E-Paper
Advertisement

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. స్టేషన్లలో నీళ్లు తాగారో అంతే సంగతులు!

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. స్టేషన్లలో నీళ్లు తాగారో అంతే సంగతులు!
Advertisement

Railway Water Quality Alert: రైల్వే ప్రయాణికులు దాహం తీర్చుకోవడానికి వాటర్ కూలర్, స్టేషన్‌లోని కుళాయి నీటిని తీసుకుంటారు. అయితే, కొన్ని స్టేషన్లలో ఈ నీటి నాణ్యతపై ఆందోళన వ్యక్తమవుతోంది. భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నిర్వహించిన ఆడిట్‌ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పలు రైల్వే స్టేషన్లలో తాగునీటిలో ఈ.కోలి బ్యాక్టీరియా ఉన్నట్లు వెల్లడించింది.

రైల్వే స్టేషన్ల నీటిలో ఈ.కోలి

CAG తన నివేదికలో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో తాగునీటి నమూనాలను పరీక్షించింది. వాటర్ కూలర్ల నుంచి తీసుకున్న కొన్ని నమూనాల్లో ఈ.కోలి బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. దక్షిణ రైల్వే పరిధిలోని కోయంబత్తూరు, పాలక్కాడ్ జంక్షన్లు, దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని హైదరాబాద్ స్టేషన్‌లో కూడా ఇలాంటి సమస్య గుర్తించినట్లు నివేదిక వెల్లడించింది. మధ్య రైల్వే పరిధిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, భివండి రోడ్, కళ్యాణ్, లోనావాలా, తూర్పు రైల్వే పరిధిలోని మధుపూర్ స్టేషన్లలోనూ నీటి నమూనాల్లో ఈ.కోలి ఉన్నట్లు వెల్లడైంది.

నీటి నాణ్యతపై తీవ్ర ఆందోళన  

Advertisement

2022-23లో ఎనిమిది రైల్వే జోన్లలోని 49 స్టేషన్లలో ప్లాట్‌ఫామ్ కుళాయిల నుంచి నీటి నమూనాలు సేకరించారు. 2023-24లో తొమ్మిది జోన్లలోని 56 స్టేషన్లలో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో టోటల్ కోలిఫార్మ్ బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. ఈ.కోలి బ్యాక్టీరియాలోని కొన్ని రకాల వల్ల విరేచనాలు, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. తీవ్రమైన సందర్భాల్లో ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

512 స్టేషన్లలో తనిఖీలు

ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించేందుకు CAG మొత్తం 512 నాన్ సబర్బన్ రైల్వే స్టేషన్లను ఆడిట్ చేసింది. ఇందులో ఏకంగా 458 స్టేషన్లలో కనీస అవసరమైన సౌకర్యాల విషయంలో లోపాలు ఉన్నట్లు గుర్తించింది. అంటే, తనిఖీ చేసిన స్టేషన్లలో దాదాపు 89 శాతం స్టేషన్లలో అవసరమైన సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవని నివేదిక చెబుతోంది.

తాగునీరు నుంచి మరుగుదొడ్ల వరకు

Advertisement

రైల్వే బోర్డు 2018లో అన్ని స్టేషన్లలో కనీస అవసరమైన సౌకర్యాలను కల్పించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో తాగునీరు, వెయిటింగ్ హాళ్లు, సీటింగ్, ప్లాట్‌ఫామ్ షెల్టర్లు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, చెత్తబుట్టలు, గడియారాలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. అయితే, వీటిలో చాలా సౌకర్యాలు పలు స్టేషన్లలో అందుబాటులో లేవని ఆడిట్‌లో తేలింది.

పెద్ద స్టేషన్లలోనూ సమస్యలు

న్యూఢిల్లీ, ముంబై సెంట్రల్, హౌరా, సీల్దా, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ లాంటి కీలక స్టేషన్లలో కూడా  సౌకర్యాల కొరత ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ప్యాసింజర్ ఎమినిటీస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను పరిశీలించినప్పుడు 201 స్టేషన్లలో లాట్రిన్లు, 403 స్టేషన్లలో యూరినల్స్, 2,035 స్టేషన్లలో నీటి కుళాయిల కొరత ఉన్నట్లు గుర్తించారు. రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు అందించే నీటి నాణ్యతను క్రమం తప్పకుండా పరీక్షించాలని CAG సూచించింది. నీటి సరఫరా వ్యవస్థలను తనిఖీ చేసేందుకు నిర్ణయించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. ప్రయాణికుల ఆరోగ్యం, పరిశుభ్రత విషయంలో రైల్వేలు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని CAG నివేదిక స్పష్టం చేసింది.

Read Also: ఆరావళి ఎక్స్‌ ప్రెస్‌లో రచ్చ.. నటి అంతరా బెనర్జీ అరెస్ట్!

Tags

Related News

ఆరావళి ఎక్స్‌ ప్రెస్‌లో రచ్చ.. నటి అంతరా బెనర్జీ అరెస్ట్!

మాల్దీవ్స్ కు వెళ్లే ఇండియన్స్ కు గుడ్ న్యూస్.. ఇక అందుబాటులోకి మరిన్ని విమానాలు!

సెప్టెంబర్ 1 నుంచి ఆలయాల్లో మొబైల్ ఫోన్ల నిషేధం, ప్రభుత్వం కీలక నిర్ణయం!

వందే భారత్ స్లీపర్‌పై బిగ్ అప్డేట్.. 24 బోగీల రైలు వచ్చేస్తోంది!

భోగాపురం ఎయిర్‌పోర్టు.. అర్ధరాత్రి నుంచి విమానాల రాకపోకలు, బస్సుల ఛార్జీల మాటేంటి?

ఫ్లైట్ క్యాన్సిల్.. విమానాశ్రయంలో ప్రయాణికురాలు చేసిన పనికి అంతా షాక్!

ఢిల్లీ వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. ఈ తేదీల్లో వందేభారత్ సహా పలు రైళ్లు రద్దు!

Big Stories

Advertisement
×