E-Paper
Advertisement

Galaxy S27 Ultra కెమెరా రీ-డిజైన్.. Qi2 మాగ్నెటిక్ ఛార్జింగ్‌తో రాబోతుందా?

Galaxy S27 Ultra కెమెరా రీ-డిజైన్.. Qi2 మాగ్నెటిక్ ఛార్జింగ్‌తో రాబోతుందా?
Advertisement

Samsung Galaxy S27 Ultra: టెక్ ప్రియుల్లో ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ మోడల్స్ అంటే ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా ‘అల్ట్రా’ సిరీస్ ఫోన్ల డిజైన్, కెమెరా పెర్ఫార్మెన్స్ గురించి టెక్ ప్రపంచంలో ఎప్పుడూ ఆసక్తికరమైన చర్చ నడుస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే రాబోయే Samsung Galaxy S27 Ultraకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన లీక్స్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈసారి ఈ ఫోన్ పూర్తి కొత్త రూపంలో రాబోతున్నట్లు తెలుస్తోంది.

కొత్తగా మారనున్న కెమెరా డిజైన్..

గత కొన్ని తరాలుగా శాంసంగ్ తమ అల్ట్రా మోడళ్లలో వెనుకవైపు వేర్వేరుగా ఉండే కెమెరా రింగ్ డిజైన్‌ను కొనసాగిస్తూ వస్తోంది. అయితే ఈసారి ఆ శైలికి గుడ్‌బై చెప్పబోతున్నట్లు సమాచారం. Galaxy S27 Ultraలో వెనుక కెమెరాలన్నింటినీ ఒకే పెద్ద హారిజాంటల్ (అడ్డంగా ఉండే) మాడ్యూల్ లేదా బార్‌లా అమర్చే ఆలోచనలో కంపెనీ ఉందంట. దీనివల్ల ఫోన్ వెనుక భాగం సరికొత్త లుక్‌తో కనిపించే అవకాశం ఉంది.

Advertisement

Also Read: 9000mAh బ్యాటరీ.. ఏడేళ్ల అప్‌డేట్స్.. 2026లో బెస్ట్ మిడ్‌రేంజ్ ఫోన్ల లిస్ట్ వచ్చేసింది!

అల్టిమేట్ కెమెరా సెటప్..

కేవలం డిజైన్ మాత్రమే కాదు, కెమెరా సామర్థ్యంలోనూ కొన్ని పవర్‌ఫుల్ అప్‌గ్రేడ్స్ ఉండనున్నాయి. తాజా లీక్స్ ప్రకారం.. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సల్ అల్ట్రావైడ్ కెమెరాతో పాటు 50 మెగాపిక్సల్ 5x టెలిఫోటో లెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే సెల్ఫీల కోసం ఆటోఫోకస్ సపోర్ట్‌తో కూడిన 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను జత చేయవచ్చు. ఇంటర్నల్ స్పేస్ పెంచేందుకు రెండు టెలిఫోటో కెమెరాల్లో ఒకదాన్ని తీసివేసే దిశగా కూడా ఆలోచనలు జరుగుతున్నాయి.

ఇన్‌బిల్ట్ మాగ్నెటిక్ ఛార్జింగ్ సపోర్ట్..

Advertisement

ఈ డిజైన్ మార్పు వెనుక మరో బలమైన కారణం కూడా ఉందట. అదే Qi2 మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్. వెనుక కెమెరా ఏరియాను కొత్తగా డిజైన్ చేయడం వల్ల మాగ్నెటిక్ ఛార్జింగ్ అటాచ్‌మెంట్లను నేరుగా ఫోన్‌కే అనుసంధానించవచ్చు. దీంతో మాగ్నెటిక్ యాక్సెసరీస్ కోసం వినియోగదారులు ప్రత్యేకమైన ఫోన్ కేసింగ్‌లపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.

మిగతా మోడళ్ల సంగతేంటి?

శాంసంగ్ ప్రస్తుతం వివిధ రకాల ప్రొటోటైప్‌లను పరీక్షస్తోంది. అల్ట్రా మోడల్‌లో భారీ మార్పులు కనిపిస్తున్నప్పటికీ.. S27 సిరీస్‌లోని మిగిలిన మోడళ్లు పాత డిజైన్‌నే కొనసాగిస్తాయా లేక వాటిలోనూ మార్పులు ఉంటాయా అనేది ఇంకా స్పష్టత రాలేదు. అధికారికంగా విడుదలయ్యే వరకు ఇవన్నీ పరిశీలనలోనే ఉంటాయి కాబట్టి.. రాబోయే రోజుల్లో ఈ డిజైన్‌పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Also Read: గూగుల్ షాకింగ్ నిర్ణయం.. ఆ రెండు కారణాలతో Pixel 10 ధర భారీగా పతనం!

Tags

Related News

మీ ఐఫోన్ మెమరీ ఉన్నట్టుండి ఫుల్ అయిందా? ఈ ఒక్క సెట్టింగ్ ఆఫ్ చేస్తే 14GB మీ సొంతం!

తక్కువ ధరలో..మంచి పవర్ బ్యాంక్ కొనాలనుకుంటున్నారా ?

రూ.599 నుంచే వైర్‌లెస్ బడ్స్.. అమెజాన్ సేల్‌లో మిస్ అవ్వకూడని టాప్ డీల్స్!

స్మార్ట్‌ ఫోన్‌నే స్పై కెమెరాగా మార్చే టెక్నాలజీ.. కాల్స్, మెసేజెస్, చివరికి లొకేషన్స్ కూడా లీక్!

ఇంట్లో వ్యాక్యూమ్ రోబోట్ తిరుగుతోందా? హ్యాకర్లు మిమ్మల్ని సైలెంట్‌గా గమనిస్తున్నారు జాగ్రత్త!

గేమర్స్‌కు గుడ్‌న్యూస్..బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్స్‌పై భారీ డిస్కౌంట్లు

మీ ఐఫోన్‌ను టేప్ కొలతలా వాడొచ్చని తెలుసా? ఇల్లు మారేటప్పుడు ఇది చాలా హెల్ప్ అవుతుంది!

అమెజాన్ సేల్‌లో..హెడ్ సెట్స్,ఇయర్ బడ్స్‌పై భారీ ఆఫర్లు

Big Stories

Advertisement
×