E-Paper
Advertisement

ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం.. ప్రభుత్వాలకు సెన్సార్ షాక్, అసలు మేటరేంటి?

ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం..  ప్రభుత్వాలకు సెన్సార్ షాక్, అసలు మేటరేంటి?
Advertisement

Elon Musk: టెక్ యుగంలో సోషల్‌మీడియాకు సామాన్యులు అలవాటు పడిపోయారు.  అదొక వ్యసనంగా మారిపోయింది. సోషల్ మీడియా ఓపెన్ చేయకుంటే ఏదో కోల్పోయినట్టు ఫీలవుతారు. అందులో రకరకాల వార్తలు వస్తుంటాయి, వాటిలో చాలామంది నమ్ముతుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే అందులో ఎలాంటి సెన్సార్ ఉండదు. అక్కడి ప్రభుత్వ చట్టాలను సోషల్ మీడియా నిర్వాహకులు ఏ మాత్రం పట్టించుకోరు. ఈ క్రమంలో పలు‌ దేశాలు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

 

ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం

Advertisement

ఈ మధ్యకాలంలో సోషల్‌మీడియా సంస్థలకు వివిధ దేశాలు షాక్‌లు ఇస్తున్నాయి. అమెరికా మాదిరిగా అన్ని దేశాల్లో రకరకాల కంటెంట్‌ను ఓపెన్‌గా ప్రచురిస్తున్నాయి. దీనివల్ల ఆయా దేశాల చట్టాలకు అవి ఇబ్బందిగా, పెను ప్రమాదంగా మారిన, మారుతున్న సందర్భాలు కోకొల్లలు. ఆయా దేశాల చట్టాలను ఏ మాత్రం పట్టించుకోలేదు. ఫలితంగా ప్రభుత్వాలను దించే స్థాయికి వెళ్లిపోతున్నాయి సోషల్‌మీడియా సంస్థలు. ఈ క్రమంలో పలుదేశాలు కన్నెర్ర చేస్తున్నాయి. దీంతో సోషల్ మీడియా సంస్థలకు ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి నెలకొంది.

ప్రభుత్వాలను ఢీ కొడుతున్న సోషల్ మీడియా సంస్థలు

ఈ నేపథ్యంలో శనివారం ఓ ప్రకటన చేశారు ఎలాన్ మస్క్. ప్రభుత్వాలు తొలగించమని కోరే ఏ విధమైన సెన్సార్‌షిప్ ఇప్పుడు యూజర్‌కు స్పష్టంగా కనిపిస్తుందని పోస్ట్ చేశారు. ప్రభుత్వాలు కొన్ని పోస్ట్‌లు తొలగించమని కోరినప్పుడు వాటిని యూజర్స్‌కు స్పష్టంగా తెలియజేయాలని డిసైడ్ అయ్యారు. దీనివల్ల ట్రాన్స్‌పరెన్సీ పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అంతకుముందు ఎక్స్ రికమెండేషన్ అల్గారిథమ్‌ను ఓపెన్-సోర్స్ చేస్తామన్నారు. ర్యాంకింగ్ సిస్టమ్‌లు ఎలా పని చేస్తాయో ప్రజలు తెలుసుకునేలా చేస్తాయన్నారు.

Advertisement

 

ప్రభుత్వ ఆదేశాలు ఇకపై యూజర్‌కు కనపడేలా..

ప్రభుత్వ అభ్యర్థనలు స్పష్టంగా చూపించడం ద్వారా ఏ కంటెంట్‌ను తొలగించాలి? దానికి చట్టపరమైన కారణాలు ఏమిటి? అనే వివరాలు యూజర్లకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. దీనిద్వారా ప్రభుత్వం ఎలా జోక్యం చేసుకుంటున్నాయి? అనే విషయాలు యూజర్‌కు తెలియనుంది. దాంతో యూజర్లు.. ప్రభుత్వ తీరును అర్థం చేసుకుని, మళ్లీ ఆ తరహా కంటెంట్ పోస్టు చేయరన్నది భావనగా చెబుతున్నారు. గతంలో ఈ విధమైన ప్రభుత్వ ఆదేశాలు స్పష్టంగా ఉండేది కాదు, కానీ కొత్త విధానం ద్వారా ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను స్పష్టంగా చూడొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వానికి-ప్రజలకు లింకు చేశారు మస్క్. నాలుగేళ్ల కిందట ట్విట్టర్‌ను టేకోవర్ చేసిన నుంచి ఉచిత వాక్ స్వాతంత్ర్యాన్ని ప్రాధాన్యంగా పెట్టారు. దీనివల్ల వివిధ దేశాల చట్టాలకు కట్టుబడి ఉండాల్సి వస్తుంది.

ALSO READ: మిచిగాన్‌లో వరుస హత్యలు.. ఆరుగురు మృతి, వారిలో నిందితుడు కూడా, ఏం జరిగింది?

క్రిప్టో ప్రీఫింగ్ రిపోర్టు ప్రకారం ప్రభుత్వ అభ్యర్థనలను 98.8 శాతం వరకు ఎక్స్ అమలు చేస్తోందని చెబుతోంది. అలా చేయడం యూజర్లకు తమ ఎక్స్‌పై నమ్మకం తగ్గి, తమ కంటెంట్ ఎందుకు తొలగిస్తున్నారు అనే ప్రశ్నలు రైజ్ చేస్తున్నారన్నది వారి ప్రశ్న. అందుకు సమాధానం తీసుకొచ్చిన కొత్త నిర్ణయమని, అందులో తప్పేమీ లేదని మస్క్ ఆలోచనగా కనిపిస్తోంది. అలా చేస్తే యూజర్లు, ఎక్స్‌పై కాకుండా నేరుగా కేంద్రంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో పలుదేశాల ప్రభుత్వాలు కంటెంట్ తొలగించాలని పదేపదే సోషల్ మీడియా సంస్థలను కోరుతున్నాయి. అలా చేయడం సోషల్ మీడియాపై ఒత్తిడి పెంచడమేకాదు, యూజర్స్ డ్రాప్ అవుతున్నాయి. మస్క్ తీసుకొచ్చిన కొత్త పద్దతి కేంద్రం ఏంటుందో చూడాలి.

Related News

మిచిగాన్‌లో వరుస హత్యలు.. ఆరుగురు మృతి, వారిలో నిందితుడు కూడా, ఏం జరిగింది?

ఆగస్టు 15న భారత్‌కే కాకుండా.. ప్రపంచంలో ఇంకా ఏయే దేశాలకు స్వాతంత్ర్యం వచ్చింది?

ట్రంప్ సంచలన ప్రకటన.. హోర్మూజ్‌పై అమెరికా జెండా ఎగురేస్తాం

తెల్లవారుజామున ఇండోనేషియాలో భారీ భూకంపం.. 7.7 గా నమోదు, సునామీ హెచ్చరిక జారీ

స్వాతంత్రం రోజున కూడా.. ప్రజల్ని వదలని పాక్.. ఇంధన ధరలు పెంచి బిగ్ షాక్!

ఇరాన్‌ను బుజ్జగిస్తున్న యూఏఈ.. 3 బిలియన్ డాలర్ల నగదు, 2 టన్నుల బంగారం, 15 విమానాలు బదిలీ?

ఇమ్రాన్ ఖాన్ చనిపోయారా? రచ్చలేపిన జర్నలిస్ట్ వీడియో.. క్లారిటీ ఇచ్చిన పాక్ ఆర్మీ!

Big Stories

Advertisement
×