E-Paper
Advertisement

OnePlus 12 యూజర్లు ఆ ఒక్క అప్‌డేట్ చేయొద్దు.. చేస్తే ఫోన్ డెడ్ అవ్వడం ఖాయం!

OnePlus 12 యూజర్లు ఆ ఒక్క అప్‌డేట్ చేయొద్దు.. చేస్తే ఫోన్ డెడ్ అవ్వడం ఖాయం!
Advertisement

OnePlus 12: లక్షల రూపాయలు పెట్టి కొన్న ఫోన్‌.. ఒక్క సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో డెడ్ అయిపోతే? ఇప్పుడు OnePlus 12 యూజర్లను వెంటాడుతున్న ఆందోళన ఇదే. కొత్త అప్‌డేట్‌తో ఫోన్ పనితీరు మెరుగుపడాల్సింది పోయి.. ఏకంగా మదర్‌బోర్డ్ ఫెయిలై ఫోన్లు పనిచేయకుండా పోతున్నాయనే ఫిర్యాదులు కలకలం రేపుతున్నాయి. దీంతో అప్‌డేట్ విషయంలో యూజర్లు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అప్‌డేట్ చేస్తే ఫోన్ డెడ్..

ప్రముఖ టెక్ టిప్‌స్టర్ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. OnePlus 12 మోడల్‌లో రీసెంట్ అప్‌డేట్ చేసిన తర్వాత మదర్‌బోర్డులు పాడైపోతున్న కేసులు వేగంగా పెరుగుతున్నాయని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం ఈ ఫోన్ వాడుతున్నవారు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ చేయకపోవడమే మంచిదని సూచించారు. కంపెనీ స్పందించి దీనికి పరిష్కారం చూపించే వరకు వేచి చూడటం బెటర్.

Advertisement

Also Read: రూ.35,000 బడ్జెట్‌లో నెక్ట్స్ లెవెల్ ఫోన్.. Realme P4s లీక్డ్ ఫీచర్లపై ఓ లుక్కేయండి!

మిగతా ఫోన్ల పరిస్థితి ఏంటి?

Advertisement

ఈ వార్త బయటకు రాగానే చాలామంది బాధితులు తమ అనుభవాలను పంచుకున్నారు. అప్‌డేట్ చేసిన వెంటనే తమ ఫోన్ పూర్తిగా ఆగిపోయిందని ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ సమస్య కేవలం OnePlus 12కే పరిమితమని, OnePlus 13 యూజర్లు కంగారు పడాల్సిన పనిలేదని తెలుస్తోంది. కానీ ఐకూ నియో 10, మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ వాడేవారు కూడా అప్‌డేట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లు చెబుతున్నారు.

ఇప్పుడు ఏం చేయాలి?

మీ ఫోన్ సురక్షితంగా ఉండాలంటే.. వెంటనే సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆటోమేటిక్ సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్స్‌ను ఆఫ్ చేయండి. ఇది మీ ఫోన్‌ను డెడ్ అవ్వకుండా చూస్తుంది. కంపెనీ అధికారికంగా ప్రకటన విడుదల చేసి, ఈ బగ్‌ను సరిచేసే వరకు అప్‌డేట్స్ జోలికి వెళ్లకుండా ఉండటమే తెలివైన పని.

Also Read: కొత్త లుక్‌లోకి Instagram.. వర్డ్‌మార్క్‌ను ఎందుకు మార్చాల్సి వచ్చిందో తెలుసా?

Tags

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×