 5వ వారం నామినేషన్ లిస్ట్.. డేంజర్ జోన్ లో ఆ ఇద్దరే!

Nindu Noorella Saavasam Serial Today Episode October 6th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరి, పార్థును చంపకుండా అమర్ అడ్డుకుంటాడా..? 

Karthika Deepam 2 Serial Today Episode October 6th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ తో జ్యోత్స్న పెళ్లి చేస్తానన్న దీప              

హేటర్స్ కి అనసూయ దిమ్మతిరిగే రియాక్షన్!

బిగ్ బాస్ 10లో నామినేషన్స్ సెగలు.. ఆమెపై విరుచుకుపడ్డ కంటెస్టెంట్స్!

చంపేయ్ దేవుడా.. నరకం భరించలేకపోతున్నా – సుప్రీత

Big Stories

Advertisement
×