E-Paper
Advertisement

ఇంత అద్భుతమైన డిజైన్‌కు.. ఆ ప్రైస్ ఏంటి సామీ? జూలై 7న నథింగ్ ఊచకోత ఖాయం!

ఇంత అద్భుతమైన డిజైన్‌కు.. ఆ ప్రైస్ ఏంటి సామీ? జూలై 7న నథింగ్ ఊచకోత ఖాయం!
Advertisement

Nothing Phone 4b: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ నథింగ్ నుంచి మరో సరికొత్త మొబైల్ మార్కెట్లోకి జులై 7న మార్కెట్లోకి రానుంది. ఈ క్రమంలో b సిరీస్‌లో భాగంగా ‘నథింగ్ ఫోన్ (4b)’ను కంపెనీ లాంచ్ చేయనుంది. బడ్జెట్ ధరలోనే అత్యాధునిక ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్‌కు సంబంధించిన లుక్, కలర్స్‌ను ఇప్పటికే సంస్థ రివీల్ చేయగా.. తాజాగా దీని కీలక స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.

తాజాగా లీకైన వివరాల ప్రకారం చూస్తే.. ఈ ఫోన్ 6.7 ఇంచుల AMOLED డిస్‌ప్లేతో రానుంది. ఇది 120Hz రీఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇక పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కోసం దీనిలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్‌సెట్‌ను ఉపయోగించినట్లు తెలుస్తోంది. గీక్‌బెంచ్ లిస్టింగ్‌లోనూ ఈ ఫోన్ మంచి స్కోరు సాధించింది. రోజువారీ వాడకంతో పాటు కాస్త హెవీగా ఉపయోగించినా ఈ ప్రాసెసర్ చక్కటి పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత నథింగ్ ఓఎస్‌తో పనిచేయనుంది. మార్కెట్లో ఇప్పటికే ఉన్న మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఫోన్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.

Advertisement

Also Read: 17600mAh బ్యాటరీ, ఇన్‌బిల్ట్ ప్రొజెక్టర్‌తో 8849 Tank 5 స్మార్ట్‌ఫోన్ విడుదల.. ధర ఎంతంటే?

ఈ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉండనుంది. అందులో ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్‌తో వస్తున్నట్లు సమాచారం. ఫోన్ ఎక్కువ సమయం బ్యాకప్ ఇచ్చేలా ఇందులో పెద్ద 5400mAh బ్యాటరీని అమర్చినట్లు తెలుస్తోంది. స్టోరేజ్ విషయానికొస్తే.. 8GB ర్యామ్+128GB స్టోరేజ్, అలాగే 8GB ర్యామ్+256GB స్టోరేజ్ అనే రెండు వేరియంట్లలో ఈ ఫోన్ లభించే అవకాశం ఉంది.

Advertisement

నథింగ్ ఫోన్లంటేనే డిజైన్ పరంగా చాలా ప్రత్యేకం. ఈ ఫోన్ వెనుక భాగంలో కెమెరా మాడ్యూల్ కింద చిన్న హారిజాంటల్ గ్లిఫ్ లైటింగ్ బార్‌ను అందించారు. ఇది గతంలో వచ్చిన ఫోన్ (3a) సిరీస్‌ను గుర్తుచేస్తుంది. నోటిఫికేషన్లు వస్తున్నప్పుడు, ఛార్జింగ్ అవుతున్నప్పుడు, యాప్ అలర్ట్స్ కోసం ఈ లైటింగ్ వెలుగుతుంది. ఇది ఫోన్‌కు చాలా క్లీన్ అండ్ స్టైలిష్ లుక్‌ను ఇస్తుంది. ఇప్పటికే బ్లూ కలర్ మోడల్‌ను చూపించగా.. బ్లాక్, వైట్ కలర్స్‌లో కూడా ఇది అందుబాటులోకి రానుంది.

ఒకవేళ మీరు పాత బడ్జెట్ ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతూ.. కొత్తగా మంచి డిజైన్, క్లీన్ సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని ఇచ్చే ఫోన్ కోసం చూస్తుంటే.. కొన్ని రోజులు ఆగి ఈ నథింగ్ ఫోన్ (4b) కోసం ఎదురుచూడటం మంచిది. లీకైన ఫీచర్ల ప్రకారం నథింగ్ సంస్థ దీని ధరను కూడా అందుబాటులోనే ఉంచితే, బడ్జెట్ లవర్స్‌కు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ ఫోన్ పూర్తి వివరాలు, ధర జులై 7న జరగబోయే అధికారిక ఈవెంట్‌లో తెలియనున్నాయి.

Also Read: ఆండ్రాయిడ్ 16తో వచ్చేసిన Samsung Galaxy A27 5G.. ఏకంగా 6 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్!

Related News

వామ్మో.. ఫోన్ అప్‌డేట్ వెనుక ఇంత ప్రాసెస్ ఉందా? కోడింగ్ నుంచి మీ మొబైల్ వరకు ఎలా వస్తుందంటే!

కరెంట్ పోయిన వెంటనే..తప్పకుండా ఆపేయాల్సిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్

ఫోన్ స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లమ్‌కి శాశ్వత పరిష్కారం.. ఈ 4 సెట్టింగ్స్ మార్చితే GBల కొద్దీ స్పేస్ ఫ్రీ!

గెలాక్సీ వాచ్‌పై ఆరెంజ్ డాట్ ఎందుకు వస్తుంది? దాని అర్థం ఏంటి?

వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎందుకు ఇవ్వరో తెలుసా?

ఇంటికి సోలార్ ప్యానెల్స్ వేయిస్తున్నారా? బ్లాక్ అండ్ బ్లూ ప్యానెల్స్ మధ్య తేడా ఇదే !

Samsung Galaxy వాచ్‌ను స్మార్ట్‌గా వాడాలంటే ఈ 5 సెట్టింగ్స్ మార్చాల్సిందే!

వాషింగ్ మెషీన్ వాడుతున్నారా? మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలివే!

Big Stories

Advertisement
×