Tirupathi politics: వైసీపీలో ఏం జరుగుతోంది? నిన్నటివరకు నేతలు వలసబాట పట్టేవారు? ఇప్పుడు దిగువ స్థాయి నేతల వంతైందా? ఒకప్పుడు ఏపీ వ్యాప్తంగా మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో బలంగా ఆ పార్టీ కనిపించేదా? ఇప్పుడు అక్కడ కూడా సీన్ తారుమారవుతుందా? రాబోయే రోజుల్లో వైసీపీ పరిస్థితి ఏంటి? ఇవే ప్రశ్నలు వైసీపీ శ్రేణులను వెంటాడుతున్నాయి.
ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. వైసీపీ కోటలకు సైతం బీటలు వారుతున్నాయి. కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే కాదు.. చివరకు మున్సిపల్ వైస్ ఛైర్మన్, డిప్యూటీ మేయర్ల పీఠాలు సైతం తారుమారు అవుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే తమ ప్రాంతాలు అభివృద్ధి కావన్నది వైసీపీలో దిగువస్థాయి కేడర్ మాట.
ఒకప్పుడు బలంగా కనిపించిన వైసీపీ, రోజురోజుకూ దిగజారే పరిస్థితికి చేరుకుంటోంది. దీనికి ఉదాహరణ రీసెంట్‌గా జరుగుతున్న డిప్యూటీ మేయర్, మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నికలు. తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వైసీపీ ఎదురుగాలి తగిలింది. టీడీపీ అభ్యర్థి మునికృష్ణ విజయం సాధించారు. ఆయనకు 26 మంది కార్పొరేటర్లు మద్దతు తెలిపారు. వైసీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డికి 21 మంది ఓటు వేశారు. దీంతో తిరుపతి డిప్యూటీ మేయర్ పదవిని టీడీపీ దక్కించుకుంది.
దీనిపై మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. మేం ఓడి గెలిచాం.. వాళ్లు గెలిచి ఓడిపోయారంటూ ఎక్స్ వేదికగా ప్రస్తావించారు. తిరుపతి నగర పాలక సంస్థ ఉప మేయర్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఓడిపోవడాన్ని ప్రజాస్వామ్య ఓటమిగా వర్ణించారు. విధుల నిర్వహణలో మేయర్ శిరీషను అవమానించారని వ్యాఖ్యానించారు.
ALSO READ: ప్రేయసితో సహజీవనం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య, ఆపై ఫైటింగ్
మున్సిపల్ కార్పొరేషన్ లోపల సమావేశం జరుగుతుంటే మేయర్ శిరీష్ బయట ఆందోళన చేసే పరిస్థితి నెలకొందన్నారు. ఈ విధంగా చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. వ్యవస్థల ఉదాసీనత, అధికార దుర్వినియోగం గెలిచిందని వ్యాఖ్యానించారు. సమయం వచ్చినప్పుడు ప్రజలకు సమాధానం చెబుతారని మనసులోని ఆవేదన వ్యక్తం చేశారు రోజా.
అటు నందిగామ మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి, పదో వార్డు కౌన్సెలర్ మండవ కృష్ణ కుమారి ఎన్నికయ్యారు. ఎంపీ, ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థులను కాదని ఆమెకు పార్టీ అధిష్టానం అవకాశం ఇచ్చింది. సక్సెస్ అయ్యారు. నెల్లూరు, గుంటూరు, ఏలూరు కార్పొరేషన్లలో ఇదే పరిస్థితి నెలకొంది. డిప్యూటీ పదవులను టీడీపీ దక్కించుకుంది.
పార్టీలో జరుగుతున్న పరిణామాలను వైసీపీ దిగువస్థాయి కేడర్ నిశితంగా పరిశీలిస్తోంది. గత ఎన్నికల్లో చాలా వరకు నిధులు ఖర్చు చేశామని చెబుతున్నారు. అయినా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నిధులు లేక పనులు ఆగిపోయాయి. తమ ముఖం ప్రజలకు చూపించలేక పోతున్నామని అంటున్నారు.
ప్రస్తుత ప్రభుత్వం నిధులు విడుదల చేసి పనులు చేయిస్తోంది. ఇలాంటి సమయంలో ప్రజల వద్దకు వెళ్లలేక అనేక సమస్యలు ఏర్పడుతున్నట్లు కొందరు నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో తాము పార్టీలు మారాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇప్పట్లో వైసీపీ కోలుకునే పరిస్థితి ఏందన్నది కొందరు విశ్లేషకుల మాట.
మేం ఓడి గెలిచాం.. వాళ్లు గెలిచి ఓడిపోయారు: మాజీ మంత్రి రోజా
తిరుపతి నగర పాలక సంస్థ ఉప మేయర్ ఎన్నికల్లో మా అభ్యర్థి ఓటమి ప్రజాస్వామ్య ఓటమి
విధుల నిర్వహణలో మేయర్ శిరీషను అవమానించారు
మున్సిపల్ కార్పొరేషన్ లోపల సమావేశం జరుగుతుంటే మేయర్ శిరీష్ బయట ఆందోళన చేసే పరిస్థితి ఏర్పడటం… https://t.co/KJyAFzq66s pic.twitter.com/DYiN5sl9P2
— BIG TV Breaking News (@bigtvtelugu) February 4, 2025