E-Paper
Advertisement

నిమ్స్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ పాపాల పుట్ట బద్దలు.. ఏసీబీ దాడుల్లో సంచలనాలు!

నిమ్స్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ పాపాల పుట్ట బద్దలు.. ఏసీబీ దాడుల్లో సంచలనాలు!
Advertisement

Lakshmi Bhaskar: స్వేచ్ఛ బ్యూరో: అధికారాన్ని ఉపయోగించుకుని భారీగా ఆస్తులు కూడబెట్టుకున్న నిమ్స్​ హాస్పిటల్​ అడిషనల్ మెడికల్​ సూపరిండింటెంట్​ లక్ష్మీభాస్కర్​ పై ఆది నుంచి పలు ఆరోపణలు ఉన్నాయి. తనతోపాటు చదువుకున్న స్నేహితున్ని మోసం చేశాడన్న నేరారోపణలపై బంజారాహిల్స్​ పోలీస్​ స్టేషన్​ లో క్రిమినల్​ కేసులు కూడా నమోదయ్యాయి. అయితే, తనకున్న పలుకుబడి..పరపతితో ఇన్నాళ్లూ మేనేజ్​ చేసుకుంటూ వచ్చిన లక్ష్మీభాస్కర్​ చివరకు ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. నిమ్స్​ ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్​ గా చేరిన లక్ష్మీభాస్కర్​ అంచెలంచెలుగా అదనపు మెడికల్​ సూపరిండింటెంట్​ స్థాయికి ఎదిగాడు.

మెడికల్​ కాలేజీలో..

ఈ మధ్య కాలంలో ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. తనతోపాటు కాకినాడ మెడికల్​ కాలేజీలో చదువుకున్న డాక్టర్​ శ్రీరాములకు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ప్లాట్​ ఇప్పిస్తానని నమ్మించి 50లక్షల రూపాయలు తీసుకున్నాడు. అయితే, ప్లాట్​ మాత్రం ఇప్పించ లేదు. దీనిపై శ్రీరాములు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, తెర వెనక ఏం జరిగిందోగానీ పోలీసులు కేసులు నమోదు చేయలేదు. నేరుగా హైదరాబాద్​ పోలీస్​ కమిషనర్ కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. దాంతో శ్రీరాములు నాంపల్లి కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన తరువాత బంజారాహిల్స్​ పోలీసులు లక్ష్మీభాస్కర్ పై కేసులు నమోదు చేశారు. అయితే, అరెస్ట్​ మాత్రం చేయలేదు.

Advertisement

Also read: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. రంగంలోకి సీఎం రేవంత్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ!

కరోనా సమయంలో..

కరోనా సమయంలో ఓ రోగికి బెడ్​ ఇప్పించి చికిత్స అందించటానికి మధ్యవర్తి ద్వారా లక్ష రూపాయలు వసూలు చేసినట్టుగా కూడా లక్ష్మీభాస్కర్​ పై ఆరోపణలు వచ్చాయి. దీనిపై డబ్బు ఇచ్చిన బాధితుడు పంజగుట్ట స్టేషన్​ లో ఫిర్యాదు చేయగా కేసులు కూడా నమోదయ్యాయి. అయితే, అతనితో రాజీ కుదుర్చుకుని లక్ష్మీభాస్కర్​ ఈ కేసులను లోకాయుక్తలో కొట్టివేయించుకున్నట్టుగా నిమ్స్​ ఉద్యోగులే చెబుతున్నారు. నిమ్స్ హాస్పిటల్​ ఆరోగ్యశ్రీ గదిలో పెద్దమొత్తంలో లభించిన బాణాసంచా వెనక కూడా ఈయనే ఉన్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి.

ఫైనాన్స్​ దందా..

Advertisement

తనకు ప్రభుత్వంలోని కీలక నాయకులు, కొందరు సీనియర్​ అధికారులతో సన్నిహిత పరిచయాలు ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చిన లక్ష్మీభాస్కర్​ పెద్దమొత్తంలో ఫైనాన్స్​ దందా కూడా నడిపించాడు. ఆస్పత్రిలోని కొందరు ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగులను ఏజెంట్లుగా పెట్టుకుని వడ్డీలు వసూలు చేసేవాడని కూడా ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఏసీబీ అధికారులు దాడులు జరిపి చేసిన తనిఖీల్లో లక్ష్మీభాస్కర్ కోటీ 33లక్షల రూపాయలను పలువురికి అప్పులుగా ఇచ్చినట్టు నిర్ధారణ కావటం గమనార్హం.

Also read: ఇంటిమేట్ సీన్స్‌లో అసలు మ్యాటర్ ఇదే.. విషయం చెప్పిన క్రేజీ డైరెక్టర్ !

Tags

Related News

ఎమ్మెల్సీ ఎన్నికలకు కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా..?

ఏసీబీకి చిక్కిన మంచిర్యాల గ్రామ పరిపాలనా అధికారి!

ప్రభుత్వ వైద్యం దయనీయం.. చిన్నారుల చావుల్లోనూ నిర్లక్ష్యమా?.. కవిత తీవ్ర ఆగ్రహం!

‘సర్’ ప్రక్రియ హాస్యాస్పదం.. ఈసీకి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు.. కాంగ్రెస్‌ వైఖరిపై ధ్వజం!

ఇలా ఉన్నారేంట్రా.. ట్రాక్టర్‌ని విప్పేసి ఇంజన్ ఎత్తుకెళ్లిన దొంగలు.. ఎక్కడో తెలుసా..?

హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. రంగంలోకి సీఎం రేవంత్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ!

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్!

Big Stories

Advertisement
×