E-Paper
Advertisement

రూ.35,000 బడ్జెట్‌లో నెక్ట్స్ లెవెల్ ఫోన్.. Realme P4s లీక్డ్ ఫీచర్లపై ఓ లుక్కేయండి!

రూ.35,000 బడ్జెట్‌లో నెక్ట్స్ లెవెల్ ఫోన్.. Realme P4s లీక్డ్ ఫీచర్లపై ఓ లుక్కేయండి!
Advertisement

Realme P4s: బడ్జెట్, మిడ్‌రేంజ్ విభాగంలో రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూజర్ల అవసరాలకు తగ్గట్లుగా అద్భుతమైన ఫీచర్లతో కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తుంటుంది. ఈ క్రమంలోనే P సిరీస్‌లో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేయడానికి రియల్‌మీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. అదే రియల్‌మీ P4s.

ధర ఎంత ఉండొచ్చు?

ప్రముఖ టిప్‌స్టర్ అందించిన లీక్స్ ప్రకారం.. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ఆగస్టు చివరి నాటికి భారత మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. మిడ్‌‌రేంజ్ విభాగంలో రానున్న ఈ ఫోన్ ప్రారంభ ధర సుమారు రూ.35,000 నుంచి రూ.40,000 వరకు ఉండే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Advertisement

Also Read: కొత్త లుక్‌లోకి Instagram.. వర్డ్‌మార్క్‌ను ఎందుకు మార్చాల్సి వచ్చిందో తెలుసా?

80W ఫాస్ట్ ఛార్జింగ్..

ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీనే అని చెప్పాలి. ఏకంగా 8000mAh భారీ బ్యాటరీతో ఈ ఫోన్ రానున్నట్లు లీక్స్ చెబుతున్నాయి. ఫోన్ ఎక్కువగా వాడేవారికి, గేమర్లకు ఇది ల్యాండ్‌మార్క్‌లా నిలుస్తుంది. దీనికి తోడు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటంతో.. ఛార్జింగ్ త్వరగా పూర్తయి సమయం బాగా ఆదా అవుతుంది.

మెరుగైన పనితీరు..

Advertisement

ఇక డిస్‌ప్లే విషయానికొస్తే.. Realme P4sలో 144Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 1.5K అమోలెడ్ (AMOLED) డిస్‌ప్లేను అందించే అవకాశం ఉంది. ఇది గేమింగ్, వీడియా స్ట్రీమింగ్ అనుభవాన్ని మరింత స్మూత్‌గా మారుస్తుంది. అలాగే మెరుగైన పెర్ఫార్మెన్స్ కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది.

స్టోరేజ్ ఎంతంటే?

ఫొటోగ్రఫీ కోసం ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను ఇవ్వనున్నారు. రోజువారీ వాడకంలో మంచి ఫొటోలు తీయడానికి ఇది సరిపోతుంది. ఇక నీరు, ధూళి నుంచి రక్షణ కోసం ఈ ఫోన్‌కు ఐపీ69 (IP69) రేటింగ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బేస్ వేరియంట్ 6GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో రానుండటంతో పనితీరు, బ్యాటరీ లైఫ్‌ను కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్ కానుంది.

Also Read: స్మూత్ డిస్‌ప్లే, కిరాక్ లుక్.. ఆండ్రాయిడ్ 16తో Moto G Max 5G భారత్‌లోకి వచ్చేసింది!

Tags

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×