E-Paper
Advertisement

రూ.16,999కే OnePlus ఫోన్.. 7,000mah బ్యాటరీతో వావ్ అనిపించే ఫీచర్లు!

రూ.16,999కే OnePlus ఫోన్.. 7,000mah బ్యాటరీతో వావ్ అనిపించే ఫీచర్లు!
Advertisement

OnePlus N6 Lite 4G: తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వారికి వన్‌ప్లస్ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా తమ N6 సిరీస్‌లో భాగంగా OnePlus N6 Lite 4Gను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. భారీ 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే వంటి ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ బడ్జెట్, మిడ్‌రేంజ్ యూజర్లను ఆకట్టుకునేలా ఉంది. గతంలో విడుదలైన N6, N6x మోడళ్లకు కొనసాగింపుగా ఈ కొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చింది.

ధర, ఆఫర్ల వివరాలు:

OnePlus N6 Lite 4G ఒకే వేరియంట్‌లో లభిస్తుంది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ మోడల్ ధర రూ.16,999గా కంపెనీ నిర్ణయించింది. మిడ్‌నైట్ హైప్, నియో గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌లోనూ కొనుగోలు చేయవచ్చు. లాంచ్ ఆఫర్‌లో భాగంగా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.750 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.

Advertisement

Also Read: సిమ్ కార్డుల దుర్వినియోగంపై DoT తీవ్ర హెచ్చరిక.. 3 ఏళ్ల జైలు, 50 లక్షల జరిమానా!

యూనిసోక్ ప్రాసెసర్:

ఈ ఫోన్‌లో 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో స్క్రీన్ స్మూత్‌గా పనిచేస్తుంది. పనితీరు కోసం Unisoc T7250 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 4GB ర్యామ్‌కు అదనంగా 8GB వరకు వర్చువల్ ర్యామ్‌ను పెంచుకోవచ్చు.

కెమెరా విషయానికొస్తే:

Advertisement

ఫోటోగ్రఫీ ప్రియుల కోసం వెనుక భాగంలో 13MP OmniVision ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5MP కెమెరాను అందించారు. రోజువారీ ఫోటోలు, సాధారణ వీడియో కాల్స్‌కు ఈ కెమెరా సెటప్ ఉపయోగపడేలా ఉంది.

7,000mAh భారీ బ్యాటరీ:

ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ 7,000mAh బ్యాటరీ. దీనికి 15W వైర్డ్ ఛార్జింగ్‌తో పాటు 5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. దుమ్ము, నీటి చినుకుల నుంచి రక్షణ కోసం IP64 రేటింగ్ ఇచ్చారు. Android 16 ఆధారిత OxygenOS 16పై ఫోన్ పనిచేస్తుంది. ముఖ్యంగా బ్యాటరీ బ్యాకప్‌కు ప్రాధాన్యత ఇచ్చే యూజర్లకు ఈ ఫోన్ ప్రత్యేకంగా నిలుస్తుంది.

Also Read: ఐఫోన్ యూజర్లకు కీలక అప్‌డేట్.. భారత్‌లోకి Apple Pay ఎంట్రీ, మరి UPI సంగతేంటి?

Tags

Related News

సిమ్ కార్డుల దుర్వినియోగంపై DoT తీవ్ర హెచ్చరిక.. 3 ఏళ్ల జైలు, 50 లక్షల జరిమానా!

ఐఫోన్ యూజర్లకు కీలక అప్‌డేట్.. భారత్‌లోకి Apple Pay ఎంట్రీ, మరి UPI సంగతేంటి?

ఇంటర్నెట్ వాడని వారికి భారీ ఊరట.. TRAI కొత్త రూల్స్‌తో రీఛార్జ్ ఖర్చు తగ్గే ఛాన్స్!

హోటల్ బాత్రూమ్ అద్దంతో పాటలు వినొచ్చా? ఈ హైటెక్ ఫీచర్‌ను ఎప్పుడైనా గమనించారా?

కీబోర్డ్ F, J కీలపై ఉండే చిన్న గీతల కథేంటి? టైపింగ్ వేగానికి, ఆరోగ్యానికి ఉన్న లింకేంటి?

ఈసారి శాంసంగ్ కొనేవారికి పండగే పండగ.. Galaxy S25 సిరీస్‌పై భారీ ఆఫర్లు!

టాబ్లెట్ కాదు, ల్యాప్‌టాప్ కాదు.. రెండింటి ఫీచర్లతో Ai Plus కొత్త డివైజ్.. ఫీచర్లు అదుర్స్!

Big Stories

Advertisement
×