One Plus Nord CI5: రోజు రోజుకూ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో ఫోన్లు, టీవీలు ఇలా ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వస్తువులు కొత్తవి మార్కెట్లోకి వస్తున్నాయి. ఊహించలేని ఫీచర్స్ ఉంటున్నాయి. ఇక ఐఫోన్ గురించి చెప్పనక్కర్లేదు. వాటిని తలదన్నేలా ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి అడుగు పెడుతున్నాయి. యూత్‌ని ఎట్రాక్ట్ చేసుకుంటున్నాయి. తాజాగా వన్ ప్లస్ నార్డ్ సీఈ 5 మార్కెట్లోకి రానుంది. దీనికి సంబంధించి ఫీచర్స్ ఇటీవల లీక్ అయ్యాయి.
వన్ ప్లస్ నార్డ్ సీఈ 5 ఫీచర్స్ లీక్
చైనాకి చెందిన స్మార్ట్ ఫోన్స్ తయారీ కంపెనీ వన్ ప్లస్. ఇప్పటివరకు రకరకాల సిరీస్ లో ఫోన్లను విడుదల చేసింది. తాజాగా వన్ ప్లస్ నార్డ్ సీఈ 5 సిరీస్‌లో స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ఒక మాటలో చెప్పాలంటే నెక్స్ట్ జనరేషన్ మోడల్. మే నెలలో భారత మార్కెట్ లోకి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఆ కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
గత ఏడాది ఏప్రిల్‌లో One plus Nord CE 4 స్మార్ట్ ఫోన్ విడుదల కాగా, ఇప్పుడు దీనికి అడ్వాన్స్డ్ వెర్షన్‌గా ఐదో వెర్షన్ అందుబాటులోకి రానుంది. స్మార్ట్ ఫోన్ ఇంకా విడుదల కాకముందే ఫీచర్స్ ఆన్‌లైన్‌లో లీకైంది. వాటి ప్రకారం వన్ ప్లస్ నార్డ్ సీఈ-5 ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ కలిగివుంది.
అలాగే 50 మెగా పిక్సెల్ Sony LYT-600 మెయిన్ కెమెరా. 7100 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండనుంది. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టంతో అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌తో అందుబాటులోకి రానుంది. ధర సుమారు రూ. 25 వేలుగా ఉండే అవకాశం.
ALSO READ: 11నెలల మొబైల్ రీఛార్జ్, జస్ట్ రూ.895కే
Oneplus Nord CE 5 స్పెసిఫికేషన్స్‌ని చూద్దాం.
-6.7 ఇంచ్ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ ప్లే, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ కలిగివుంది.
-HDR 10 Plus, 1080 x 2412 పిక్సల్స్ రిజల్యూషన్
-మీడియా టెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్
-ఆక్సిజన్ ఓఎస్ 15 ఆధారిత ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టం
-8 జీబీ ర్యామ్, ఆపై 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో రానుంది.
-50 పిక్సెల్ Sony LYT-600 కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్‌తో డ్యూయల్ కెమెరా సెట్ అప్
-సెల్ఫీలు-వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
-ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజెషన్, అలాగే అండర్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్
-5జీ నెట్ వర్క్ సపోర్ట్ కాగా, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉండనుందని తెలుస్తోంది