Balagam Venu: ఏ డైరెక్టర్ అయినా ప్రేక్షకుల మీద ఇంపాక్ట్ క్రియేట్ చేయాలంటే ఒక్క సినిమా చాలు. ఈరోజుల్లో తెలంగాణ కల్చర్‌పై సినిమా తెరకెక్కిస్తే అసలు ప్రేక్షకులు దానిని చూస్తారా, ఎంకరేజ్ చేస్తారా అని అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్న సమయంలోనే ‘బలగం’తో వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు వేణు. ఒకప్పుడు కామెడియన్‌గా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన వేణులో ఒక డైరెక్టర్ కూడా ఉన్నాడని ఎవరూ ఊహించలేకపోయారు. డైరెక్టర్‌గా మారడం మాత్రమే కాకుండా మొదటి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ సాధించి ఎన్నో అవార్డులు కూడా అందుకున్నాడు. తాజాగా తన అప్‌కమింగ్ మూవీ ‘ఎల్లమ్మ’పై ఆసక్తికర అప్డేట్ అందించాడు.
‘ఎల్లమ్మ’ పరిస్థితి ఏంటి.?
‘బలగం’లాంటి సినిమాతో తెలంగాణ కల్చర్‌ను ప్రేక్షకులకు తెలిసేలా చేశాడు వేణు. ఇకపై తాను డైరెక్ట్ చేసే ఇతర సినిమాల్లో కూడా కల్చర్ ఉట్టిపడేలాగా చేస్తానని అప్పట్లోనే మాటిచ్చాడు వేణు. చెప్పినట్టుగానే తన తరువాతి సినిమాకు ‘ఎల్లమ్మ’ (Yellamma) అనే టైటిల్ ఉంటుందని అనౌన్స్ చేశాడు. ఈ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారు అనే విషయంపై చాలాకాలం పాటు ప్రేక్షకుల్లో కన్ఫ్యూజన్ ఏర్పడింది. నాని, నితిన్.. ఇలా పలువురు యంగ్ హీరోల పేర్లు వినిపించాయి. ముందుగా ఈ సినిమా నితిన్ దగ్గరకు వెళ్తే తను ఒప్పుకోలేదని, చివరికి తనే ఫైనల్ అయ్యాడని వార్తలు వచ్చాయి. మరి హీరో కూడా ఫైనల్ అవ్వడంతో అసలు ‘ఎల్లమ్మ’ ఎక్కడ వరకు వచ్చిందనే విషయంపై క్లారిటీ ఇచ్చాడు బలగం వేణు (Balagam Venu).
Also Read: పుష్ప హీనాతిహీనమైన సినిమా , ఇలాంటి సినిమాను ప్రభుత్వం ఖండించాలి
ప్రెజర్ ఉంది
‘‘ఎల్లమ్మ ఎలా ఉండబోతుందో నేను ఇప్పుడే చెప్పలేను. బలగం తర్వాత ఏం తీస్తున్నాడు అనే ప్రెజర్ కచ్చితంగా చాలా ఉంది. సమయం గడుస్తుంటే ఆ ప్రెజర్‌ను బాధ్యతలాగా ఫీల్ అవుతున్నాను. బలగం సినిమా హిట్ మాత్రమే కాకుండా చాలామంది దగ్గర నుండి ప్రేమ, గౌరవం ఇచ్చింది అందుకు నేను అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. ముందు ప్రేమించారు. తర్వాత గౌరవిస్తున్నారు. దాన్ని నిలుపుకోవాలనే నేను గ్యాప్ తీసుకుంటున్నాను. నన్ను ఎంత ప్రేమించారో, ఆదరించారో, గౌరవించారో.. దానిని మళ్లీ దక్కించుకోవాలి, నిలబెట్టుకోవాలనే స్క్రిప్ట్‌పైన నేను ఎక్కువ టైమ్ తీసుకుంటున్నాను’’ అంటూ తనపై ఉన్న ప్రెజర్ గురించి బయటపెట్టాడు వేణు.
అన్నీ ఉంటాయి
‘‘ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనల్ డ్రాఫ్ట్ జరుగుతోంది. కచ్చితంగా ప్రేక్షకులు అందరికీ ఇది నచ్చుతుంది. ఇందులో కల్చర్ ఉంటుంది. ఎమోషన్ ఉంటుంది. విలువలు ఉంటాయి’’ అని సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయంపై క్లారిటీ ఇచ్చాడు వేణు. ‘బలగం’ సినిమాను చాలా ఇష్టపడిన వారు వేణు అప్‌కమింగ్ మూవీ ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ విడుదలయ్యి ఏడాది దాటిపోయింది. ఎన్నో గ్రామాల్లో ప్రజలు కలిసి ‘బలగం’ సినిమాను చూసి ఆదరించారు. దిల్ రాజు నిర్మాణం వల్ల ఈ మూవీపై హైప్ క్రియేట్ అయ్యింది. కానీ మౌత్ టాక్‌తోనే ‘బలగం’ బ్లాక్‌బస్టర్ అవ్వగలిగింది.