NoiseFit Diva Araya: ఈ రోజుల్లో స్మార్ట్ వాచ్‌లు కేవలం టైమ్ చూడటానికి మాత్రమే కాకుండా.. ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌గా మారిపోయాయి. ముఖ్యంగా .. మహిళల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన గాడ్జెట్ మార్కెట్లో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ప్రముఖ బ్రాండ్ నాయిస్ నుంచి వచ్చిన అద్భుతమైన స్మార్ట్ వాచ్ ఇది. ప్రీమియం లుక్, బ్లూటూత్ కాలింగ్ , ఎన్నో హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లతో వస్తోన్న ఈ స్మార్ట్ వాచ్ కేవలం రూ. 4999 ధరకే లభిస్తోంది. దీని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
సాధారణ స్మార్ట్‌వాచ్‌లు అన్నీ ఒకేలా రెక్టాంగిల్ లేదా స్క్వేర్ షేప్‌లో బోర్ కొట్టిస్తున్నాయా? అయితే.. ఈ స్మార్ట్ వాచ్ మీకు కచ్చితంగా నచ్చుతుంది. ఇది పూర్తిగా ట్రెండీ సర్క్యులర్ డయల్ డిజైన్‌తో వస్తుంది.అంతే కాకుండా ఇది చేతికి పెట్టుకున్నప్పుడు అచ్చం ఒక లగ్జరీ రిస్ట్ వాచ్ లాగా కనిపిస్తుంది. ట్రెండీ డ్రెస్సులు వేసుకునేటప్పుడు ఈ వాచ్ మీ అందాన్ని మరింత పెంచుతుంది. పార్టీలకైనా, ఆఫీసులకైనా ఇది పర్ఫెక్ట్ యాక్సెసరీగా నిలుస్తుంది.
ఫోన్ పాకెట్‌లో లేదా.. హ్యాండ్‌బ్యాగ్‌లో ఉన్నప్పుడు ప్రతిసారీ తీసి మాట్లాడటం కాస్త చిరాకుగా ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ఇందులో అడ్వాన్స్‌డ్ బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ అందించారు. వాచ్‌లోనే మైక్ , స్పీకర్ ఉండటం వల్ల నేరుగా వాచ్ నుంచే కాల్స్ మాట్లాడొచ్చు. నడుస్తున్నప్పుడు లేదా బిజీగా ఉన్నప్పుడు ఈ ఫీచర్ చాలా సౌకర్యంగా ఉంటుంది.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే మహిళల కోసం ఈ స్మార్ట్ వాచ్ ఒక పర్ఫెక్ట్ హెల్త్ పార్టనర్‌లా పని చేస్తుంది. ఇందులో హార్ట్ రేట్ మానిటరింగ్, SpO2 (బ్లడ్ ఆక్సిజన్) లెవెల్స్ చెకింగ్, స్లీప్ ట్రాకింగ్ వంటి ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి. అలాగే మహిళల ఆరోగ్యానికి సంబంధించిన ప్రత్యేక ట్రాకింగ్ ఫీచర్లు కూడా ఇందులో అందుబాటులో ఉండటం విశేషం. రోజు వారీ నడక, వర్కౌట్లు చేసేటప్పుడు కేలరీలను ఇది కచ్చితంగా లెక్కిస్తుంది.
Also Read: మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ నుంచి..సూపర్ ఇయర్‌బడ్స్
ఈ వాచ్‌లో అందించిన.. హెచ్‌డీ డిస్‌ప్లే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎండలో బయటకు వెళ్లినప్పుడు.. కూడా స్క్రీన్ క్లియర్‌గా విజిబుల్ అవుతుంది. మీ ఫోన్‌కి వచ్చే వాట్సాప్ మెసేజ్‌లు, ఇన్‌స్టా నోటిఫికేషన్స్, కాల్ అలర్ట్స్ అన్నీ ఈ వాచ్ స్క్రీన్ మీదే కనిపిస్తాయి. దీని వల్ల ఫోన్ ముఖ్యం కానప్పుడు కూడా ముఖ్యమైన అప్‌డేట్స్ మిస్ కాకుండా చూసుకోవచ్చు.
ఒకసారి చార్జ్ చేస్తే రోజంతా టెన్షన్ లేకుండా పని చేసే బ్యాటరీ బ్యాకప్ ఇందులో లభిస్తుంది. ఇన్ని ప్రీమియం ఫీచర్లు ఉన్నప్పటికీ.. దీని ధర కేవలం రూ.4999 మాత్రమే ఉండటం విశేషం. బడ్జెట్ ధరలో ..ఒక స్టైలిష్, ప్రీమియం లుకింగ్ స్మార్ట్ వాచ్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
ఫ్యాషన్ , టెక్నాలజీ రెండూ సమపాళ్లలో ఉండే ఒక మంచి స్మార్ట్ వాచ్ కోసం చూస్తున్న మహిళలకు ఇది ఒక అద్భుతమైన ఆప్షన్. రూ.5000 బడ్జెట్‌లో లభిస్తున్న ఈ ట్రెండీ గాడ్జెట్ మీ చేతికి మరింత అందాన్ని తెస్తుంది.మీరు కూడా దీనిని సొంతం చేసుకోవాలనుకుంటే వెంటనే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసేయండి!