Thellakaagitham Movie Trailer::కోర్ట్ మూవీతో సంచలనం సృష్టించి, బ్యాండ్ మేళం సినిమాతో పర్వాలేదనిపించుకున్న హర్ష్ రోషన్ ప్రధాన పాత్రలో నక్షత్ర హీరోయిన్గా వస్తున్న లేటెస్ట్ ఎమోషనల్ ఫీల్ గుడ్ లవ్ డ్రామా మూవీ ‘తెల్ల కాగితం’. రమేష్ బండ్రెడ్డి దర్శకత్వంలో అరుణాచల క్రియేషన్స్ పతాకం పై కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ కి విశేష ప్రేక్షక ఆదరణ లభించగా.. తాజాగా ఇప్పుడు చిత్ర బృందం మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఎమోషనల్ గా, లవ్ డ్రామాగా ఆకట్టుకోవడమే కాకుండా ఎన్నో తెలియని యూత్ ప్రశ్నలకు సమాధానం అన్నట్టు చూపించారు.
చక్కటి పల్లెటూరు వాతావరణం ప్రతిబింబించేలా.. ట్రైలర్ ను స్టార్ట్ చేశారు. స్కూల్ విద్యార్థులు.. అందులో నాటి జ్ఞాపకాలను గుర్తు చేసేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలిసీ తెలియని పసి వయసులో పుట్టే ప్రేమ, ఆ వయసులో వచ్చే ఆవేశంతో పాటు తొందరపాటులో చేసే చిన్న చిన్న తప్పులు వల్ల ఎలాంటి తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి అనేదే చిత్ర కథాంశం..
“తెలిసీ తెలియని వయసులో మీరు చేసే ఆ ఒక్క చిన్న తప్పు.. తెల్లటి కాగితం లాంటి మీ జీవితాన్ని నాశనం చేస్తుంది ” అంటూ వచ్చే పవర్ ఫుల్ డైలాగ్ కథలోని అసలు నిజాన్ని, భావోద్వేగ తీవ్రతను ఆవిష్కరిస్తుంది. చివర్లో హీరో తన వదినతో..” వదిన.. మగాళ్లు మెచ్యూర్ అవ్వరా?” అని అడిగితే.. మగాళ్లు కూడా మెచ్యూర్ అవుతారు.. “ఆడవాళ్లు నోటితో చెప్పకపోయినా వాళ్ళ బాధలను అర్థం చేసుకున్నప్పుడు మెచ్యూర్ అయినట్టు” అంటూ చెప్పే డైలాగ్ కూడా ఆకట్టుకుంటోంది.
also read:వాయిదా పడ్డ ‘ఆదర్శ కుటుంబం-AK47’.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
బేబీ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ అందించిన మెలోడీ సంగీతం సినిమాకు మరింత ఆకర్షణగా నిలవబోతోందని ట్రైలర్ తోనే చెప్పేశారు. స్కూల్ లైఫ్ జ్ఞాపకాలను, యూత్ ఫుల్ ఎమోషన్స్ ను, లవ్ స్టోరీలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా విడుదల కాబోతోంది. అజయ్, దీపక్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్యూర్ టీనేజ్ ఎమోషనల్ డ్రామాగా రాబోతున్న ఈ తెల్ల కాగితం మూవీ ఆడియన్స్ ను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.