E-Paper
Advertisement

భారీగా పెరగనున్న Nothing Phone 4a ధర.. వేరియంట్ల వారీగా కొత్త రేట్లు ఇవే!

భారీగా పెరగనున్న Nothing Phone 4a ధర.. వేరియంట్ల వారీగా కొత్త రేట్లు ఇవే!
Advertisement

Nothing Phone 4a Price Hike: మీరు కూడా నథింగ్ ఫోన్ 4a కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకొక ముఖ్యమైన సమాచారం. త్వరలోనే ఈ ఫోన్ ధరలు పెరగనున్నాయి. భారత మార్కెట్లో ఈ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ధరను పెంచేందుకు కంపెనీ సిద్ధమవుతున్నట్లు మార్కెట్ వర్గాల సమాచారం. త్వరలోనే ఈ కొత్త ధరలు అమలులోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి.. Nothing Phone 4aను వీలైనంత తొందరగా కొనేయడం ఉత్తమం.

పెరగనున్న ధరల వివరాలు:

తాజా లీకుల ప్రకారం.. ఈ ఫోన్ అన్ని స్టోరేజ్ వేరియంట్లపై రూ.3,000 వరకు ధర పెరిగే అవకాశం ఉంది. పెరిగిన ధరల తర్వాత 8GB RAM + 128GB మోడల్ ధర రూ.42,999కి చేరవచ్చు. అలాగే, 8GB RAM + 256GB వేరియంట్ ధర రూ.46,999, టాప్ ఎండ్ 12GB RAM + 256GB వేరియంట్ ధర రూ.49,999 వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Also Read: యాప్స్ అవసరం లేకుండానే ఐఫోన్ డేటా ఆండ్రాయిడ్‌లోకి.. Android 17 కొత్త ట్రిక్ ఇదే!

ప్రత్యేకమైన లుక్, ఫీచర్లు:

తమ మార్క్ ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో యూత్‌ను ఆకట్టుకుంటున్న ఈ ఫోన్.. బ్లాక్, వైట్, బ్లూ, పింక్ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. ఇందులో 6.78-ఇంచుల LTPS అమోలెడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందించారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత నథింగ్ OS 4.1పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 7s Gen 4 ప్రాసెసర్‌ను ఉపయోగించారు.

కెమెరా విషయానికొస్తే..

Advertisement

నథింగ్ ఫోన్ 4a ఫోన్‌ వెనుకవైపు 50MP ప్రైమరీ కెమెరాతో పాటు, 50MP పెరిస్కోప్ టెలిఫోటో, 8MP అల్ట్రావైడ్ కెమెరాలు ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. 5400mAh పెద్ద బ్యాటరీ, 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ దీనికి మరిన్ని ప్లస్ పాయింట్లు.

ఎప్పుడు కొనడం ఉత్తమం?

అయితే.. కంపెనీ నుంచి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ధర పెరగడం ఖాయంగానే కనిపిస్తోంది. కాబట్టి.. ఈ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవాలనుకునే వారు ధరల పెంపు అమల్లోకి రాకముందే ఆర్డర్ చేసుకోవడం మంచిది.

Also Read: ఇంత తక్కువ ధరకే అలాంటి ఫీచర్లా? 144Hz OLED డిస్‌ప్లే, 9000mAh బ్యాటరీతో Asus Pad T3201!

Related News

యాప్స్ అవసరం లేకుండానే ఐఫోన్ డేటా ఆండ్రాయిడ్‌లోకి.. Android 17 కొత్త ట్రిక్ ఇదే!

నాయిస్ ఇయర్‌బడ్స్ ఇప్పుడు రూ.2299కే..డోంట్ మిస్

గేమింగ్ ఫోన్ల రూపురేఖలు మార్చబోతున్న OnePlus 16.. ఏకంగా 9000mAh బ్యాటరీతో అఫీషియల్ టీజర్!

మీ పేరుతో వేరే ఎవరైనా సీమ్ వాడుతున్నారా? ఇలా చెక్ చేసుకుని డియాక్టివేట్ చేయండి!

బడ్జెట్ ప్రైస్‌లో బెస్ట్ వాషింగ్ మెషీన్..ఆఫర్ ఉన్నప్పుడే కొనేయండి

ఆండ్రాయిడ్ 16తో వచ్చిన మొదటి మాస్ టాబ్లెట్ ఇదే.. Moto Pad 70 Groove ధర ఎంతంటే?

రూ.599కే పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్..దీని ముందు హోం థియేటర్స్ కూడా వేస్ట్

Big Stories

Advertisement
×